పెళ్లి వేడుకలతో రికార్డ్ సృష్టించబోతున్న కావ్య - అనిరుధ్!
కావ్య మారన్, అనిరుధ్ల వివాహం విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్‌గా జరగనుంది.
సంగీత ప్రపంచంలో రోక్స్టార్గా పేరుగాంచిన తమిళ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్ టీవీ నెట్వర్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు ఐపీఎల్ టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ అధినేత్రి కావ్య మారన్ పెళ్లి పీటలు ఎక్కబోతుండటంతో సౌత్ ఇండియా వ్యాప్తంగా ఊహించని రేంజ్లో కలకలం రేగుతోంది. వీరిద్దరూ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో, ఈ పెళ్లి వేడుకలు ఎంత గ్రాండ్‌గా జరగబోతున్నాయనే విషయం ఇప్పుడు ఇండస్ట్రీ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఆ హంగామా గురించిన ఆసక్తికర విషయాలు చూద్దాం..
గ్రీస్ డెస్టినేషన్ వెడ్డింగ్:
కావ్య మారన్, అనిరుధ్ల వివాహం విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్‌గా జరగనుంది. గ్రీస్ దేశంలో అత్యంత రమణీయమైన ప్రదేశంలో అతికొద్ది మంది అత్యంత సన్నిహితులు, ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ పెళ్లి వేడుక జరగనుందని వార్తలు వస్తున్నాయి. ఇక ఎంతో ప్రైవేట్‌గా, రాయల్ థీమ్‌తో జరిగే ఈ పెళ్లి వేడుక తర్వాత, ఇండియాలో రెండు భారీ పండుగ లాంటి ఈవెంట్లను నిర్వహించడానికి ఇరు కుటుంబాలు గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నాయి.
ఐటీసీ గ్రాండ్ చోళాలో రాయల్ రిసెప్షన్:
డెస్టినేషన్ వెడ్డింగ్ ముగిసిన వెంటనే చెన్నైలోని ప్రతిష్టాత్మక 'ఐటీసీ గ్రాండ్ చోళా' హోటల్లో అత్యంత వైభవంగా వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుంది. ఈ రిసెప్షన్‌కు దక్షిణ భారత్‌తో పాటు ఉత్తరాదికి చెందిన టాప్ ఫిల్మ్ సెలబ్రిటీలు, రాజకీయ దిగ్గజాలు, వ్యాపార రంగ ప్రముఖులు భారీగా హాజరుకాబోతున్నారు. ఇక ఇప్పటికే కావ్య మారన్ తండ్రి కళానిధి మారన్ కుటుంబ సభ్యులు పలువురు ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులకు స్వయంగా వెళ్లి ఆహ్వాన పత్రికలను అందిస్తున్నారు.
ఫామ్‌హౌస్‌లో క్లోజ్ ఫ్రెండ్స్‌కు గ్రాండ్ బాష్:
చెన్నైలో జరిగే గ్రాండ్ రిసెప్షన్ ముగిసిన తర్వాత, అనిరుధ్ మరియు కావ్య మారన్ తమ క్లోజ్ ఫ్రెండ్స్ కోసం మరో స్పెషల్ పార్టీని ప్లాన్ చేశారు. చెన్నై శివార్లలోని ఒక లగ్జరీ ఫామ్‌హౌస్‌లో ఈ ప్రైవేట్ వెడ్డింగ్ బాష్ జరగనుందని తెలుస్తోంది. సంగీత ప్రపంచానికి చెందిన మిత్రులు, ఐపీఎల్ ఫ్రెండ్స్, అనిరుధ్ గ్యాంగ్ ఈ పార్టీలో పాల్గొని సందడి చేయనున్నారు. వేడుకల స్థాయి చూస్తుంటే ఇది టాలీవుడ్, కోలీవుడ్ చరిత్రలోనే మైలురాయిగా నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇక మొత్తానికి చూస్తే, బిజినెస్ వరల్డ్ పాప్యులర్ ఫేస్ కావ్య మారన్, మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ జంటగా మారబోతున్న ఈ వెడ్డింగ్ ఈవెంట్స్ సోషల్ మీడియాలోనే కాక, ఇండస్ట్రీ వర్గాల్లోనూ సరికొత్త రికార్డులను నమోదు చేయనున్నాయి. ఇక అతి త్వరలోనే వీరిద్దరి వివాహానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉండటంతో అభిమానులు కూడా ఈ బిగ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కోసం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.