సైబర్ క్రైమ్ ను ఆశ్రయించిన అనసూయ.. ప్రముఖ యాంకర్ తోపాటు 41మందిపై కేస్ ఫైల్..

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు డీప్ ఫేక్ బారిన పడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.;

Update: 2026-01-16 19:41 GMT

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు డీప్ ఫేక్ బారిన పడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సెలబ్రిటీలను టార్గెట్ గా చేసుకొని వారి ఫోటోలను, వీడియోలను ఏఐ ఉపయోగించి అసభ్యకరంగా మారుస్తూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు కొంతమంది సోషల్ మీడియా ఆకతాయిలు.. ముఖ్యంగా ఎంతోమంది సెలబ్రెటీలు డీప్ ఫేక్ బారినపడి ఆఖరికి హైకోర్టును కూడా ఆశ్రయిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రముఖ జబర్దస్త్ యాంకర్ అనసూయ కూడా తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఏకంగా ఒకరు కాదు.. ఇద్దరు కాదు 42 మందిపై ఆమె ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.

గత ఏడాది డిసెంబర్ 23 నుంచి తనపై ఆన్లైన్ వేదికగా వేధింపులు పెరిగిపోయాయని, అశ్లీల వ్యాఖ్యలు, లైంగిక దూషణలు, బెదిరింపులు కొనసాగుతున్నాయని.. ముఖ్యంగా క్రిమినల్ డిఫమేషన్, హెరాస్మెంట్, ఏఐ ఫోర్జరీ వంటి నేరాలు జరిగాయని పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది అనసూయ. ముఖ్యంగా అనసూయ ఇచ్చిన వివరాలు తీసుకున్న పోలీసులు మొత్తం 42 మందిపై కేసు నమోదు చేయడం గమనార్హం. ఈ 42 మందిలో కంటెంట్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఖాతాదారులు, కొందరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు.

ముఖ్యంగా అనసూయ ఫిర్యాదు చేసిన 42 మందిలో టీవీ యాంకర్ రోహిత్ తో పాటు ఒక ఛానల్ యాంకర్ అలాగే కరాటే కళ్యాణి, విజయలక్ష్మి, బొజ్జ సంధ్య రెడ్డి, ప్రియా చౌదరి గోగినేని , పావని , శేఖర్ భాష, టీవీ యాంకర్ మనోజ్, దుర్గ ఇతర టీవీ ఛానల్స్ , ఆన్లైన్ మీడియా పేజీలను కూడా ఆమె ఈ కేసులో చేర్చారు. ముఖ్యంగా నిందితుల పేర్లతోపాటు సోషల్ మీడియా లింకులను కూడా అనసూయ జత చేయడం జరిగింది. తనపై క్యాంపెయిన్ తరహాలో దాడి జరిగిందని.. ముఖ్యంగా ఒక మీడియా ఇంటర్వ్యూలో తన అభిప్రాయం చెప్పిన తర్వాతనే ఇలా వేధింపులు మొదలయ్యాయని అనసూయ చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం అనసూయ ఏకంగా 42 మందిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిందని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఇదిలా ఉండగా గత ఏడాది శివాజీ మహిళల వస్త్రధారణ పై అనుచిత వ్యాఖ్యలు చేయగా .. అందులో అనసూయ తన అభిప్రాయాలను చెప్పుకొచ్చింది. కానీ కావాలనే కొంతమంది ఆమెను నెగెటివిటీ చేస్తూ కామెంట్లు చేశారు. దీనికి తోడు ఇటీవల ఒక మీడియా ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా ఆమె కొన్ని వ్యాఖ్యలు చేయగా.. వాటిని నెగెటివిటీ చేసి చూపించారు. ఈ నేపథ్యంలోనే అనసూయ వారందరిపై ఫిర్యాదు చేసింది. మొత్తానికి అయితే అనసూయ ఫిర్యాదు చేయడంతో సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ గా మారుతోంది.

Tags:    

Similar News