• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రజినీ గురించి రాజమౌళి...

రజినీ గురించి రాజమౌళి మనసులో మాట

By - Tupaki Desk
Update: 2022-08-25 00:30 GMT
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో సినిమా అంటే బాలీవుడ్‌ నుండి టాలీవుడ్‌.. కోలీవుడ్ ఇలా అన్ని భాషలకు చెందిన స్టార్‌ హీరోలు.. సూపర్‌ స్టార్‌ హీరోలు డేట్లు ఇచ్చేందుకు రెడీ అంటారు. రాజమౌళి ఇప్పుడు కేవలం జాతీయ స్థాయి కాదు.. ఆయనది అంతర్జాతీయ స్థాయి అనడంలో సందేహం లేదు. ఆయనతో సినిమా అంటే ప్రతి ఒక్కరు కూడా ఏళ్లకు ఏళ్లు డేట్లు ఇచ్చేందుకు ముందుకు వస్తారు.

అంతటి స్టార్ డమ్ మరియు అంతటి క్రేజ్ కలిగి ఉన్న రాజమౌళి మాత్రం తనకు తమిళ్ సూపర్ స్టార్‌ రజినీకాంత్ తో సినిమా చేయాలని ఉందంటూ చెప్పుకొచ్చాడు.

గతంలోనే ఈ విషయాన్ని రాజమౌళి చెప్పుకొచ్చాడు. రాజమౌళి గతంలో కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రజినీ సర్‌ తో సినిమా చేసే అవకాశం కోసం వెయిట్‌ చేస్తున్నాను.. ఆ అవకాశం వస్తే వదిలి పెట్టను అన్నాడు.

ఇప్పుడు బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్ లో భాగంగా చెన్నై లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌ లో రాజమౌళి పాల్గొన్నాడు. బ్రహ్మాస్త్ర సినిమా కు రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. సౌత్‌ భాషల్లో రాజమౌళి బ్రహ్మాస్త్ర సినిమాను సమర్పిస్తున్నాడు. కనుక సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో రాజమౌళి పాల్గొంటూ ఉన్నాడు.

తాజా చెన్నై బ్రహ్మాస్త్ర ప్రెస్‌ మీట్ లో తమిళ్‌ మీడియా వారితో మాట్లాడుతూ రజినీకాంత్‌ సర్ తో సినిమా చేయడం కోసం వెయిట్ చేస్తున్నాను.. అది తన డ్రీమ్‌ అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. రజినీకాంత్‌ ఇప్పటికి కూడా సినిమాలు చేస్తున్నాడు. కానీ వీరిద్దరి కాంబోలో సినిమా అనేది మాత్రం దాదాపు అసాధ్యం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్ ఆర్‌ ఆర్‌ తర్వాత టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు తో సినిమా ను చేసేందుకు రాజమౌళి సిద్ధం అవుతున్నాడు. అలాగే భవిష్యత్తులో కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్ తో కూడా రాజమౌళి సినిమా ను చేస్తాడేమో చూడాలి.
Tags:    
  • TollywoodFilmMaker 
  • SSRajamouli 
  • FilmIndustry 
  • Rajinikanth 
  • BrahmastraChennaiPromotions 
  • Maheshbabu 
  • TollywoodFilms 

Similar News

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

Copyright @2026

Powered by Blink CMS