విజయ్- రష్మిక పెళ్లి.. మరీ అంత ప్రైవేట్ గానా?

టాలీవుడ్‌ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న వివాహానికి చెందిన వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.;

Update: 2026-02-17 18:16 GMT

టాలీవుడ్‌ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న వివాహానికి చెందిన వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఫిబ్రవరి 26వ తేదీన ఆ ఇద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారన్న ఊహాగానాలు వైరల్ గా మారాయి. అయితే ఆ విషయంపై ఇప్పటివరకు అటు విజయ్ దేవరకొండ కానీ.. ఇటు రష్మిక మందన్న కానీ అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు. ఆ మధ్య ఇన్ డైరెక్ట్ గా హింట్స్ ఇచ్చినా.. అధికారికంగా మాత్రం రెస్పాండ్ అవ్వలేదు.

అయితే ఇప్పటికే ఉన్న సమాచారం ప్రకారం.. రాజస్థాన్‌ లోని ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ ఉదయ్‌ పుర్ లో వివాహ వేడుక నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి ఎక్కువ సందడి లేకుండా, మీడియాకు దూరంగా, పూర్తిగా ప్రైవేటుగా పెళ్లి జరుపుకోవాలని విజయ్ - రష్మిక జంట నిర్ణయించుకున్నట్టుగా సమాచారం. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఆ వేడుకకు హాజరుకానున్నారని టాక్.

పెళ్లికి ముందు రెండు రోజుల పాటు ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్ నిర్వహించనున్నారని తెలుస్తోంది. ఫిబ్రవరి 24వ తేదీన సంగీత్, 25వ తేదీన హల్దీ కార్యక్రమాలు జరిపి, 26వ తేదీన సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకోవాలని ప్లాన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కొందరు ఆత్మీయులకు ఆహ్వానాలు కూడా పంపినట్లు సమాచారం. అయితే పెళ్లికి సంబంధించి ఇప్పుడు ఆకర్షణగా మారింది నో ఫోన్ పాలసీ.

వేడుకకు వచ్చే అతిథులు ఎవరూ మొబైల్ ఫోన్లు తీసుకురాకూడదని తేల్చిచెప్పేసినట్లు తెలుస్తోంది. పెళ్లి ఫొటోలు, వీడియోలు బయటకు లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. పర్సనల్ మూమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కాకూడదన్న ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నారట. అంతేకాదు, ఎలాంటి గిఫ్ట్స్ కూడా తీసుకురావద్దని అతిథులకు ముందుగానే స్పష్టం చేసినట్టు సమాచారం.

ఆశీర్వాదమే మాకు పెద్ద కానుక అంటూ ప్రత్యేక సందేశాలు పంపారట. ఆడంబరాలకు దూరంగా, సింపుల్ గా మ్యారేజ్ జరుపుకోవాలన్నదే వారి ఆలోచనగా తెలుస్తోంది. మరోవైపు, ఆ వేడుకకు సినీ ప్రముఖులను కూడా ఆహ్వానించడం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం కుటుంబ సభ్యులతోనే పెళ్లి జరిపి, అనంతరం హైదరాబాద్‌ లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. ఆ కార్యక్రమానికి ఇండస్ట్రీ ప్రముఖులను ఆహ్వానించనున్నట్టు సమాచారం.

ఏదేమైనా నో ఫోన్లు, నో గిఫ్ట్స్, నో సెలబ్రిటీలు.. అంటూ కంప్లీట్ ప్రైవేట్ ఈవెంట్ గా విజయ్–రష్మిక పెళ్లి జరగనుందని ప్రచారం జరుగుతుండగా.. అభిమానుల్లో అది ఆసక్తి పెంచుతోంది. అయితే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆ వార్తలను ఊహాగానాలుగానే అనుకోవాలి. మరి ఫిబ్రవరి 26వ తేదీన నిజంగానే విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న జంట పెళ్లి బంధంతో ఒక్కటవుతుందా లేదా అన్నది త్వరలోనే క్లారిటీ రానుంది.

Tags:    

Similar News