సీన్ రిపీట్ అయితే ఇబ్బందులే!
టాలీవుడ్ నుంచి కొందరు స్టార్ హీరోలకు పాన్ ఇండియాలో ఎలాంటి ఇమేజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు.;
టాలీవుడ్ నుంచి కొందరు స్టార్ హీరోలకు పాన్ ఇండియాలో ఎలాంటి ఇమేజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. సినిమాలు ప్లాప్ అయినా? ఆ హీరోల తదుపరి చిత్రాల ఓపెనింగ్స్ పై ఎలాంటి ప్రభావం పడలేదు. భారీ ఎత్తున ఓపెనింగ్స్ దక్కుతున్నాయి. ఈ విషయంలో మన హీరోలు ఎంతో లక్కీ అనే చెప్పాలి. కానీ ఎల్లకాలం సాగదు. ఏదో రోజు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. ఓసారి ప్రభాస్ విషయంలోకి వెళ్తే `బాహుబలి ది కన్ క్లూజన్` తర్వాత వరుసగా మూడు ప్లాప్ లు చూసాడు. `సాహో` హిందీ మార్కెట్ లో వర్కౌట్ అయినా? టాలీవుడ్ లో కనెక్ట్ అవ్వలేదు.
రొటీన్ యాక్షన్ చిత్రంగా ప్రేక్షకులు పెదవి విరిచేసారు. పెద్దగా వసూళ్లు కూడా రీజనల్ మార్కెట్ నుంచి సాధించలేదు. కానీ డార్లింగ్ ఇమేజ్ తో మంచి ఓపెనింగ్స్ అయితే దక్కాయి. ఆ తర్వాత రిలీజ్ అయినా `రాధేశ్యామ్` అయితే డిజాస్టర్ అయింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమా 100 కోట్ల వసూళ్లనే కానాకష్టంగా రాబట్టింది. ఆ తర్వాత రిలీజ్ అయిన `ఆదిపురుష్` , `రాధేశ్యామ్` ను మించిన ఫలితాన్ని సాధించింది. ఈ సినిమాతో ప్రభాస్ తీవ్ర విమర్శలకు గురయ్యాడు. ఓ మంచి కాన్సెప్ట్ తీసుకున్నా? నాణ్యత లేని సినిమాలో ఎలా నటించాడంటూ దుమ్మెత్తి పోసారు.
అంత వరకూ ప్రభాస్ కు ట్రోలింగ్ అంటే ఏంటో తెలియదు. `ఆదిపురుష్` కారణంగా ట్రోలింగ్ ఎలా ఉంటుందో బాగా అర్దమైంది. ఆ తర్వాత మళ్లీ ప్రభాస్ ఖాతాలో హిట్ పడటానికి ఐదేళ్లు సమయం పట్టింది. అదే `సలార్` సీజ్ ఫైర్. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన యాక్షన్ థ్రిల్లర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ అనుకున్న హిట్ ను సాధించలేదు. `కేజీఎఫ్` తర్వాత రిలీజ్ అయిన చిత్రం కావడంతో బాక్సాఫీస్ టార్గెట్ 1500 కోట్లగా రిలీజ్ అయింది. కానీ అందులో సగం వసూళ్లు మాత్రమే సాధించింది. ఆ రకంగా ప్లాప్ ల్లో ఉన్న డార్లింగ్ ను ప్రశాంత్ నీల్ బయటకు తెచ్చాడు.
ఆ తర్వాత `కల్కి 2898` తో డార్లింగ్ ఖాతాలో మరో హిట్ పడింది. అయితే ప్రభాస్ మళ్లీ `ది రాజాసాబ్` వైఫల్యంలో మళ్లీ ట్రాక్ తప్పుతున్నాడా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మారుతి దర్వకత్వంలో రిలీజ్ అయిన `రాజాసాబ్` ప్రభాస్ కెరీర్ లో మరో డిజాస్టర్ గా నమోదైంది. ప్రభాస్ పాత్రపై నెట్టింట పెద్ద ఎత్తున ట్రోలింగ్ కూడా జరిగింది. కానీ మునుపటిలా ఇప్పుడు ప్లాప్ లు వచ్చినా పర్వాలేదనుకోవడానికి లేదు. పాన్ ఇండియా హీరోల మధ్య పోటీ పెరిగింది. వరుస పరాజయాలు నమోదైతే పాన్ ఇండియాలో అంతకంతకు వెనుకబడి పోవడం ఖాయం. ఈ నేపథ్యంలో ఈసారి డార్లింగ్ ని లేపాల్సిన బాధ్యత హను రాఘవపూడిపైనే ఉంది. ప్రస్తుతం అతడి దర్శకత్వంలో `ఫౌజీ`లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ యాక్షన్ చిత్రంగా రూపొందుతుంది. సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. హను మాటల మనిషి కాదు..చేతల మనిషి కావడంతో? ప్రభాస్ కూడా చాలా కాన్పిడెంట్ గా ఉన్నాడు.