ఫ్యాన్స్‌కి మ‌హేష్ డ‌బుల్ ధ‌మాకా ట్రీట్

సూపర్ స్టార్ మహేష్ బాబు- దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో `వారణాసి` గురించి వస్తున్న తాజా వార్త‌లు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి.;

Update: 2026-02-26 04:05 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు- దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో `వారణాసి` గురించి వస్తున్న తాజా వార్త‌లు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. శ్రీ‌రాముడిగా ఈ సినిమాలో మ‌హేష్ లుక్ గురించి చాలా చ‌ర్చ సాగుతోంది. అదే స‌మ‌యంలో ఈ సినిమా కోసం రాజ‌మౌళి ఎంపిక చేసుకున్న క‌థాంశం కూడా ఉత్కంఠ‌ను క‌లిగిస్తోంది. అయితే రాజ‌మౌళి కోసం మ‌హేష్ ఏకంగా కొన్నేళ్ల పాటు లాక్ అయిపోవ‌డ‌మే అభిమానుల్లో అసంతృప్తిని నింపుతోంది. అయితే దీనికి ఒక ప‌రిష్కారాన్ని క‌నుగొనేందుకు మ‌హేష్ సీరియ‌స్ గా ఆలోచించార‌ని తెలుస్తోంది.

సూప‌ర్ స్టార్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌ను రిలీజ్ చేయ‌డం ద్వారా ఫ్యాన్స్ ఆక‌లి తీర్చాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు తెలుస్తోంది. వారణాసి షూటింగ్ 2026 సెప్టెంబర్ నాటికి దాదాపు పూర్తవుతుందని.. ఆ వెంటనే నవంబర్ నుండి మహేష్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి.

స్టార్ హీరోలు ఎక్కువ సినిమాల్లో న‌టించ‌డం లేద‌నే విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టేలా.. సూప‌ర్ స్టార్ గ్యాప్ లేకుండా వ‌రుస సినిమాల‌ను రిలీజ్ చేయాల‌ని కూడా ఆలోచిస్తున్నార‌ట‌. అయితే రాజమౌళి సినిమాలకు పోస్ట్-ప్రొడక్షన్ సమయం ఎక్కువగా పడుతుంది కాబట్టి.. ఆ గ్యాప్‌లో మహేష్ మరో సినిమాను పూర్తి చేసి, `వారణాసి` రిలీజ్ అయిన కొద్ది నెలలకే దానిని కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఫ్యాన్స్‌కు ఇది నిజంగా `డబుల్ ధమాకా` ట్రీట్ అనే చెప్పాలి.

అన్నపూర్ణ స్టూడియోస్‌లో షూటింగ్..

తాజా సమాచారం ప్రకారం...25, ఫిబ్రవరి 2026న రాజమౌళి అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ `వారణాసి`కి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను అక్కడే ఉన్న అడ్వాన్స్‌డ్ మోషన్ క్యాప్చర్ ల్యాబ్‌లో షూట్ చేసినట్లు వెల్లడించారు. ఈ టెక్నాలజీతో సినిమా విజువల్స్ హాలీవుడ్ రేంజ్‌లో ఉండబోతున్నాయి.

మహేష్ బాబు ఈ సినిమాలో `రుద్ర` అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. ప్రియాంక చోప్రా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ సినిమా చూస్తున్నప్పుడు మనం ప్రపంచమంతా చుట్టేయడమే కాకుండా.. విభిన్న కాలాల్లోకి `టైమ్ ట్రావెల్` చేస్తామ‌ని హింట్ ఇచ్చారు. గ్లోబ్-ట్రోటింగ్ యాక్షన్ అడ్వెంచర్ & టైమ్ ట్రావెల్ క‌థాంశానికి త‌గ్గ‌ట్టుగానే దాదాపు 1200 కోట్ల బ‌డ్జెట్ ని ఖ‌ర్చు చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఈ సినిమాని 7ఏప్రిల్ 2027న విడుద‌ల చేయ‌నున్నారు.

Tags:    

Similar News