కియారాతో యశ్ బెడ్ రూమ్ సీన్!
సినిమాలో రాకింగ్ స్టార్ యష్ - కియారా అద్వానీ మధ్య ఓ ఘాటైన బెడ్ రూమ్ సీన్ ఉందనే వార్త చర్చనీయాంశంగా మారింది.
మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న రాకింగ్ స్టార్ యష్ నటిస్తోన్న 'టాక్సిక్: ఎ ఫెరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్' సినిమా పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. సినిమా డిలే అవుతున్నా? బజ్ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా సినిమాలోని బోల్డ్ కంటెంట్‌కు సంబంధించి ఓ ప్రచారం ఫిలింనగర్‌లో హాట్ టాపిక్ గా మారింది. సినిమాలో రాకింగ్ స్టార్ యష్ - కియారా అద్వానీ మధ్య ఓ ఘాటైన బెడ్ రూమ్ సీన్ ఉందనే వార్త చర్చనీయాంశంగా మారింది. సినిమా టైటిల్ ట్యాగ్‌లైన్ తగ్గట్టుగానే `ఎ ఫెరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్` అనే కాన్సెప్ట్‌తో చిత్రాన్ని అత్యంత బోల్డ్ అండ్ ఇంటెన్స్ అప్రోచ్‌లో గీతూమోహన్ దాస్ తీర్చి దిద్దుతున్నారు.
ఇప్పటికే విడుదలైన టీజర్ .. ప్రచార చిత్రాలలో కార్‌లో వచ్చే కారు శృంగార సన్నివేశం ఎంత హైలైట్ అయిందో తెలిసిందే. ఆసన్నివేశానికి ఓ కాన్సెప్ట్ ఉందని తొలి టీజర్ లోనే ప్రూవ్ చేసారు. ఆ విజువల్స్ సృష్టించిన చర్చలు చల్లారక ముందే? తాజాగా సినిమాలో బెడ్ రూమ్ సీన్‌కు సంబంధించిన లీక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండంతో ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ తారాస్థాయికి చేరుతోంది. ఈ చిత్రంలో యష్ సరసన తారా సుతార్యతో పాటు నయనతార, కియారా అద్వానీ వంటి స్టార్ హీరోయిన్లు నటిస్తున్న విషయం తెలిసిందే.
అయితే కియారా అద్వానీతో యష్ నటించిన రొమాంటిక్ సీన్ ఇప్పటి వరకు వచ్చిన కమర్షి యల్ సినిమాల కంటే భిన్నంగా అత్యంత బోల్డ్‌గా డిజైన్ చేసినట్లు సమాచారం. గ్లామర్ హద్దులను చెరిపేసి కథ డిమాండ్‌కు తగినట్లుగా సన్నివేశం ఉంటుందని వినిపిస్తోంది. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా సీన్ షూట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే కారులో శృంగార సన్నివేశంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సినిమాలోఇంకెంత బోల్డ్ కంటెంట్ ఉందో? అన్న అనుమాలు వ్యక్తమవుతోన వేళ తాజా ప్రచారం నేపథ్యంలో ఆ విమర్శలు పతాక స్థాయికి చేరే అవకాశం లేకపోలేదు.
అయితే మేకర్స్ మాత్రం ఈ సినిమా పిల్లల కోసం కాదని.. పూర్తిగా పెద్దల కోసం రూపొందించిన ఫెరీ టేల్ అని మొదట్లోనే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కియారా అద్వానీతో వచ్చే ఘాటైన సన్నివేశం సినిమాలోని డార్క్ ఎమోషన్స్ .. రిలేషన్‌షిప్స్ డైనమిక్స్‌ను పూర్తిగా మలుపు తిప్పుతుందని భావిస్తున్నారు. `కేజీఎఫ్` తర్వాత యశ్ నుంచి వస్తోన్న సినిమా ఎలా ఉంటుంది? అన్న అంచనాల నడుమ సినిమాపై బోల్డ్ కంటెంట్ అన్నది కాస్త నెగిటివ్ గానూ మారింది. మరి ఈ విమర్శలు రిలీజ్ అనంతరం కలిసొస్తాయా? మరి వివాదాల్లోకి నెట్టుందా? అన్నది చూడాలి.