ఎన్టీఆర్ కు వినూత్న రీతిలో విషెస్ చెప్పిన స్టార్ క్రికెటర్...!

Update: 2020-05-20 08:30 GMT
సినీ ఇండస్ట్రీలో నట వారసులు చాలా మంది ఉన్నారు. వస్తూనే ఉంటారు. కానీ వారందరిలో నందమూరి తారకరామారావు ప్రత్యేకమని చెప్పవచ్చు. డ్యాన్స్‌ లు, ఫైట్స్‌, నటన, డైలాగ్స్ ఇలా ఏదైనా సరే ఎన్టీఆర్‌ మాత్రమే చేయగలడు అని ప్రేక్షకులు అనుకొనేలా చేస్తాడు. 'స్టూడెంట్ నెం.1' సినిమాతో హీరోగా టాలీవుడ్ లో అడుగుపెట్టి కూచిపూడికైనా.. కుంఫూలకైనా దేనికైనా రెడీ అంటూ నూనుగు మీసాల వయసులోనే స్టార్‌ డమ్‌ అందుకున్నాడు. ఆ తర్వాత 'ఆది' 'సింహాద్రి' సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకొని ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాసాడు. కెరీర్లో ఎత్తు పల్లాలను చవి చూసిన తారక్ 'టెంపర్' సినిమా నుంచి రూట్ మార్చాడు. విలక్షణమైన పాత్రలను వైవిధ్యమైన చిత్రాలను సెలెక్ట్ చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. వరుస సినిమాలను లైన్లో పెడుతూ వరుస హిట్స్ కొడుతున్నాడు. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో నటిస్తున్నాడు. కాగా నేడు తారక రాముడి పుట్టినరోజు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువతో సోషల్ మీడియా దద్దరిల్లుతోంది. ట్విట్టర్ లో టాప్ ట్రెండింగ్‌ లో ఎన్టీఆర్ బర్త్ డే హ్యష్ ట్యాగ్ కొనసాగుతోంది.

ఎన్టీఆర్ పుట్టినరోజున స్టార్స్ అందరూ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఎన్టీఆర్ తో దిగిన ఫోటోలను.. ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ట్విట్టర్ లో పోస్ట్ లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ తనదైన శైలిలో తారక్ కి బర్త్ డే విషెస్ చెప్పాడు. ఈ మధ్య టిక్ టాక్ వీడియోలతో అభిమానులను విశేషంగా అలరిస్తున్నాడు వార్నర్. వరుసగా తెలుగు హిట్ సాంగ్స్ కు డైలాగ్స్ కి టిక్ టాక్ వీడియోలు చేస్తూ టాలీవుడ్ ప్రముఖులను సైతం ఆకట్టుకుంటున్నాడు. తాజాగా వార్నర్ పాటకి టిక్ టాక్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. 'జనతా గ్యారేజ్' సినిమాలోని 'నేను పక్కా లోకల్ సాంగ్'కు డేవిడ్ వార్నర్ తన భార్య కాండీస్ తో కలిసి స్టెప్స్ వేస్తూ టిక్ టాక్ చేసి దానిని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. 'హ్యాపీ బర్త్ డే తారక్.. నీ ఫాస్ట్ డ్యాన్స్  మేము ట్రై చేసాం' అంటూ ఈ వీడియోను జత చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. వాస్తవానికి నిన్ననే ఓ అభిమాని కోరిక మేరకు వార్నర్ "హ్యాపీ బర్త్ డే బడ్డీ" అంటూ ఎన్టీఆర్ కి విషెస్ తెలియజేశాడు.

Tags:    

Similar News