ఫైన‌ల్ ఔట్‌పుట్‌పై సీనియ‌ర్ స్టార్‌ ఆసంతృప్తి?

టాలీవుడ్‌లో పాన్ ఇండియా సినిమాల నిర్మాణం ఊపందుకున్న త‌రువాత ఏ స్టార్‌ని క‌దిలించినా.. ఏ స్టార్ డైరెక్ట‌ర్ నుంచి యంగ్ మేక‌ర్స్‌ని క‌దిలించినా వినిపిస్తున్న మాట పాన్ ఇండియా.;

Update: 2026-02-17 23:30 GMT

టాలీవుడ్‌లో పాన్ ఇండియా సినిమాల నిర్మాణం ఊపందుకున్న త‌రువాత ఏ స్టార్‌ని క‌దిలించినా.. ఏ స్టార్ డైరెక్ట‌ర్ నుంచి యంగ్ మేక‌ర్స్‌ని క‌దిలించినా వినిపిస్తున్న మాట పాన్ ఇండియా. అయితే కొంత మంది డైరెక్ట‌ర్లు, ప్రొడ్యూస‌ర్లు మాత్రం పాన్ ఇండియా అన‌డం లేదు కానీ బిగ్ బ‌డ్జెట్‌ చిత్రాల‌కు సై అంటున్నారు. మారిన మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకుని కోట్లు ఖ‌ర్చు చేస్తూ సినిమాలు నిర్మిస్తున్నారు. ఇందులో చాలా వ‌ర‌కు మేకింగ్ ఎర్ర‌ర్స్ ఎదుర‌వుతున్నాయి. మేకింగ్ పరంగా స‌మ‌స్యల్లో చిక్కుకుంటున్నాయి.

దీంతో స్టార్స్ స‌ద‌రు సినిమాల‌పై అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఇక‌పై ఇలాంటి టెక్నిక‌ల్‌, మేకింగ్ ఎర్ర‌ర్ మూవీస్‌కి దూరంగా ఉండాల‌ని నిర్ణయించుకుంటున్నారు. మ‌రీ ముఖ్యంగా ఈ మ‌ధ్య కాలంలో వీఎఫ్ ఎక్స్ వ‌ర్క్ మ‌రీ నాసిర‌కంగా ఉండ‌టంతో స్టార్స్ ఆ విష‌యంలో కాంప్ర‌మైజ్ కావ‌డం లేదు. రీసెంట్‌గా విడుద‌లైన ఓ భారీ మూవీ వీఎఫ్ ఎక్స్ కార‌ణంగా విమ‌ర్శ‌ల్ని ఎదుర్కొన్న విష‌యం తెలిసిందే. ఆ కార‌ణంగానే స‌ద‌రు పాన్ ఇండియా మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ డిజాస్ట‌ర్ అనిపించుకుని అభిమానుల‌తో పాటు సినీ ల‌వ‌ర్స్‌ని, మేక‌ర్స్‌ని షాక్‌కు గురి చేసింది.

ఇప్పుడు అలాంటి ప‌రిస్థితినే సీనియ‌ర్ స్టార్ మూవీ ఎదుర్కొంటోందా? అంటే టాలీవుడ్ వ‌ర్గాల్లో అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. రీసెంట్‌గా బ‌రిలో నిలిచి భారీ బ్లాక్ బ‌స్ట‌ర్‌ని సొంతం చేసుకున్న సీనియ‌ర్ స్టార్ గ్రాఫిక్స్ ప్ర‌ధానంగా సాగే క‌థ‌తో ఓ భారీ మూవీకి శ్రీ‌కారం చుట్టాడు. ఈ ప్రాజెక్ట్ మొద‌లు పెట్టి రెండేళ్లు పూర్తి కావ‌స్తున్న రిలీజ్ విష‌యంలో మాత్రం ఇంకా క్లారిటీ రావ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఇదే ఇప్పుడు సీనియ‌ర్ స్టార్‌కు తీవ్ర అస‌హ‌నాన్ని తెప్పిస్తోంద‌ట‌. మొద‌ట్లో విడుద‌ల చేసిన వీడియోలోని వీఎఫ్ ఎక్స్‌పై విమ‌ర్శ‌లు రావ‌డంతో మ‌ళ్లీ చేయించ‌డం మొద‌లు పెట్టింది టీమ్‌.

ఆరు నెల‌లు శ్ర‌మించి ఓ వీఎఫ్ఎక్స్ స్టూడియోని ఫైన‌ల్ చేసుకున్నారు. అయితే అది అందించిన ఔట్‌పుట్ స్టార్‌కు ఏ మాత్రం న‌చ్చ‌లేద‌ట‌. అయితే వీఎఫ్ఎక్స్ కంప‌నీ మాత్రం షూట్ చేసిన ఫుటేజ్‌లోనే భారీ లోపాలు ఉన్నాయ‌ని తేల్చి చెప్పింద‌ట‌. దీంతో చేసేది లేక ఏఐ టెక్నాల‌జీని ఉప‌యోగించి కీల‌క స‌న్నివేశాల‌ని రూపొందిస్తున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇలా ఏఐ టెక్నాల‌జీని ఉప‌యోగించినా అనుకున్న విధంగా పూర్తి స్థాయి ప‌ర్‌ఫెక్ష‌న్‌తో ఆయా స‌న్నివేశాల్లో స్ప‌ష్ట‌త రాక‌పోతే ఏంటీ ప‌రిస్థితి అని అంతా అవాక్క‌వుతున్నారు.

సినిమా ప్రారంభించి రెండేళ్లు గ‌డుస్తున్నా ఇప్ప‌టికీ వీఎఫ్ ఎక్స్ విష‌యంలో కానీ, సినిమా రిలీజ్ విష‌యంలో కానీ ఓ నిర్ణ‌యానికి మేక‌ర్స్ రాక‌పోవ‌డం ఇప్పుడు ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారింద‌ని, ఈ ప‌రిస్థితి సీనియ‌ర్ స్టార్‌కి ఇబ్బందిక‌రంగా మారింద‌ని ఇన్ సైడ్ టాక్‌. ఇదిలా ఉంటే వీఎఫ్ ఎక్స్ ప్ర‌ధానంగా సాగే సినిమాలు టాలీవుడ్‌లో ఇప్పుడు ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారాయి. అనుకున్న స్థాయిలో వీఎఫ్ ఎక్స్ వ‌ర్క్ రాక‌పోవ‌డంతో మేక‌ర్స్‌తో పాటు హీరోలు కూడా విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు.

Tags:    

Similar News