కోలీవుడ్ కు అస్సలు కలిసిరాని 2026 సంక్రాంతి
సంక్రాంతి సీజన్ కు టాలీవుడ్ లోనే కాదు, కోలీవుడ్ లో కూడా మంచి సందడి ఉంటుంది. అక్కడ కూడా పెద్ద ఎత్తున సినిమాలు రిలీజవుతుంటాయి.;
సంక్రాంతి సీజన్ కు టాలీవుడ్ లోనే కాదు, కోలీవుడ్ లో కూడా మంచి సందడి ఉంటుంది. అక్కడ కూడా పెద్ద ఎత్తున సినిమాలు రిలీజవుతుంటాయి. పండగ సీజన్ కావడంతో నిర్మాతలు కావాలని ఆ సీజన్ ను సెలెక్ట్ చేసుకుని తమ సినిమాలను రిలీజ్ చేసి మంచి లాభాలను పొందాలనుకుంటారు. ప్రతీ ఏడాది లాగానే ఈ ఏడాది సంక్రాంతికి కూడా తమిళనాడులో రెండు పెద్ద సినిమాలు షెడ్యూలయ్యాయి.
జన నాయగన్ పై భారీ హైప్
అందులో ఒకటి దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన జన నాయగన్ కాగా, రెండోది శివ కార్తికేయన్ హీరోగా రూపొందిన పరాశక్తి. అయితే ఈ రెండింటిలో విజయ్ సినిమా జన నాయగన్ పై ముందు నుంచి భారీ బజ్ నెలకొంది. విజయ్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లే ముందు ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. విజయ్ నుంచి ఆఖరిగా వస్తున్న సినిమా కావడంతో జన నాయగన్ పై భారీ హైప్ క్రియేట్ అయింది.
సెన్సార్ అడ్డంకుల వల్ల ఆగిపోయిన జన నాయగన్
కానీ ఈ సినిమాకు సెన్సార్ అడ్డంకులు ఎదురవడం వల్ల సంక్రాంతికి సినిమా రిలీజవలేదు. దీంతో విజయ్ ఫ్యాన్స్ కు నిరాశ తప్పలేదు. ఇక తర్వాత శివ కార్తికేయన్ హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన పరాశక్తి జనవరి 10న ప్రేక్షకుల ముందుకొచ్చింది. విజయ్ సినిమా రాకపోవడంతో పరాశక్తికి పోటీ ఉండదు, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని అంతా అనుకున్నారు.
డిజాస్టర్ గా నిలిచిన పరాశక్తి
కానీ పరాశక్తి సినిమా దారుణమైన టాక్ తో డిజాస్టర్ గా నిలిచింది. పండగ సీజన్ అయినప్పటికీ ఈ మూవీ కలెక్షన్లలో అసలేమాత్రం డెవలప్‌మెంట్ లేదు. వేరే సినిమాలు ఏమీ లేకపోయినా ఆడియన్స్ పరాశక్తిని చూడ్డానికి థియేటర్లకు రావడం లేదంటే సినిమా పరిస్థితేంటనేది అర్థం చేసుకోవచ్చు. విజయ్ సినిమా ఆగిపోవడంతో ఇదే టైమ్ అనుకుని కొన్నాళ్లుగా ఆగిపోయిన కార్తీ వా వాతియర్ అన్ని అడ్డంకులను తొలగించుకుని జనవరి 14న రిలీజైంది. వా వాతియార్ కు ఆడియన్స్ నుంచి మిక్డ్స్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ, సినిమాకు ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా సడెన్ గా రిలీజవడంతో ఈ మూవీకి మంచి ఓపెనింగ్స్ రాలేదు. మరోవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రాజా సాబ్ కు కూడా మంచి రెస్పాన్స్ రాకపోవడంతో కోలీవుడ్ లో 2026 సంక్రాంతి సీజన్ చాలా డల్ గా ముగిసింది.