తెలంగాణ గద్దర్ ఫిల్మ్2025 విజేతలు వీరే..!
ప్రజాగాయకుడు గద్దర్ స్మారకార్థం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన గద్దర్ ఫిలిం అవార్డ్స్ కు సంబంధించిన 2025 సంవత్సరపు విజేతల జాబితా అధికారికంగా ప్రకటించబడింది.;
ప్రజాగాయకుడు గద్దర్ స్మారకార్థం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన గద్దర్ ఫిలిం అవార్డ్స్ కు సంబంధించిన 2025 సంవత్సరపు విజేతల జాబితా అధికారికంగా ప్రకటించబడింది. జ్యూరీ సభ్యులు రెడీ చేసిన లిస్ట్ ను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అందజేయగా, ఈ సమావేశంలో నిర్మాత దిల్ రాజు, నటుడు తనికెళ్ల భరణి, రోజా రమణి, సంగీత దర్శకుడు మణిశర్మ, నటి ప్రగతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం జ్యూరీ అవార్డు గ్రహీతల వివరాలను ప్రకటించారు. ఈ సందర్భంగా భారతీయ సినీ పరిశ్రమకు విశేష సేవలు అందించిన మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్ఠాత్మక ఎన్టీఆర్ నేషనల్ అవార్డును ప్రకటించగా, విలక్షణ నటి జయసుధకు అక్కినేని నాగేశ్వరరావు అవార్డు దక్కింది. పైడి జయరాజ్ అవార్డు కమల్ హాసన్‌కు, సినారే అవార్డు సుద్దాల అశోక్ తేజకు, నాగిరెడ్డి చక్రపాణి అవార్డు అశ్వినీదత్‌కు, రఘుపతి వెంకయ్య అవార్డు రమేష్ ప్రసాద్ కు, కాంతారావు అవార్డు ఆర్. నారాయణ మూర్తికి ప్రకటించారు.
ఈ ఇయర్ మొత్తం 17 విభాగాల్లో గద్దర్ ఫిలిం అవార్డులను అందజేస్తున్నట్లు జ్యూరీ వెల్లడించగా, కొత్తగా సామాజిక సందేశాత్మక చిత్రాలకు ప్రత్యేక పురస్కారాలతో పాటు డాక్టర్ సినారే, ఏఎన్ఆర్ పేర్లతో అవార్డులను కూడా ప్రవేశపెట్టినట్లు తెలిపారు. 2025 జనవరి 1 నుంచి 2025 డిసెంబర్ 31 మధ్య రిలీజైన సినిమాలను నామినేషన్లకు ఎంపిక చేశారు.
గద్దర్ ఫిల్మ్ 2025 అవార్డు విజేతల లిస్ట్:
ఉత్తమ నటుడు- నాగ చైతన్య (తండేల్)
ఉత్తమ నటి- రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్)
ఉత్తమ చిత్రం- రాజు వెడ్స్ రాంబాయి
ఉత్తమ ద్వితీయ చిత్రం- దండోరా
ఉత్తమ తృతీయ చిత్రం- ది ప్రీ వెడ్డింగ్ షో
నేషనల్ ఇంటిగ్రిటీ సినిమా- తండేల్
ఉత్తమ పర్యావరణ చిత్రం- ఇగ్వా
ఉత్తమ డెబ్యూ ఫీచర్ ఫిల్మ్- లిటిల్ హార్డ్స్
ఉత్తమ వినోదాత్మక చిత్రం- సంక్రాంతికి వస్తున్నాం
ఉత్తమ సోషల్ మెసేజ్ చిత్రం- కోర్టు
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ మూవీ- మిరాయ్
ఉత్తమ బాలల చిత్రం- అనగనగనా
ఉత్తమ దర్శకుడు- సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి)
ఉత్తమ డెబ్యూ దర్శకుడు- సాయి మార్తాండ్ (లిటిల్ హార్ట్స్)
ఉత్తమ సహాయ నటుడు- శివాజీ
ఉత్తమ సహాయ నటి- భూమిక
ఉత్తమ సంగీత దర్శకుడు- మార్క్ కె రాబిన్ (దండోరా)
ఉత్తమ నేపథ్య గాయకుడు- అనురాగ్ కులకర్ణి(రాజు వెడ్స్ రాంబాయి)
ఉత్తమ నేపథ్య గాయని- సాహితి చాగంటి (కన్నప్ప)
ఉత్తమ హాస్యనటుడు- కృష్ణ తేజ (జిగ్రీస్)
ఉత్తమ బాలనటుడు- రోహన్ రాయ్ (ప్రీ వెడ్డింగ్ షో)
ఉత్తమ కథా రచయిత- గుణశేఖర్ (యుఫోరియా)
ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్- అనిల్ రావిపూడి
ఉత్తమ గేయ రచయిత- నందకిశోర్ (కుబేర)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్- కార్తిక్ ఘట్టమనేని (మిరాయ్)
ఉత్తమ ఎడిటర్- శ్రీకర్ ప్రసాద్ (మిరాయ్)
ఉత్తమ ఆడియోగ్రాఫర్- ఎం.ఆర్ రాధాకృష్ణన్ (కిష్కిందపురి)
ఉత్తమ కొరియోగ్రాఫర్- గిర గిర గిర (ఛాంపియన్)
ఉత్తమ ఆర్ట్ డైరక్టర్- తోట తరణి (ఛాంపియన్)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్- చంద్రకాంత్ (ఛాంపియన్)
ఉత్తమ స్పెషల్ జ్యూరీ ఫిల్మ్- 23
ఉత్తమ నటుడు స్పెషల్ జ్యూరీ- చైతూ జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి)
ఉత్తమ నటి స్పెషల్ జ్యూరీ- అనంతిక (8 వసంతాలు)
స్పెషల్ జ్యూరీ హీరో- రోషన్ (ఛాంపియన్)