ఫ్యాషన్ వీక్ లో సందడి చేసిన శ్రీలీల!

సినీ తారలు ఒకవైపు సినిమాలలో నటిస్తూ.. తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులలో ఒక గుర్తింపును సొంతం చేసుకుంటూనే..;

Update: 2026-02-26 07:54 GMT

సినీ తారలు ఒకవైపు సినిమాలలో నటిస్తూ.. తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులలో ఒక గుర్తింపును సొంతం చేసుకుంటూనే.. మరొకవైపు అంతర్జాతీయ వేదికలపై తమ ఫ్యాషన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ప్రియాంక చోప్రాను మొదలుకొని యంగ్ బ్యూటీల వరకు ఎంతో మంది అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికలపై కనిపించి.. తమ ఉనికిని చాటుకున్న ఈ ముద్దుగుమ్మలు.. ఇప్పుడు ఒక్కొక్కరుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఫ్యాషన్ వీక్ లో సందడి చేసిన శ్రీలీల..

ఈ క్రమంలోనే ఇండియన్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీ లీల తాజాగా ఇటలీలో జరిగిన అత్యంత ప్రతిష్టాత్మక మిలన్ ఫ్యాషన్ వీక్ లో తన అద్భుతమైన డ్రెస్ సెన్స్ తో అందరి హృదయాలను ఆకట్టుకుంది. మైసన్ మార్గీలా, N21 వంటి డిజైన్ హౌసులు అద్భుతంగా రూపొందించిన క్లాసిక్ దుస్తులతో కనిపించి సందడి చేసింది. ఒనిట్సుకా టైగర్ లో ముందు వరసలో నిలిచిన ఈమె మేరీ జేమ్స్ తో జతచేసిన ఎల్లో కలర్ ట్వీడ్ జాకెట్ ధరించి అందరిని ఆకట్టుకుంది. పైగా జీన్స్ షార్ట్ తో తన అందాలను ఫుల్ ఫిల్ చేసింది. మొత్తానికైతే మిలన్ ఫ్యాషన్ వీక్ లో సందడి చేసి అందరి దృష్టిని ఆకట్టుకోవడమే కాకుండా అంతర్జాతీయ వేదికలపై తన ఉనికిని చాటుకుంటూ ఊహించని ఇమేజ్ సొంతం చేసుకుంది శ్రీ లీల.

శ్రీ లీల అప్కమింగ్ సినిమాలు..

పెళ్లి సందD సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత ధమాకా సినిమాతో ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది.. తన అద్భుతమైన నటనతో స్పెషల్ సాంగులతో ఉర్రూతలూగించే శ్రీ లీల గత కొన్ని రోజులుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో చివరిగా మాస్ జాతర అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె..పరాశక్తి సినిమాతో తమిళ అరంగేట్రం చేసింది కానీ ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇక ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ సరసన తూ మేరీ జిందగీ హై అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. పైగా ఈ సినిమాతో హిందీ రంగ ప్రవేశం చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. అలాగే ధనుష్ 55వ చిత్రంతో పాటు అజిత్ కుమార్ నటించే సినిమాలో అవకాశం అందుకుంది

ఆశలన్నీ పవన్ కళ్యాణ్ సినిమా పైనే..

తెలుగులో హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈమెతో పాటు ఇందులో ప్రముఖ హీరోయిన్ రాశీ ఖన్నా కూడా ఇందులో కీలకపాత్ర పోషిస్తుంది. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాపైనే శ్రీ లీల అంచనాలు పెట్టుకుంది. ఈ సినిమాతో గట్టి కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్న ఈమెకు ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.

Tags:    

Similar News