ఓటీటీకి క్యూ కడుతున్న సౌత్ హీరోలు
ఓటీటీ కంటెంట్ అంటే మొన్నటి వరకు ఉత్తరాది ప్రేక్షకులు మాత్రమే చూసేందుకు ఆసక్తి చూపించేవారు. కాని గత ఏడాదిన్నర కాలంగా థియేటర్లు లేకపోవడంతో సౌత్ ఆడియన్స్ కూడా ఓటీటీ కంటెంట్ పై ఆసక్తి చూపిస్తున్నారు. సినిమాలు మరియు వెబ్ సిరీస్ లను ఓటీటీల ద్వారా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. రాబోతున్న కాలం మొత్తం కూడా ఓటీటీలదే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే స్టార్ ఫిల్మ్ మేకర్స్ నుండి హీరోలు హీరోయిన్స్ వరకు చాలా మంది బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు ఓటీటీ వైపు అడుగులు వేశారు.. వేస్తూనే ఉన్నారు. మొన్నటి వరకు సౌత్ లో ఓటీటీ అంటే స్టార్స్ కాస్త చిన్న చూపు చూసేవారు. కాని ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి మారిపోయింది. అనూహ్యంగా స్టార్స్ కూడా ఓటీటీ ఎంట్రీకి సిద్దం అవుతున్నారు.
తమిళ స్టార్ హీరో సూర్య ప్రముఖ ఓటీటీ తో ఒప్పందం చేసుకున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. మరో వైపు తెలుగు స్టార్ హీరోలు అయిన నాగార్జున మరియు నాగ చైతన్యలు ఇప్పటికే ఓటీటీ కంటెంట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని... వారు షూటింగ్ ల్లో పాల్గొనేందుకు కూడా రెడీ అవుతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. తమిళ స్టార్ హీరో ఆర్య కూడా ఓటీటీ కంటెంట్ లో నటించేందుకు ఓకే చెప్పాడట.
ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వారితో ఆర్య ఒప్పందం చేసుకున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆర్య ఒక భారీ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్ లో నటించబోతున్నాడట. సౌత్ లో అన్ని భాషల్లో కూడా ఆ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవ్వబోతుంది. వెబ్ సిరీస్ లో ఆర్య చాలా విభిన్నంగా కనిపించబోతున్నాడని సమాచారం అందుతోంది. ప్రముఖ దర్శకుడు ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తాడని అంటున్నారు. సినిమాకు మించిన పారితోషికంను ఆర్య ఈ వెబ్ సిరీస్ కు అందుకోబోతున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి సౌత్ నుండి కూడా హీరోలు ఓటీటీ లు అంటూ క్యూ కడుతున్న నేపథ్యంలో సరికొత్త ట్రెండ్ మొదలు అవ్వబోతున్నాయి.