రామాయణ.. ఆ బాధ్యత చాలా భయంకరమైనది
ఇండియన్ సినిమాలో తెరకెక్కుతున్న అతి పెద్ద ప్రతిష్టాత్మక చిత్రాల్లో రామాయణ కూడా ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ ఈ సినిమాను రూపొందిస్తున్నారు.;
ఇండియన్ సినిమాలో తెరకెక్కుతున్న అతి పెద్ద ప్రతిష్టాత్మక చిత్రాల్లో రామాయణ కూడా ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ ఇతిహాస చిత్రానికి ఇద్దరు ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్లు చేతులు కలిపారు. వారే ఏఆర్ రెహమాన్ మరియు హాన్స్ జిమ్మెర్. వీరిద్దరూ కలిసి రామాయణకు సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
గతేడాది రిలీజైన టీజర్ లో వారి వర్క్ ను యావత్ ప్రపంచం చూసింది. రామాయణ టీజర్ కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ రాగా, ఈ సినిమా కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే రీసెంట్ గా ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు ఉన్న క్రియేటివ్ ఛాలెంజెస్ గురించి మాట్లాడారు. రామాయణ మూవీ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ చాలా టెర్రిఫిక్ అని ఆయన చెప్పారు.
ప్రతీ డెసిషన్ చాలా క్రిటికల్‌గా..
రామయణ లాంటి ఐకానిక్ సబ్జెక్ట్ పై వర్క్ చేయడం చాలా బాధ్యతతో కూడుకున్న పని అని, ప్రపంచవ్యాప్తంగా రామాయణంకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, అందుకే ఈ సినిమా కోసం తీసుకునే ప్రతీ డెసిషన్స్ చాలా క్రిటికల్ గా ఎమోషనల్ గా ఉంటుందని ఆయన వివరించారు. అదే ఇంటర్వ్యూలో ఆయన టీజర్ గురించి కూడా మాట్లాడారు. హాన్స్ జిమ్మర్ ముందు సౌండ్ స్కేప్ ను క్రియేట్ చేశారని, ఆ తర్వాత సంస్కృత శ్లోకాలు, మిగిలిన మ్యూజిక్ లేయర్స్ ను తాను యాడ్ చేసినట్టు రెహమాన్ తెలిపారు.
తెలిసిన కథను రీక్రియేట్ చేయడం కష్టమే
రామాయణం ప్రతీ భారతీయుడికి సుపరిచితమైన కథేనని, అలాంటి కథను రీక్రియేట్ చేయడం కూడా చాలా కష్టమేనని ఆయన చెప్పారు. అసలు కథ యొక్క ప్రామాణికతను కాపాడుతూనే దాన్ని కొత్తగా చూపించడం అసలైన ఛాలెంజ్ అని, ఈ సినిమా ఇండియన్ సినిమా సరిహద్దులను దాటుతుందని ఆయన చెప్పారు. కాగా రామాయణ మొదటి భాగం 2026 దీపావళికి రిలీజ్ కానుండగా, రెండవ భాగం 2027 దీపావళికి రిలీజ్ కానున్నట్టు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు.