సుకుమార్ కి ఉన్న ఆ ప్రాబ్లం వల్ల డీఎస్పీ ని పక్కన పెడితే మ్యూజికల్ ఆల్బమ్ హిట్ వస్తుందా?

తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. రాజమౌళి, సుకుమార్ లాంటి దర్శకులు డిఫరెంట్ కాన్సెప్ట్ లతో వచ్చి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నారు.

Update: 2026-10-23 05:20 GMT

తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. రాజమౌళి, సుకుమార్ లాంటి దర్శకులు డిఫరెంట్ కాన్సెప్ట్ లతో వచ్చి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నారు. స్క్రీన్ ప్లే విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. సుకుమార్ ఇంతకుముందు చేసిన 'పుష్ప 2' సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేశాడు. ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ గా సుకుమార్ నేషనల్ అవార్డ్ ను అందుకున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ తో చేస్తున్న సినిమాతో మరోసారి పెను సంచలనాన్ని క్రియేట్ చేయాలనే ధృడ సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు... ఇప్పటివరకు సుకుమార్ చేసిన అన్ని సినిమాలకి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించాడు. కానీ ఈ సినిమా కోసం వేరే మ్యూజిక్ డైరెక్టర్లను సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తుంది...

సుకుమార్ ఆ రేంజ్ మ్యూజిక్ ను రాబడతాడా?

దేవిశ్రీప్రసాద్ 'ఎల్లమ్మ' సినిమాతో హీరోగా మారిన నేపథ్యంలో ఆయన సుకుమార్ సినిమాకి మ్యూజిక్ ని అందించలేకపోతున్నాడు. సుకుమార్ సినిమాల్లో మ్యూజిక్ చాలా కీలకపాత్ర వహిస్తుంది. వీళ్ళ కాంబోలో వచ్చిన సినిమాల్లో పాటలన్నీ సక్సెస్ ని సాధించాయి. అన్ని మూవీస్ ఆల్బమ్స్ ట్రెండ్ సెట్ చేశాయి. ఇప్పటివరకు సుకుమార్ సినిమా బిజీలో ఉంటూ మ్యూజిక్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదట. భారం మొత్తం దేవిశ్రీ ప్రసాద్ మీదనే వేసేవాడట. దేవి ప్రాణం పెట్టీ వర్క్ చేసి బెస్ట్ ఔట్ పుట్ తీసుకొచ్చేవాడు. ఇప్పుడు దేవీ బిజి గా ఉండట వల్ల సుకుమార్ కి పెద్ద కష్టం వచ్చింది. దేవి ప్లేస్ లో యువ సంచలనం అయిన అనిరుధ్ ను, లేదంటే 'దురంధర్' సినిమా సక్సెస్ లో కీలకపాత్ర వహించిన సంగీత దర్శకుడు 'శాశ్వత్ సచ్ దేవ్' ను తీసుకోవాలనే ప్రణాళికలో సుకుమార్ ఉన్నాడట. వాళ్ళలో ఎవరో ఒక్కరిని తీసుకుంటే సుకుమార్ వాళ్ల నుంచి ఎలాంటి మ్యూజిక్ ని రాబట్టగలుగుతాడు.

దేవి శ్రీ ప్రసాద్ సుకుమార్ కి మధ్య ఉన్న మంచి ఫ్రెండ్షిప్ వల్ల సుకుమార్ కి ట్యూన్ నచ్చే వరకు దేవి కొత్త ట్యూన్స్ ఇస్తూనే ఉండేవాడు. అలాగే సుకుమార్ కి ఎలాంటి ట్యూన్స్ అయితే నచ్చుతాయో దేవికి చాలా బాగా తెలుసు వాళ్ళిద్దరి మధ్య స్టోరీ కి సంబంధించిన ప్రతి డిస్కషన్ జరుగుతుంది. కాబట్టి వాళ్లు ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ముందుకు సాగుతారు. సుకుమార్ వీళ్ళతో వెళితే ఆయనకున్న ఇంట్రోవర్ట్ కి వాళ్లతో మాట్లాడి తనకు కావాల్సిన మ్యూజిక్ ని పర్ఫెక్ట్ గా తీసుకు రాగలుగుతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది...

రామ్ చరణ్ ప్రాజెక్ట్

గతంలో 'రంగస్థలం' మూవీతో రామ్ చరణ్ లోని పూర్తి స్థాయి నటుడిని బయటికి తీసిన సుకుమార్ ఇప్పుడు మరో డిఫరెంట్ గెటప్ లో రామ్ చరణ్ ను చూపిస్తున్నాడట. రీసెంట్ గానే లుక్ ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది. రామ్ చరణ్ కి కొత్త మెకోవర్ ఇచ్చి మరోసారి ఈ మూవీ తో పాన్ ఇండియా రికార్డులను బ్రేక్ చేయాలనే ఉద్దేశ్యంతో సుకుమార్ ఉన్నట్టుగా తెలుస్తుంది...

Tags:    

Similar News