భైరవ మళ్లీ వచ్చేశాడు.. 'కల్కి 2' సర్ ప్రైజ్
బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి, మైథాలజీ సైన్స్ ఫిక్షన్ జానర్లో కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసిన 'కల్కి 2898 AD' సీక్వెల్‌పై ఆడియన్స్‌లో ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి, మైథాలజీ సైన్స్ ఫిక్షన్ జానర్లో కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసిన 'కల్కి 2898 AD' సీక్వెల్‌పై ఆడియన్స్‌లో ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రెండు జాతీయ అవార్డులు అందుకున్న ఈ సినిమా కొనసాగింపు ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లేటెస్ట్ గా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు నాగ్ అశ్విన్, వైజయంతి మూవీస్ టీమ్ ఒక స్పెషల్ బిహైండ్ ద సీన్స్ వీడియోను వదిలి డార్లింగ్ ఫ్యాన్స్‌కు డీసెంట్ సర్ప్రైజ్ ఇచ్చింది.
ఈ వీడియో ఏమాత్రం ఆర్భాటం లేకుండా పక్కా ప్రాక్టికల్ వర్కింగ్ వాతావరణాన్ని చూపించేలా కట్ చేశారు. సెట్స్‌లో భారీ క్రేన్లు, లైటింగ్ సెటప్, వెల్డింగ్ పనులతో గ్రౌండ్ లెవెల్ ప్రిపరేషన్స్ ఎలా సాగుతున్నాయో కెమెరాలో క్యాప్చర్ చేశారు. దర్శకుడు నాగ్ అశ్విన్ మానిటర్ ముందు కూర్చుని మైక్‌లో "యాక్షన్" అని చెప్పే షాట్ హైలెట్ అయ్యింది.
వీడియో చివర్లో వచ్చిన 'భైరవ ఈజ్ బ్యాక్' అనే టైటిల్ కార్డు, ఆ వెంటనే ప్రభాస్ తన స్టైలిష్ సూపర్ హీరో కాస్ట్యూమ్ వేసుకుంటూ కనిపించడం మెయిన్ హైలైట్. బుజ్జి వాహనంపై చేతులు వేయడం, సూట్ అడ్జస్ట్ చేసుకోవడం లాంటి విజువల్స్ చూపించి, చివర్లో ప్రభాస్ సిల్హౌట్ లుక్‌తో "హ్యాపీ బర్త్‌డే భైరవ" అని ముగించారు. ఇందులో ఎలాంటి భారీ డైలాగ్స్ లేదా కొత్త సీన్లు లేకపోయినా, పార్ట్ 2 సెట్స్ సిద్ధమవుతున్నాయనే సంకేతాన్ని పర్ఫెక్ట్గా ఇచ్చారు.
మొదటి భాగంలో భైరవ క్యారెక్టర్‌ను ఒక సాధారణ బౌంటీ హంటర్‌గా చూపిస్తూనే, క్లైమాక్స్‌లో ఇచ్చిన కర్ణ ట్విస్ట్ థియేటర్లలో పూనకాలు తెప్పించింది. ఇప్పుడు సీక్వెల్ కథ మొత్తం ఆ కర్ణుడి ఎలివేషన్, అశ్వత్థామ పాత్రతో ముడిపడి ఉండబోతోందనే విషయం తెలిసిందే. అయితే ఈ బర్త్‌డే గ్లింప్స్‌లో మాత్రం నాగ్ అశ్విన్ అనవసరమైన హైప్ జోలికి పోకుండా, ప్యూర్ వర్కింగ్ మూడ్‌ను మాత్రమే ప్రజెంట్ చేసి చాలా బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఫాలో అయ్యారు.
నిర్మాత సి. అశ్వినీదత్ ఈ ప్రాజెక్ట్‌ను మొదటి భాగం కంటే భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి లెజెండరీ యాక్టర్ల కాంబినేషన్ ఈ రెండో భాగంలో మరింత కీలకం కానుంది. మొదటి భాగం సృష్టించిన ఇంపాక్ట్‌ను మ్యాచ్ చేయడం ఈ సీక్వెల్ ముందున్న అతిపెద్ద సవాలు. కథను ఎంత కొత్తగా నడిపిస్తారనే దానిపైనే సినిమా అసలైన ఫలితం ఆధారపడి ఉంటుంది.
ప్రభాస్ పుట్టినరోజు నాడు హడావుడి టీజర్లు కాకుండా, మేకింగ్ ప్రాసెస్‌ను చూపిస్తూ వదిలిన ఈ చిన్న వీడియో ఫ్యాన్స్‌ను సంతృప్తిపరిచేలా ఉంది. భైరవ కాస్ట్యూమ్‌లో ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ మళ్లీ ఆ 'కల్కి' ప్రపంచాన్ని గుర్తుచేసింది. త్వరలోనే రెగ్యులర్ షూట్ మొదలుపెట్టి అసలైన కంటెంట్‌తో వస్తే బాక్సాఫీస్ దగ్గర భైరవ చేసే సౌండ్ గట్టిగానే ఉండే అవకాశం ఉంది.