తారక్, నీల్ మూవీ.. ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్?
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతున్న డ్రాగన్ మూవీ షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే.;
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతున్న డ్రాగన్ మూవీ షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఆ సినిమా.. అలా లేట్ అవుతూ వచ్చింది. ఈ ఏడాది జూన్ లో విడుదల చేయాలని మేకర్స్ అనుకున్నారు. అందుకు తగ్గట్లే ప్లాన్ కూడా వేసి షూటింగ్ మొదలుపెట్టారు.
కానీ ఇంకా చాలా వరకు షూటింగ్ పెండింగ్ ఉండడంతో.. ఆ సమయానికి రిలీజ్ చేయడం కష్టమని తెలుస్తోంది. దీంతో సినిమా వచ్చే ఏడాదికి వాయిదా పడే అవకాశం ఉందని ఇటీవల వార్తలు వినిపించాయి. అందులో నిజమెంతో తెలియకపోయినా.. ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆ వాటికి చెక్ పెట్టేలా.. ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చేలా మేకర్స్ షూటింగ్ ను స్పీడ్ గా నిర్వహిస్తున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం ఫారిన్ లో సినిమాలోని కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు మేకర్స్. ముఖ్యంగా ఇప్పుడు జోర్డాన్ లో యాక్షన్ ఎపిసోడ్స్ ను తెరకెక్కిస్తున్నారు. ఎడారి ప్రాంతాల్లో తీస్తున్న ఆ సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని సమాచారం. నేచురల్ ల్యాండ్ స్కేప్స్ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్లకు కొత్త లుక్ తీసుకురానున్నాయని టాక్ వినిపిస్తోంది.
అయితే ఆ షెడ్యూల్ ముగిసిన వెంటనే హైదరాబాద్ కు చేరుకుని రామోజీ ఫిల్మ్ సిటీలో తదుపరి షూటింగ్ నిర్వహించనున్నారని తెలుస్తోంది. అక్కడ భారీ సెట్స్ వేయగా.. వాటిలో కీలక సన్నివేశాలు, క్లైమాక్స్ భాగాన్ని చిత్రీకరించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఆ షెడ్యూల్ అంతా అనుకున్నట్టుగా పూర్తయితే విడుదల తేదీపై త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశముంది.
కాగా.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తనదైన శైలిలో హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాలు తెరకెక్కించడంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అదే సమయంలో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ ఉన్న మాస్ ఇమేజ్, పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. ఆ ఇద్దరి కాంబినేషన్ లో మూవీ రూపొందుతుండడంతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
ఇక సినిమాలో హీరోయిన్ గా రుక్మిణీ వసంత్ యాక్ట్ చేస్తున్నారు. ఆమె పాత్ర కథలో కీలకంగా ఉండనుందని తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆ సినిమాలో యాక్షన్ సీన్స్ కు స్పెషల్ ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు సమాచారం. ఏదేమైనా షూటింగ్ జెట్ స్పీడ్ లో కొనసాగుతుండటంతో సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో అఫీషియల్ రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మరి మూవీ ఎప్పుడు విడుదలవుతుందో వేచి చూడాలి.