బాలయ్య పై స్టార్ ఫైట్ మాస్టార్స్ క్రేజీ కామెంట్స్..!

Update: 2021-06-23 10:30 GMT
టాలీవుడ్ ఇండస్ట్రీలో నటసింహం నందమూరి బాలకృష్ణ పేరు వినగానే నందమూరి ఫ్యాన్స్ లో ఓ వైబ్రేషన్ మొదలవుతుంది. ఎందుకంటే బాలయ్య అంటే మాస్ సినిమాలకు పెట్టింది పేరు. అలాగే బాలయ్య బోయపాటి కాంబినేషన్ కలిసిందంటే ఖచ్చితంగా ప్రేక్షకులకు మాస్ ఫీస్ట్ ఉంటుంది. ప్రస్తుతం బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో అఖండ అనే సినిమా చేస్తున్నాడు. ఆల్రెడీ టీజర్ తో క్రేజ్ దక్కించుకున్న అఖండ మూవీ.. వీరి కాంబినేషన్ లో మూడోది. అంటే ఈసారి హ్యాట్రిక్ హిట్ కొడతారని నమ్మకంగా ఉన్నారు నందమూరి ఫ్యాన్స్.

అయితే సినిమా ఇండస్ట్రీలో హీరోలను ప్రేక్షకులు కేవలం తెరపై మాత్రమే చూస్తుంటారు. తెరమీద అయితే బాగానే ఉన్నారు హీరోలు.. మరి రియల్ గా బయట ఎలా ఉంటారో తెలియాలంటే పక్కా వారితో పనిచేసిన వారు చెబితే నమ్మకం కుదురుతుంది. అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరు హీరోలకంటే డేరింగ్ హీరో బాలయ్య బాబు అని స్టార్ స్టంట్ మాస్టర్స్ చెప్పారంటే ఖచ్చితంగా ఏదో సంథింగ్ ఉండే ఉంటుందని అనిపిస్తుంది కదా. ఈ విషయం పై పాపులర్ ఫైట్ మాస్టర్స్ రామ్ - లక్ష్మణ్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇండస్ట్రీలో ఇన్నేళ్లుగా ఎన్నో సినిమాకు చేశారు కదా.. ఏదైనా రిస్క్ సీన్ వచ్చినప్పుడు ఏ హీరో రెడీగా ఉంటారు?

అని అడిగిన ప్రశ్నకు రామ్ - లక్ష్మణ్ స్పందించి వెంటనే 'బాలయ్య' బాబు అని పేరు చెప్పేసారు. ఎవరైనా రిస్క్ సీన్ వచ్చిందంటే వెనకాముందు ఆలోచిస్తుంటారు. కానీ బాలయ్య అలా కాదు మీరు చెప్పడమే లేట్ ఆయన ఎల్లపుడూ సినిమా కోసం సిద్ధమే ఉంటాడు. అలా సీన్ చెప్పగానే వెంటనే ఓకే చెప్పేస్తాడు. ఫైట్స్ రిస్క్ విషయంలో మాత్రం ఖచ్చితంగా బాలయ్య డేర్ అనే చెప్పవచ్చు. ఆయన పని చేసిన సింహా.. లెజెండ్ సినిమాలు మాకు చాలా ఫేమ్ తీసుకొచ్చాయని రామ్ లక్ష్మణ్ వివరించారు. అందుకే ఇన్నేళ్లయినా బాలయ్య ఎనర్జీ అలాగే ఉందంటూ చెప్పుకొచ్చారు అన్నదమ్ములు. ప్రస్తుతం బాలయ్య అఖండతో పాటు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 107వ సినిమా చేయనున్నాడు.


Tags:    

Similar News