తన సక్సెస్ సీక్రెట్స్ బయటపెట్టిన స్టార్ హీరోయిన్..!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ప్రస్తుతం తదుపరి సినిమాలకోసం కఠోరదీక్షతో వర్కౌట్స్ చేస్తోంది. కత్రినా గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా కుర్రకారు ఫేవరేట్ హీరోయిన్స్ లిస్టులో కత్రినా కూడా ఉంటుంది. తాజాగా అమ్మడు తన సక్సెస్ కు రీసన్స్ ఏంటో చెప్పుకొచ్చింది. ఆ విషయాలను షేర్ చేసుకునేందుకు కత్రినా ఇంస్టాగ్రామ్ వీడియో పోస్ట్ చేసింది. వీడియోలో కత్రినా తీవ్రంగా వ్యాయామం చేస్తూ ఉంది. ఐతే తన సక్సెస్ మంత్రాస్ మాత్రం.. కొత్త విషయాలు నేర్చుకోవడం, నా గమ్యాన్ని కనుక్కునే దారి వెతకడమే.. ఎలాంటి ఫోర్స్ అవసరం లేదు' అని చెబుతోంది బ్యూటీ. ఈ వీడియోతో కత్రినా సక్సెస్ రీసన్స్ ఐతే ఫ్యాన్స్ చెవిలో పడినట్లే.
సినిమాల విషయానికి వస్తే.. కత్రినా ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సరసన 'టైగర్ 3' సినిమాకోసం సన్నద్ధం అవుతుంది. ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో కత్రినా, సల్మాన్ భారీ యాక్షన్ సీన్స్ కంప్లీట్ చేసారు. ఐతే వర్కౌట్స్ ఆపకుండా చేస్తూనే ఉంది కానీ ఏ సినిమా కోసం చేస్తుందో చెప్పలేదు అమ్మడు. ఈ మద్యే సోషల్ మీడియాలో కొత్త సినిమా ప్రారంభించినట్లు చెప్పింది. మరి ఆ సినిమా టైగర్ 3నే కావచ్చు అని ఊహగానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ భారీ యాక్షన్ సినిమా గురించి కత్రినా కిక్ బాక్సింగ్ కూడా నేర్చుకుందట. టైగర్ సిరీస్ లో ఇదివరకు ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై సినిమాలు తెరకెక్కి మంచి హిట్ అందుకున్నాయి. ఇప్పుడు అదే సిరీస్ కంటిన్యూ చేస్తూ టైగర్ -3 తెరకెక్కుతుంది. ఇదిలా ఉండగా.. ఇటీవలే అక్షయ్ కుమార్ తో సూర్యవంశీ సినిమా చేసింది. ఆ సినిమా ఏప్రిల్ 30న రిలీజ్ కాబోతుంది. అలాగే అమ్మడి చేతిలో 'ఫోన్ బూత్' సినిమా కూడా లైన్ లో ఉంది.