కష్టాల్లో అండగా నిలిచిన స్టార్‌లు… KVN ప్రొడ్యూసర్ ఎమోషనల్ థ్యాంక్స్!

సినిమా కష్టాల్లో ఉన్న సమయంలో హీరో విజయ్ పూర్తి స్థాయిలో మద్దతుగా నిలిచారని నిర్మాత వెంకట్ తెలిపారు..

Update: 2026-07-22 12:40 GMT

దళపతి విజయ్ నటించిన ‘జన నాయగన్' రేపు జులై 23న విడుదల కానుంది. ఇక షూటింగ్ సమయంలో పైరసీ, సెన్సార్ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ క్లిష్ట సమయంలో చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు అండగా నిలిచారని KVN ప్రొడక్షన్స్ నిర్మాత వెంకట్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అనిల్ రావిపూడితో కలసి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, యష్, శివకార్తికేయన్ వంటి అగ్ర నటులు తనకు ఎలా సపోర్ట్‌గా నిలిచారో తెలిపి అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఆ వివరాలు ఇలా వున్నాయి..

విజయ్ సపోర్ట్ :

సినిమా కష్టాల్లో ఉన్న సమయంలో హీరో విజయ్ పూర్తి స్థాయిలో మద్దతుగా నిలిచారని నిర్మాత వెంకట్ తెలిపారు.. ఇక సెన్సార్ సర్టిఫికేట్ త్వరగా రావడానికి ఆయన ఎంతో సహాయం చేశారని చెప్పారు. విజయ్ లాంటి పెద్ద హీరో వెనకుండి ధైర్యం ఇవ్వడం వల్లే తాము ఆ క్లిష్ట సమయాన్ని దాటగలిగామని ఆయన గుర్తుచేసుకున్నారు.

విచారించిన చిరంజీవి, పవన్ కళ్యాణ్:

టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిరంతరం ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారని వెంకట్ తెలిపారు. ఇక సమస్య త్వరగా ఎలా పరిష్కారం అవుతుందని వారు ఎంతో ఆరా తీసి, ధైర్యం చెప్పారని పేర్కొన్నారు. ఇండస్ట్రీ పెద్దల నుంచి వచ్చిన ఈ సపోర్ట్ తమకు కొండంత బలాన్ని ఇచ్చిందన్నారు.

యష్, శివకార్తికేయన్ అందిచిన సపోర్ట్:

ప్రస్తుతం 'టాక్సిక్' సినిమా కలసి చేస్తున్న రాకింగ్ స్టార్ యష్ ఒక పిల్లర్ లాగా నిలబడ్డారని ప్రొడ్యూసర్ చెప్పారు. తమిళ ఇండస్ట్రీ నుంచి హీరో శివకార్తికేయన్ పైరసీ ఘటన జరిగిన వెంటనే స్వయంగా బెంగళూరు వచ్చి తనను పరామర్శించారని తెలిపారు. ఇక వీరితో పాటు పలువురు నిర్మాతలు, దర్శకులు తమకు బాసటగా నిలిచారని చెప్పారు.

భారీ ప్రాజెక్ట్‌లతో కేవీఎన్ ప్రొడక్షన్స్ జోరు:

తలపతి విజయ్ ‘జన నాయగన్’ సినిమాతో పాటు రాబోయే రోజుల్లో కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ నుంచి మరిన్ని క్రేజీ పాన్-ఇండియా చిత్రాలు అలరించడానికి సిద్ధమవుతున్నాయి. రాకింగ్ స్టార్ యష్ హీరోగా, గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ డ్రామా ‘టాక్సిక్’ను ఈ సంస్థ నిర్మిస్తోంది. ఇక దీనితో పాటు మెగాస్టార్ చిరంజీవి హీరోగా, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో ఓ భారీ యాక్షన్ అడ్వెంచర్ ప్రాజెక్ట్‌ను కూడా కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుండటంతో ఈ నిర్మాణ సంస్థపై భారతీయ చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఒక సినిమా కష్టాల్లో ఉన్నప్పుడు భాషా భేదాలు లేకుండా ఇండస్ట్రీ ప్రముఖులు, అలాగే అభిమానులు చూపించిన అభిమానం నిజంగా ప్రశంసనీయం. కష్టసమయంలో అందరూ అండగా నిలిచినందువల్లే 'జన నాయగన్’ సినిమా అన్ని అడ్డంకులను దాటి విజయవంతంగా విడుదలైంది.



Full View


Tags:    

Similar News