ఈ స్టార్ హీరో.. వరుసగా స్టార్ డైరెక్టర్లను లైన్ లో పెట్టాడా..??
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ 'ఆర్ఆర్ఆర్' మూవీతో బిజీగా ఉన్నాడు. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ఎన్టీఆర్ కొమరమ్ భీమ్ పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్.. డైరెక్టర్ త్రివిక్రమ్ తో పొలిటికల్ ఫ్యామిలీ డ్రామా చేయనున్నాడు. వీరి కాంబినేషన్ సెకండ్ మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం అవుతుందని టాక్. వచ్చే ఏడాదిలో ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ లో ఉన్నారట. 'అయినను పోయిరావలె హస్తినకు', 'చౌడప్ప నాయుడు' అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక త్రివిక్రమ్ తర్వాత ఎన్టీఆర్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో మూవీ ప్రయత్నాలు సాగుతున్న విషయం తెలిసిందే.
గతేడాది ఈ ప్రాజెక్ట్ పై ఒప్పందాలు కుదిరినట్లు సమాచారం. ఆ సినిమా తర్వాత 'రాజారాణి' సినిమాతో డైరెక్టరుగా యంగ్ డైరెక్టర్ అట్లీ. వరుస విజయాలతో దూసుకెళ్తున్న అట్లీ దళపతి విజయ్ తో 'పోలీసోడు' 'అదిరింది' 'విజిల్' సినిమాలను తెరకెక్కించి మంచి స్టార్డం అందుకున్నాడు. ఆ మధ్య ఎన్టీఆర్ తో ఓ ద్విభాషా చిత్రం తీస్తానని అన్నాడు. కానీ ఇంతవరకు ఆ సినిమా పై క్లారిటీ రాలేదు. ఇవేగాక ఎన్టీఆర్ తో మాస్టర్ సినిమా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఓ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు టాక్. ఇదేగనక నిజమైతే ఎన్టీఆర్ కెరీర్లో వరుసగా స్టార్ డైరెక్టర్స్ సినిమాలు రాబోతున్నాయి. చూడాలి మరి వీరిలో ఎవరి ప్రాజెక్ట్ ముందుగా పట్టాలెక్కుతుందో..!