స్క్విడ్ గేమ్ స్ఫూర్తితోనే.. తన సినిమా జానర్‌పై విశ్వక్ సేన్ కామెంట్స్!
ఈ నేపథ్యంలోనే గ్యాప్ తీసుకుని పూర్తిగా తానే డైరెక్ట్ చేసి తెరకెక్కించిన ఈ యాక్షన్ స్లాషర్ థ్రిల్లర్ మూవీ అక్టోబర్ 30న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా విశేషాలు ఇప్పుడు చూద్దాం..
టాలీవుడ్‌లో వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తాజాగా దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న 'కల్ట్' సినిమా ఇంతకు ముందు 'ఈ నగరానికి ఏమైంది', 'ఫలక్‌నుమా దాస్', 'హిట్' వంటి సినిమాలతో మంచి విజయాలు అందుకున్న ఆయన, కొద్దికాలంగా కొన్ని రొటీన్ చిత్రాలతో నిరాశపరిచారు. ఈ నేపథ్యంలోనే గ్యాప్ తీసుకుని పూర్తిగా తానే డైరెక్ట్ చేసి తెరకెక్కించిన ఈ యాక్షన్ స్లాషర్ థ్రిల్లర్ మూవీ అక్టోబర్ 30న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా విశేషాలు ఇప్పుడు చూద్దాం..
టైటిల్ వివాదంపై విశ్వక్ సేన్ క్లారిటీ:
'కల్ట్' టైటిల్ రిజిస్ట్రేషన్ గురించి విశ్వక్ సేన్ ఇటీవల ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఫిలిం ఛాంబర్‌లో ఈ టైటిల్‌ను తానే స్వయంగా రిజిస్టర్ చేయించానని, ఆ సమయంలో ఈ పేరుతో మరే ఇతర టైటిల్ అందుబాటులో లేదని స్పష్టం చేశారు. అయితే తాను తీసుకున్న తర్వాత ఈ టైటిల్ కోసం మరో ఇద్దరు పోటీ పడ్డారని, కానీ తాను కాస్త ముందే వచ్చి ఈ టైటిల్‌ను దక్కించుకున్నానని ఆయన సరదాగా వెల్లడించారు.
'స్క్విడ్ గేమ్' స్ఫూర్తితోనే 'కల్ట్' ఐడియా!;
ఈ కొత్త జానర్ ఐడియా తనకు ఎలా వచ్చిందనే దానిపై విశ్వక్ స్పందిస్తూ.. ఇది ఒక పార్టీ థ్రిల్లర్ మూవీ అని, పార్టీలో ఉంటే గేమ్స్ ఆడితే బాగుంటుందనే ఆలోచన నుంచి ఈ కథ పుట్టిందని తెలిపారు. ముఖ్యంగా సంచలనం సృష్టించిన 'స్క్విడ్ గేమ్' వెబ్ సిరీస్ చూశాక, ఇలాంటి సర్వైవల్ స్లాషర్ జానర్‌లో సినిమా తీయొచ్చని, మన దగ్గర కూడా ఇలాంటి సినిమాలను ఆదరించే ఆడియన్స్ ఉన్నారని తనకు నమ్మకం కుదిరిందని ఆయన చెప్పారు.
గోవా పబ్ బ్యాక్‌డ్రాప్‌లో వైలెంట్ గేమ్:
మొన్న రిలీజ్ అయినా ట్రైలర్‌ను బట్టి చూస్తే 'కల్ట్' సినిమా గోవాలోని ఒక పబ్ నేపథ్యంలో సాగుతుంది. 'కల్ట్' అనే ఆ పబ్‌లో దాదాపు 300 మందికి పైగా పార్టీ చేసుకుంటున్న సమయంలో కొందరు దుండగులు వారిని లోపలే లాక్ చేసి ఒక ప్రాణాంతకమైన గేమ్ పెడతారు. ఇక ఆ గేమ్‌లో ఓడిపోతే నేరుగా చావే గతి అవుతుంది. ఆ పబ్‌లోనే ఇన్‌స్పెక్టర్ సంకల్ప్ నాయక్ పాత్రలో విశ్వక్ సేన్ కూడా ఉంటాడు. మరి ఆ ప్రమాదకరమైన సెటప్ నుంచి వాళ్లంతా ఎలా బయటపడ్డారనేదే ఈ సినిమా అసలు కథ.
గాయత్రి భరద్వాజ్ జోడీ.. రవి బస్రూర్ మ్యూజిక్:
ఈ సినిమాలో విశ్వక్ సేన్‌కు జోడీగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, 'కేజీఎఫ్' ఫేమ్ రవి బస్రూర్ ఈ చిత్రానికి అదిరిపోయే సంగీతం అందిస్తున్నారు. ట్రైలర్‌లో వచ్చే చాలా సన్నివేశాలు అత్యంత వయలెంట్‌గా, రెక్లెస్ యూత్‌ను టార్గెట్ చేసేలా ఉన్నాయి. ఇక కేవలం పెద్దలు మరియు యూత్ మాత్రమే చూడదగ్గ ఈ వైలెంట్ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ఇక మొత్తానికి చూస్తే, వైవిధ్యమైన ప్రయోగాలతో ఎప్పుడూ ముందుండే విశ్వక్ సేన్.. ఈసారి 'కల్ట్' సినిమాతో ఒక సరికొత్త స్లాషర్ థ్రిల్లర్ జానర్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేస్తున్నారు. ఇక అక్టోబర్ 30న రాబోతున్న ఈ సినిమాతో ఆయన మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతారా లేదా అనేది వేచి చూడాలి.