హైప్ కోసం అడ్ర‌స్ చెప్పే ఆలోచ‌న లేదంట‌!

టాలీవుడ్‌లో ఉన్న యంగ్ హీరోల్లో త‌నకంటూ ప్ర‌త్యేక ట్రాక్‌ని క్రియేట్ చేసుకుని ఆ ట్రాక్‌లో బ్యాక్ టు బ్యాక్ స‌క్సెస్‌ల‌ని సొంతం చేసుకుంటున్నారు యంగ్ హీరో శ్రీ‌విష్ణు.;

Update: 2026-02-26 07:54 GMT

టాలీవుడ్‌లో ఉన్న యంగ్ హీరోల్లో త‌నకంటూ ప్ర‌త్యేక ట్రాక్‌ని క్రియేట్ చేసుకుని ఆ ట్రాక్‌లో బ్యాక్ టు బ్యాక్ స‌క్సెస్‌ల‌ని సొంతం చేసుకుంటున్నారు యంగ్ హీరో శ్రీ‌విష్ణు. రొమాంటిక్‌, కామెడీ మూవీస్‌కి ప్ర‌స్తుతం కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచి త‌న‌దైన మార్కు వినోదాన్ని అందించిస్తూ ఎంట‌ర్‌టైన్‌మెంట్ కింగ్ అనిపించుకుంటున్నారు. గ‌త ఏడాది రొమాంటిక్ కామెడీ డ్రామా `సింగిల్‌` మూవీతో ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుని సూప‌ర్ హిట్‌ని అందుకున్న‌ ఆయ‌న ఈ ఏడాది మ‌రో కామెడీ విన్యాసంతో క‌డుపుబ్బా న‌వ్వించ‌డానికి రెడీ అయ్యాడు.

శ్రీ‌విష్ణు న‌టించిన లేటెస్ట్ కామెడీ డ్రామా `విష్ణు విన్యాసం`. న‌యన్‌ హారిక క‌థాయిక‌గా న‌టించింది. ఈ మూవీ ద్వారా య‌ధునాథ్ మారుతీరావు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు సినిమాపై అంచ‌నాల్ని పెంచేశాయి. ఫిబ్ర‌వ‌రి 27న ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. సినిమా విష‌యంలో హీరో శ్రీ‌విష్ణు ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. సినిమా ఆద్యంతం వినోదాత్మ‌కంగా సాగుతూ ప్రేక్ష‌కుల్ని విశేషంగా అల‌రిస్తుంద‌ని, న‌వ్విస్తూనే ఎమోష‌న‌ల్‌గా సాగుతుంద‌ని, సినిమా ప్ర‌తి ఒక్క‌రినీ ఎంట‌ర్‌టైన్ చేస్తుంద‌ని చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు.

మ‌రి కొన్ని గంట‌ల్లో సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ నేప‌థ్యంలో టీమ్ మీడియాతో ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించింది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడికి ఎదురైన ప్ర‌శ్న నెట్టింట వైర‌ల్ అవుతూ పాన్ ఇండియా సినిమా కోసం ట్రై చేసి విఫ‌ల‌మైన ఓ ద‌ర్శ‌కుడిని గుర్తు చేస్తోంది. ఈ సినిమా డైరెక్ట‌ర్ పేరు కూడా మారుతీనే కావ‌డంతో మీడియా ఓ ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌శ్న సంధించింది. సినిమాపై హైప్‌ని క్రియేట్ చేయ‌డానికి మీ అడ్ర‌స్ చెప్పే అవ‌కాశం ఏదైనా ఉంటా? అంటూ అడ‌గ‌డంతో వెంట‌నే తేరుకున్న ద‌ర్శ‌కుడు అలాంటి ఆలోచ‌న ఏమీలేద‌ని ట‌క్కున స‌మాధానం చెప్ప‌డం గ‌మ‌నార్హం.

గ‌తంలో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన భారీ కామెడీ థ్రిల్ల‌ర్ మూవీకి ఓ యంగ్ డైరెక్ట‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం తెలిసిందే. కామెడీ హార‌ర్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ భారీ విజ‌యాన్ని సాధించిన త‌మ హీరో ఖాతాలో మ‌రో హిట్‌గా నిలుస్తుంద‌ని అభిమానులు భావించారు. కానీ ఫ‌లితం తారుమారైంది. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లై ప్లాప్‌గా నిలిచి షాక్ ఇచ్చింది. అయితే ఈ సినిమా రిలీజ్ సంద‌ర్భంగా నిర్వ‌హించిన ప్ర‌మోష‌న్స్‌లో ద‌ర్శ‌కుడు సినిమా గురించి మాట్లాడుతూ సినిమా న‌చ్చ‌క‌పోతే నా ఇంటికి వ‌చ్చి నిల‌దీయొచ్చ‌ని త‌న ఇంటి అడ్ర‌స్ చెప్ప‌డం అప్ప‌ట్లో సంచ‌ల‌నంగా మార‌డం తెలిసిందే.

సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టేయ‌డంతో ప్ర‌భాస్ అభిమానులు తీవ్ర నిరాశ‌కు, ఆగ్ర‌హానికి లోన‌య్యారు. మూడేళ్ల‌కు పైనే నిర్మాణంలో ఉండి భారీ బ‌డ్జెట్‌తో చేసిన సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాప్‌గా నిలిచి షాక్ ఇవ్వ‌డంతో ఆగ్ర‌హానికి గురైన అభిమానులు డైరెక్ట‌ర్ ఇంటి ముందు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. డైరెక్ట‌ర్ తొంద‌రప‌డి అడ్ర‌స్ చెప్ప‌డంతో ఫ్యాన్స్ భారీ స్థాయిలో ద‌ర్శ‌కుడి ఇంటిని చుట్టుముట్టే ప్ర‌య‌త్నం చేసి షాక్ ఇచ్చారు. ఇది టాలీవుడ్‌లో తీవ్ర చ‌ర్చ‌కు తెర‌తీసింది. మ‌ళ్లీ అలాంటి స్టేట్‌మెంట్‌ని మ‌రో డైరెక్ట‌ర్ ఇవ్వ‌కూడ‌ద‌ని అంతా ఫిక్స్ అయ్యారు. ఈ నేప‌థ్యంలో `విష్ణు విన్యాసం` ద‌ర్శ‌కుడికి ఇదే తర‌హా ప్ర‌శ్న ఎదుర‌వ‌డంతో ఇప్పుడు మ‌రోసారి ప్ర‌భాస్ డైరెక్ట‌ర్ పేరు నెట్టింట వైర‌ల్ అవుతోంది.

Tags:    

Similar News