సెన్సిటివ్ ఇష్యూస్ తో సినిమా తీయాలంటే..

కథ చెప్పే విధానం, పాత్రల డిజైన్ చేసిన పద్ధతి, దర్శకుడి ఉద్దేశం.. ఇవే ఆ సినిమాకు మంచి పేరు తీసుకురావడంలో లేదా వివాదాలకు దారితీయడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.

Update: 2026-07-22 11:30 GMT

ఒక సినిమా సిల్వర్​ స్క్రీన్ పైకి వచ్చిన తర్వాత అది కేవలం ఎంటర్టైన్మెంట్ గా మాత్రమే మిగిలిపోదు. కొన్ని కథలు సమాజాన్ని ఆలోచింపజేస్తాయి.. మరికొన్ని చరిత్రలోని పాత విషయాలను గుర్తు చేస్తాయి. రాజకీయాలు, మతం, సమాజంలోని సున్నితమైన అంశాలను ఆధారంగా చేసుకుని సినిమాలు తీసినప్పుడు దర్శకుడి ఆలోచనా విధానం చాలా కీలకంగా మారుతుంది. కథ చెప్పే విధానం, పాత్రల డిజైన్ చేసిన పద్ధతి, దర్శకుడి ఉద్దేశం.. ఇవే ఆ సినిమాకు మంచి పేరు తీసుకురావడంలో లేదా వివాదాలకు దారితీయడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.

చరిత్రలో జరిగిన కొన్ని సంఘటనలు ఎప్పటికీ ఎమోషన్స్ ను రేకెత్తిస్తూనే ఉంటాయి. దేశ విభజన, యుద్ధాలు, సామాజిక మార్పులు వంటి అంశాలు సినిమాలకు స్ట్రాంగ్ స్టోరీలు అందిస్తాయి. అయితే అలాంటి విషయాలను తెరకెక్కించే సమయంలో ఒక వర్గాన్ని తప్పుపట్టడం లేదా ఒక అభిప్రాయాన్ని బలవంతంగా ప్రేక్షకులపై రుద్దడం కాకుండా.. మనుషుల జీవితాలు, వారి బాధలు, ఆశలు, అనుభవాలను చూపించడమే ముఖ్యమని చెప్పాలి.

సున్నితమైన అంశాలతో సినిమాలు రూపొందించడంలో దర్శకుడి ఆలోచన చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఒకే సంఘటనను ఇద్దరు దర్శకులు రెండు రకాలుగా చూపించవచ్చు. ఒకరు వివాదాల యాంగిల్ లో చూపిస్తే.. మరొకరు హ్యూమన్ యాంగిల్ లో చూపించే అవకాశం ఉంటుంది. ప్రేక్షకులకు చేరేది కూడా కథ వెనుక ఉన్న నిజాయితీ, ఎమోషనే.

దేశ విభజన వంటి అంశాలు సినిమాల్లోకి వచ్చినప్పుడు రాజకీయ చర్చలు సహజంగానే మొదలవుతాయి. కానీ విభజన వెనుక ఉన్న సాధారణ ప్రజల జీవితాలు, విడిపోయిన కుటుంబాలు, కోల్పోయిన అనుబంధాలు, స్వస్థలం కోసం మిగిలిపోయిన జ్ఞాపకాలు వంటి అంశాలు కూడా అంతే ముఖ్యమైనవి. ఇలాంటి కథలు ఒక కాలాన్ని మాత్రమే కాకుండా.. మనుషుల మనసుల్లో మిగిలిపోయిన ఫీలింగ్స్ ను కూడా చూపిస్తాయి.

ఇటీవల ఇలాంటి అంశాలపై స్పందించిన ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఇంతియాజ్ అలీ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. హైదరాబాద్‌ లో తన చిత్రం మెయిన్ వాపస్ ఆవుంగా స్పెషల్ షో సందర్భంగా ఆయన సినిమా, సెన్సిటివ్ ఇష్యూలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. కఠినమైన విషయాలను సినిమాల్లో చూపించవచ్చని.. కానీ ఎవరో ఒకరిని విమర్శించాలనే ఉద్దేశంతో కథను ప్రారంభించకూడదని అన్నారు. సినిమా ప్రారంభ దశలోనే ఒక వ్యక్తిని, ఒక వర్గాన్ని లేదా ఒక సిద్ధాంతాన్ని తప్పు అని నిరూపించాలనే ఆలోచన ఉండకూడదని ఇంతియాజ్ అలీ పేర్కొన్నారు.

దర్శకుడి స్టైల్ మనుషుల భావోద్వేగాలు, వారి జీవిత పోరాటాలు, అనుభవాలపై ఉండాలని చెప్పారు. మెయిన్ వాపస్ ఆవుంగాలో కూడా దేశ విభజన నేపథ్యం ఉన్నప్పటికీ.. అసలు కథ మనుషుల రిలేషన్లు, మెమోరీస్ చుట్టూనే తిరుగుతుందని ఆయన వివరించారు. ఏదేమైనా సున్నితమైన అంశాలపై సినిమా తీసేటప్పుడు కథ కంటే ముందు దర్శకుడి ఉద్దేశమే ప్రేక్షకుల ముందుకు వస్తుంది. చరిత్రను చూపించడం మాత్రమే కాదు.. మనుషుల బాధను అర్థం చేసుకునేలా చేయడమే మంచి మూవీ లక్షణమని ఇంతియాజ్ అలీ కామెంట్స్ మరోసారి చర్చకు దారితీశాయి.

Tags:    

Similar News