గీత-గోవింద్ ఒక్కటైన వేళ ఇది..!
అయితే ఈ జంట కలిసి నటించే చివరి సినిమా (ప్రస్తుతానికి) ఏది? అంటూ గూగుల్ లో సెర్చ్ మొదలైంది.;
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ మరియు నేషనల్ క్రష్ రష్మిక మందన్న లవ్ స్టోరీ ఎట్టకేలకు ఒక అందమైన ముగింపుకు చేరుకుంది. ఈ రోజే (26 ఫిబ్రవరి 2026) వీరిద్దరూ రాజస్థాన్- ఉదయ్ పూర్ లోని ఒక ప్రయివేట్ వెన్యూలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ సందర్భంగా ఈ జంట కెరీర్ జర్నీలో 'గీత గోవిందం' మొదలు 'రణబలి' వరకూ ప్రయాణంలో సరిగమల్ని పరిశీలిస్తే...కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి.
2018లో వచ్చిన 'గీత గోవిందం' వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మొదటి సినిమా. గోవింద్, గీతల మధ్య కెమిస్ట్రీ అప్పట్లో ఒక సెన్సేషన్. ఆ ఇద్దరి మధ్యా ఏదో మొదలైందన్న సంకేతం అప్పుడే అందింది. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ సినిమా వీరి స్నేహాన్ని మరింత బలపరిచింది. కష్టకాలంలో విజయ్ తనకు ఒక కామ్రేడ్ లా అండగా నిలిచారని రష్మిక స్వయంగా చెప్పుకొచ్చారు.
అయితే ఈ జంట కలిసి నటించే చివరి సినిమా (ప్రస్తుతానికి) ఏది? అంటూ గూగుల్ లో సెర్చ్ మొదలైంది. పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా 'రణబలి'. ఇది వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మూడవ సినిమా.
రణబలి విశేషాలు..
విజయ్- రష్మిక జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇది ఒక గ్రిట్టీ యాక్షన్ డ్రామా. సెప్టెంబర్ 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది. పెళ్లి తర్వాత ఈ జంట వెండితెరపై కనిపించబోతున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం.
'డియర్ కామ్రేడ్' తర్వాత వీరిద్దరూ కలిసి నటించడానికి చాలా సమయం తీసుకున్నారు. దానికి ప్రధాన కారణాలు..ఈ జంట వ్యక్తిగత జీవితం గురించి వచ్చే వార్తలు సినిమాలను ఓవర్‌షాడో (మరుగున పడేయడం) చేయకూడదని భావించారు.
ఎవరికి వారు ఇండివిడ్యువల్ కెరీర్ పై దృష్టి సారించారు. రష్మిక బాలీవుడ్‌లో పాన్ ఇండియా స్టార్‌గా ఎదుగుతుంటే, విజయ్ తనదైన శైలిలో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. మళ్ళీ ఇద్దరూ కలిసి నటించాలంటే 'గీత గోవిందం' రేంజ్ మ్యాజిక్ రిపీట్ చేసే కథ కావాలని వేచి చూశారు. ఆ అవకాశం 'రణబలి'తో దక్కింది.
గీత గోవిందం లో 'వచ్చిందమ్మా' పాటలో విజయ్ కన్న కల.. ఈ రోజు నిజ జీవితంలో నెరవేరింది. రీల్ లైఫ్ జోడీ కాస్తా రియల్ లైఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ అయిపోయారు!
రెండుసార్లు పెళ్లి....
తెలుగు హిందూ సాంప్రదాయాల ప్రకారం ఉదయం 10:10 ముహూర్తంలో మొదటి వివాహం.. ఇక సాయంత్రం 4:30 గంటలకు రష్మిక స్వంత కొడవ (కర్ణాటక కొడగు) సంప్రదాయంలో రెండో వివాహం జరుగుతుంది. ఈ రెండు సంప్రదాయాలూ ఇరువైపులా మూలాలను గౌరవించేలా ఏర్పాటు చేశారు. తెలుగు వివాహంలో మూడు మాంగళ్య సూత్రాలు కట్టడం, సప్తపది వంటి సాంప్రదాయాలు ఉంటాయి. కొడవ సంప్రదాయంలో మాత్రం పూజారి లేకుండా కుటుంబ పెద్దలు నిర్వహిస్తారు. అగ్ని హోత్రం ఉండదు.