నో మ్యారేజ్..కానీ చెట్టపట్టలేసుకు తిరిగేస్తున్నారు!
బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్‌గా పేరు తెచ్చుకున్న ఆమీర్ ఖాన్ సినిమాలకు మించి వార్తల్లో నిలుస్తున్నాడు.;
బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్‌గా పేరు తెచ్చుకున్న ఆమీర్ ఖాన్ సినిమాలకు మించి వార్తల్లో నిలుస్తున్నాడు. ప్రస్తుతం హీరోగా సినిమాలు చేయడం లేదు. కానీ నిర్మాతగా వ్యవహరిస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇదే సందర్భంగా కొత్త ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌తో కలిసి మీడియా కంటపడుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఆమీర్‌ఖాన్ తను నటించిన `లగాన్` మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసిన కిరణ్ రావుని 2005లో వివాహం చేసుకున్నాడు. 16 ఏళ్ల వీరి వైవాహిక జీవితంలో ఎలాంటి మనస్పర్థలు సంభవించలేదు.
కానీ ఇద్దరు తమ 16 ఏళ్ల వైవాహిక జీవితానికి 2021లో ముగింపు పలికారు. గత ఐదేళ్లుగా వీరు విడి విడిగా ఉంటున్నారు. కిరణ్ రావు కంటే ముందు ఆమీర్‌ఖాన్ రీనా దత్తాని వివాహం చేసుకోవడం..తనకు 2002లో విడాకులు ఇవ్వడం తెలిసిందే. రెండు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకుని వార్తల్లో నిలిచిన ఆమీర్ ఖాన్ తాజాగా మరో బంధంలోకి అడుగు పెట్టాడు. తనకు చిరకాల మిత్రురాలైన గౌరీ స్ప్రాట్‌తో లీవింగ్ రిలేషన్‌ని మొదలుపెట్టాడు. ఆరు పదుల వయసులో మళ్లీ ప్రేమలో పడిన ఆమీర్ ఖాన్ ..కొత్త ప్రేయసి గైరీని పొరపాటున కలిశానని, తనతో ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నానని వెల్లడించి అందరికి షాక్ ఇచ్చాడు.
ప్రస్తుతం వీరిద్దరు కలిసి చెట్టపట్టలేసుకుని తిరిగేస్తుండటం అందరిని షాక్‌కు గురి చేస్తోంది. చైనాలో జరిగిన ఓ ఫిల్మ్ ఫెస్టివెల్ వేదికగా తొలిసారి మీడియా కంటపడిన ఈ జంట ఇప్పుడు యధేచ్చగా చేతులు పట్టుకుని తిరిగేస్తున్నారు. నెట్టింట వైరల్ అవుతున్నారు. ఆరుపదుల ఈ లవ్ బర్డ్స్ తాజాగా ఓ ప్రీమియర్ షోలో సందడి చేశారు. ఆమీర్‌ఖాన్ స్వీయ నిర్మాణంలో నిర్మించిన మూవీ `హ్యాపీ పటేల్ ఖత్నాక్ జాసూస్`. వీర్ దాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ఆమీర్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ నటించాడు. ఆమీర్ ఖాన్ గెస్ట్ రోల్‌లో నటించిన ఈ సినిమా జనవరి 16న ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఈ నేపథ్యంలోనే ముంబాయిలో ప్రీమియర్ షోని ఏర్పాటు చేశారు. ఈ ప్రీమియర్‌కు ఆమీర్‌ఖాన్ మాజీ భార్య కిరణ్ రావుతో పాటు తనయుడు జునైద్ ఖాన్, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఆమీర్ ఖాన్ మాత్రం కొత్త ప్రేయసి గౌరీతో కలిసి ఎంట్రీ ఇవ్వడం అక్కడున్న వారిని సర్‌ప్రైజ్ చేసింది. గౌరీ చేయి పట్టుకుని ఆమీర్ ఖాన్ చెట్టపట్టలేసుకుని ప్రీమియర్‌కు వచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. గాళ్ ఫ్రెండ్ తో ఎంట్రీ ఇవ్వడమే కాకుండా తనతో కలిసి ఆమీర్‌ఖాన్ ఫొటోలకు పోజులిచ్చాడు.
ఈ క్రమంలో ఆమీర్‌ఖాన్ సిగ్గుల మొగ్గవుతూ డ్రెస్ సెట్ చేసుకుంటూ కనిపించడం గమనార్హం. నెట్టింట వైరల్ అవుతున్న ఆమీర్‌ఖాన్, గౌరీ వీడియోపై నెటిజన్‌లు ఫైర్ అవుతున్నారు. లేటు వయసులో ఇలాంటి పనులేంటని కొంత మంది కామెంట్ చేస్తుంటే.. ఇద్దరికి విడాకులిచ్చి ఈ వయసులో మూడో పెళ్లికి రెడీ అయ్యాడు..ఇతన్నీ జైల్లో వేయాల్సిందే అంటూ మరి కొంత మంది విమర్శలు చేస్తున్నారు. మరి కొంత మంది మాత్రం లేటు వయసులో గాళ్ ఫ్రెండ్ దొరికింది.. టేక్ కేర్` అని కామెంట్ చేస్తున్నారు.