బాలీవుడ్‌లో సౌత్ మేకర్స్ డామినేషన్!
ఒకప్పుడు ప్రాంతీయ చిత్రాలుగా పరిమితమైన సౌత్ సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి.
ఒకప్పుడు ప్రాంతీయ చిత్రాలుగా పరిమితమైన సౌత్ సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హీరోల మధ్యే కాకుండా దర్శకుల మధ్య కూడా నెంబర్ గేమ్ నడు స్తోంది. ముఖ్యంగా పాన్ ఇండియా రేంజ్‌లో సౌత్ మేకర్స్ సాధిస్తున్న విజయాలు బాలీవుడ్ అగ్ర దర్శకులకు నిద్రలేకుండా చేస్తున్నాయి. ఈ విప్లవానికి తెరతీసిన కెప్టెన్ దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి. `బాహుబలి` సిరీస్‌తో బిగ్ స్క్రీన్ మీద పాన్ ఇండియా ట్రెండ్‌ను మొదలుపెట్టిన జక్కన్న ఒక్కో సినిమాతో ఇండియన్ సినిమా రేంజ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తున్నారు.
ఆయన ఆక్రమించిన ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ చైర్‌ను చేరుకునేందుకు బాలీవుడ్‌లోని ఎంతోమంది ప్రముఖ దర్శకులు కొంత కాలంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ రాజమౌళి సృష్టించిన మైలురాళ్లను అందుకోవడం సాధ్యం కావడం లేదు. రాజమౌళి బాటలోనే సుకుమార్ నడుస్తున్నారు. `పుష్ప 2` లెక్కల మాస్టర్ ఇండియన్ మేకర్స్‌కు మరో సరికొత్త దారి చూపించారు. అసాధ్యం అనుకున్న విషయాలను కూడా బాక్సాఫీస్ వద్ద సాధ్యం చేసి చూపించి సౌత్ సత్తా ఏమిటో మరోసారి నిరూపించారు. మరో క్రేజీ కెప్టెన్ సందీప్ రెడ్డి వంగా నెంబర్ గేమ్‌లో ముందుకు దూసుకెళ్లారు.
రెండు సినిమాలే చేసినా? పాన్ ఇండియా రేంజ్‌లో ఆయన సృష్టించిన క్రేజ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ఇదే కోవలో నేషనల్ మార్కెట్‌ను వణికించిన మరో సౌత్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. 'కేజీఎఫ్', 'కేజీఎఫ్ 2' వందల కోట్లు వసూళ్లను సాధించి సౌత్ డామినేషన్‌ను జాతీయ స్థాయిలో ప్రూవ్ చేశారు. `కల్కి 2898` విజయంతో నాగ్ అశ్విన్ సంచలనంగా మారారు. సైన్స్ ఫిక్షన్ సినిమాలు తీయడంలో తానో మాస్టర్ తొలి అటెంప్ట్ లోనే ప్రూవ్ చేసారు. `కల్కి 2` విజయం సాధిస్తే నాగీ ఇమేజ్ విశ్వవ్యాప్తమవుతుంది. ఈ ఐదుగురు దర్శకులు సృష్టించిన సునామీని తట్టుకునేందుకు బాలీవుడ్ నుంచి సిద్ధార్థ్ ఆనంద్, అయాన్ ముఖర్జీ లాంటి ప్రముఖ మేకర్స్ ఎంతో ప్రయత్నించినా? బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో నిలదొక్కుకోలేకపోయారు.
అయితే ఈ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రీసెంట్‌గా `ధురందర్` సిరీస్‌తో భారీ బ్లాక్‌బస్టర్‌ను అందించిన ఆదిత్యధర్ సడన్‌గా రేసులోకి దూసుకొచ్చారు. సౌత్ డామినేషన్‌కు చెక్ పెడుతూ బాలీవుడ్‌లోనూ బలమైన దర్శ కులు ఉన్నారనే సంకేతాన్ని పంపించారు. అయినా ఆధిపత్య పోరులో బాలీవుడ్‌కు పూర్తి స్థాయి కాన్ఫిడెన్స్ రావాలంటే? మరింత మంది దర్శకులు పాన్ ఇండియాలో విజయాలు అందించాలి. అప్పుడే సౌత్ తో సమానంగా పోటీ పడే సత్తా బాలీవుడ్ మేకర్స్‌కు పూర్తిగా వచ్చిందా ?లేదా? అన్న అంశంపై స్పష్టత వస్తుంది.