కాల్షీట్లు ఇవ్వకుండా సతాయిస్తున్న స్టార్ హీరోయిన్!
ఏదైనా సినిమాకి సంతకం చేసాక .. కాల్షీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఆ విషయంలో ఎందుకనో తాత్సారం చేస్తూ స్టార్ హీరోయిన్ అనుష్క నిర్మాతలను డైలమాలోకి నెట్టారట. టాలీవుడ్ లోనే స్వీటెస్ట్ హీరోయిన్ ఇలా చేస్తుందా.. ఇది నిజమా? అంటే.. అవుననే గుసగుసలు వినిపిస్తున్నాయి.
అరుంధతి-భాగమతి లాంటి సోలో బ్లాక్ బస్టర్ల లో నటించి తనకంటూ మార్కెట్ రేంజును విస్తరించుకున్నారు అనుష్క. కానీ నిశ్శబ్ధం లాంటి చేదుగుళికలు కెరీర్ లో ఉన్నాయి. నిశ్శబ్ధం టైటిల్ కి తగ్గట్టే థ్రిల్లర్ లో మూగ అమ్మాయిగా అనుష్క అద్భుతంగా నటించినా కానీ ఆ సినిమా హిట్టవ్వలేదు. దీంతో స్క్రిప్టుల పరంగా ఆచితూచి అడుగులు వేస్తోందట.
అయితే ఇప్పటికే కన్ఫామ్ అయిన యువి క్రియేషన్స్ మూవీ ఎప్పటి నుంచి మొదలవుతుంది? అంటే స్వీటీ కోసమే వెయిటింగ్ అని తెలిసింది. అయినా అనుష్కలో ఎందుకీ డైలమా? కాల్షీట్లు ఇచ్చేస్తే పని మొదలైపోతుంది కదా? అని ప్రశ్నిస్తున్నారు కొందరు. అయితే స్వీటీ ఏం చేయాలన్నా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. స్క్రిప్టు పరంగా వందశాతం క్లారిటీ వస్తే సెట్స్ కెళ్లడమే. అలాగే వ్యక్తిగత జీవితంలో ఇంకేవైనా డైలమాలు ఉన్నా ఈ ప్రాజెక్టును అయితే పూర్తి చేయాల్సి ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అనుష్కతో మూవీ గురించి యువి సంస్థ ఏదైనా క్లారిటీ ఇస్తుందేమో వేచి చూడాలి.