టాలీవుడ్ మోస్ట్ అండర్ రేటెడ్ హీరోలు ఎవరు?
ఇక ఎలాంటి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ లేకుండా స్వయం కృషితో రవితేజ తరహాలో హీరోలుగా రాణిస్తున్న వారు కూడా ఉన్నారు.;
టాలీవుడ్‌లో ఏ ఇండస్ట్రీలో లేనంత మంది హీరోలున్నారు. ఒక్క మెగా ఫ్యామిలీనే తీసుకుంటే మెగాస్టార్ చిరంజీవి నుంచి మొదలు కుంటే పంజా వైష్ణవ్ తేజ్ వరకు మొత్తం ఎనిమిది మంది హీరోలున్నారు. ఇక నందమూరి ఫ్యామిలీలో బాలకృష్ణ, ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్.. త్వరలో మోక్షజ్ఞ రాబోతున్నాడు. ఇక అక్కినేని ఫ్యామిలీ హీరోలని తీసుకుంటే కింగ్ నాగార్జున, నాగచైతన్య, సుమంత్, అఖిల్ ఉన్నారు. దగ్గుబాటి ఫ్యామిలీకి వస్తే వెంకటేష్, రానా ఉన్నారు. ఈ మూడు ఫ్యామిలీలకు సంబంధించిన హీరోలతో పాటు ఇండస్ట్రీలో డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ తరుపున హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన వారసులు కూడా ఉన్నారు.
ఇక ఎలాంటి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ లేకుండా స్వయం కృషితో రవితేజ తరహాలో హీరోలుగా రాణిస్తున్న వారు కూడా ఉన్నారు. ఇండస్ట్రీలో ఇంత మంది స్టార్లు, పాన్ ఇండియా స్టార్లు ఉన్నా కానీ ఇందులో మోస్ట్ అండర్ రేటెడ్ హీరోలు ఎవరన్నది చాలా కాలంగా ఓ ఆసక్తికరమైన చర్చ జరుగుతూ వస్తోంది. స్టార్లు ఎంత మంది ఉన్నా తమదైన ఎక్స్‌ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్‌తో అండర్ రేటెడ్ హీరోలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ స్టార్స్ నలుగురు మాత్రమే ఉన్నారు. అల్లరి నరేష్, సత్యదేవ్, గోపీచంద్, సుమంత్, సంతోష్ శోభన్.
అల్లరి నరేష్ గురించి చెప్పాలంటే తను నటించిన `గమ్యం`లోని గాలి శ్రీను క్యారెక్టర్, `నేను`లో పోషించిన వినోద్ పాత్ర, విశాఖ ఎక్స్‌ప్రెస్`లో చేసిన రవివర్మ క్యారెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. నటుడిగా ఈ సినిమాల్లో నరేష్ పలికించిన హావ భావాలు, నటన పతాక స్థాయిలో ఉంటుంది. నటుడిగా అండర్ రేటెడ్ స్టార్ అనిపించుకున్నా కానీ నరేష్‌కు ఇండస్ట్రీలో రావాల్సిన సినిమాలు రాలేదు. అందాల్సిన గుర్తింపు అందలేదు. మళ్లీ ఇన్నాళ్లకు త్వరలో రిలీజ్ కానున్న `ఆల్కహాల్` మూవీలో నరేష్ తనదైన మార్కు నటనతో ఆశ్చర్యపరచబోతున్నాడు.
సత్యదేవ్..ఐబీఎమ్‌లో ఆర్కిటెక్చర్‌గా వర్క్ చేసిన ఆయన సినిమాపై ఆసక్తి, పిచ్చి ప్రేమతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. స్టార్‌ల సినిమాల్లో క్రెడిట్ లేని క్యారెక్టర్లలో కనిపించిన సత్యదేవ్ ..ఓ వేశ్య కథ ఆధారంగా తెరకెక్కిన `జ్యోతిలక్ష్మి` సినిమాతో హీరో అయ్యాడు. దీనికి పూరి జగన్నాథ్ డైరెక్టర్. చార్మి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా తరువాత చేసిన `క్షణం`, గాజీ ` సినిమాలు సత్యదేవ్‌కు మంచి పేరు తెచ్చి పెట్టాయి. అతని వాయిస్‌కు స్టార్ హీరోలు కూడా ఫిదా అయ్యారంటే అతని టాలెంట్ గురించి అర్థం చేసుకోవచ్చు. ఇంత టాలెంట్ ఉన్నా సత్యదేవ్ మాత్రం సరైన గుర్తింపుని ఇప్పటికీ పొందలేకపోతున్నాడు.
ప్రస్తుతం నటనకు ఆస్కారం ఉన్న `రావు బహదూర్`, ఫుల్ బాటిల్, గరుడ చాప్టర్ 1 సినిమాల్లో నటిస్తున్నాడు. వీటిల్లో ఒక్కటైనా సత్యదేవ్‌ని స్టార్‌గా నిలబెడుతుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీస్‌తో పాటు సత్యదేవ్ `హే బల్‌వంత్` ప్రొడ్యూసర్స్ నిర్మాణంలో రూపొందుతున్న సినిమాలో నటించబోతున్నాడు. బుధవారం (ఫిబ్రవరి 18) పూజా కార్యక్రమాలతో ఇది ప్రారంభం అవుతోంది. మ్యాచో మ్యాన్ గోపీచంద్ కూడా అండర్ రేటెడ్ హీరోనే. తండ్రి టి. కృష్ణ వారసుడిగా అరంగేట్రం చేసినా రాని గుర్తింపు `జయం`, వర్షం సినిమాల్లో నటించి విలన్ క్యారెక్టర్లతో వచ్చింది. హీరోగా, ప్రొటెన్షియల్ ఉన్న నటుడిగా మంచి పేరున్నా తనకు రావాల్సిన స్టార్‌డమ్ మాత్రం ఇప్పటికీ రాలేదు.
అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా అరంగేట్రం చేసిన సుమంత్ `గోదావరి, గోల్కొండ హైస్కూల్, మళ్లీ రావా, అనగనగ సినిమాలతో తమదైన మార్కు నటనతో ఆకట్టుకున్నారు. అయితే నటుడిగా మంచి మార్కులు తెచ్చుకున్న హీరోగా తనకు కూడా సరైన గుర్తింపు రాలేదు. ప్రస్తుతం `మహేంద్ర గిరి వారాహీ`తో పాటు క్రైమ్ థ్రిల్లర్ `న్యూటన్ లా` చేస్తున్నారు. వీరితో పాటు సూపర్ టాలెంట్ ఉన్న యంగ్ హీరో సంతోష్ శోభన్. వర్షం డైరెక్టర్ శోభన్ తనయుడిగా అరంగేట్రం చేసినా గత కొన్నేళ్లుగా సరైన గుర్తింపు కోసం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. రీసెంట్‌గా విడుదలైన `కపుల్ ఫ్రెండ్లీ` మూవీతో ఫస్ట్ కమర్షియల్ సక్సెస్‌ని సొంతం చేసుకోవడం గమనార్హం.