సినిమాలు కాదు… తన మ్యూజిక్‌కే ప్రాధాన్యం! ఆ సింగర్ నిర్ణయం వైరల్!

భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన మధురమైన గొంతుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సింగర్ అర్జిత్ సింగ్.

Update: 2026-08-10 18:30 GMT

భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన మధురమైన గొంతుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సింగర్ అర్జిత్ సింగ్. కొత్త ప్లేబ్యాక్ పాటలు పాడటం నిలిపివేస్తున్నట్లు ఆయన తీసుకున్న నిర్ణయం అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే అర్జిత్ పూర్తిగా సంగీతానికి దూరం కాలేదని, కేవలం తన సొంత సంగీత ప్రయాణానికి ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అమాల్ మల్లిక్ స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ వివరాలు ఇలా వున్నాయి..

అర్జిత్ నిర్ణయంపై అమాల్ మల్లిక్ స్పష్టత:

అర్జిత్ సింగ్ ప్లేబ్యాక్ సింగింగ్‌కు విరామం ఇవ్వడంపై మ్యూజిక్ కంపోజర్ అమాల్ మల్లిక్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అర్జిత్ సంగీతాన్ని వదిలేయలేదని, కొత్త సినిమాలకు పాడటం ఆపేసినప్పటికీ, ఇదివరకు ఒప్పుకున్న పాత ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నారని తెలిపారు. ఇక భారతీయ శాస్త్రీయ సంగీతంలోకి తిరిగి వెళ్లాలని, కొత్త రకాల సంగీత ప్రయోగాలు చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ విరామం తీసుకున్నారని అమాల్ వెల్లడించారు.

'ఆవారాపన్ 2' పాట వెనుక అసలు కథ:

అర్జిత్ ప్లేబ్యాక్ ఆపేసిన తర్వాత ఆయన మళ్లీ 'ఆవారాపన్ 2' చిత్రంలో 'యే ఆవారాపన్' పాట పాడటంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇక దీనిపై అమాల్ స్పందిస్తూ.. ఈ పాట ఎవరి ఒత్తిడి వల్లనో లేదా పాత రికార్డింగో కాదని తేల్చి చెప్పారు. దాదాపు ఏడాది కాలంగా ఈ పాట అమాల్ సొంత గొంతులోనే ఉందట. అయితే అర్జిత్ ఈ పాటను విన్న తర్వాత, స్వయంగా ఇష్టపడి పాడటానికి ముందుకు వచ్చారని ఆయన తెలిపారు.

తనకంటూ ప్రత్యేకమైన సంగీత ప్రయాణం:

అర్జిత్ సింగ్ కేవలం సినిమాలలోని పాటలకే పరిమితం కాకుండా తనలోని అసలైన సంగీతకారుడిని వెలికితీయాలనుకుంటున్నారు. ఇక వ్యాపారాత్మకమైన సినిమా పాటల కంటే, తనకు నచ్చిన స్వచ్ఛమైన సంగీతం వైపు అడుగులు వేయడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. ప్లేబ్యాక్ పాడటం తగ్గించినా, ఆయన సంగీత తపస్సు మాత్రం ఆగలేదని సంగీత వర్గాలు అంటున్నాయి.

హిట్ పాటల హోరులో కొట్టుకుపోకుండా, తన ఆత్మసంతృప్తి కోసం ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ వైపు అడుగులు వేస్తున్న అర్జిత్ సింగ్ నిర్ణయం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ఇక సినిమాల్లో ఆయన గొంతు తక్కువగా వినపడవచ్చు కానీ, ఆయన అందించే కొత్త రకమైన మ్యూజిక్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News