బికినీ ట్రీట్ తో లక్.. ఆషికకు వరుస ఛాన్సులు?
అయితే ఇప్పుడు ఆ గ్లామర్ ట్రీట్.. కొత్త మూవీ ఛాన్స్ లు తీసుకొచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. యంగ్ హీరో శర్వానంద్ మూవీలో ఛాన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది.;
యంగ్ హీరోయిన్ ఆషిక రంగనాథ్ గురించి అందరికీ తెలిసిందే. అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అమ్మడు.. ఇప్పుడు సంక్రాంతి కానుకగా వచ్చిన భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీతో థియేటర్స్ లో సందడి చేస్తున్నారు. ఆ సినిమాలో యాక్టింగ్ తో అందరినీ అలరించారు. అదే సమయంలో రీసెంట్ గా సోషల్ మీడియాలో బికినీ పిక్స్ షేర్ చేసి ఒక్కసారిగా ట్రెండింగ్ లో నిలిచారు.
కన్నడ ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించిన ఆషిక రంగనాథ్, అక్కడ వరుస సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత తెలుగులో అడుగుపెట్టి అమిగోస్, నా సామి రంగా, లవర్ వంటి చిత్రాల్లో నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తరచూ ఫోటోషూట్లతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. రీసెంట్ గా బికినీ పిక్స్ తో హాట్ టాపిక్ గా మారారు.
అయితే ఇప్పుడు ఆ గ్లామర్ ట్రీట్.. కొత్త మూవీ ఛాన్స్ లు తీసుకొచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. యంగ్ హీరో శర్వానంద్ మూవీలో ఛాన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆ చిత్రంలో ఆషిక హీరోయిన్ గా ఎంపికైనట్లు సమాచారం. ఆ సినిమాతో శ్రీను వైట్ల మళ్లీ ఫామ్ లోకి రావాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఒకప్పుడు వరుస బ్లాక్ బస్టర్లతో టాలీవుడ్ ను షేక్ చేసిన ఆయన, ఇటీవల కొంతకాలంగా ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోయారు.
ఇప్పుడు కొత్త కథతో శర్వానంద్ తో కలిసి కమర్షియల్ ఎంటర్టైనర్ ను తెరకెక్కించనున్నారని టాక్. ఇందులో ఆషిక పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంటుందని, గ్లామర్ తో పాటు నటనకు కూడా అవకాశం ఉన్న రోల్ ను రూపొందిస్తున్నారని తెలుస్తోంది. ఆషికకు శర్వా- శ్రీను వైట్ల మూవీ టాలీవుడ్ కెరీర్ లో టర్నింగ్ పాయింట్ కావచ్చని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
స్టార్ హీరో సరసన, పేరు ఉన్న దర్శకుడితో పని చేసే అవకాశం రావడం ఆమె కెరీర్ కు ప్లస్ అయ్యే అంశంగా మారనుంది. ముఖ్యంగా కమర్షియల్ సినిమాల్లో ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉందని అంతా అంటున్నారు. ప్రస్తుతం ఆ సినిమా ప్రీప్రొడక్షన్ దశలో ఉందని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. హీరోయిన్ ఎంపికపై ఇంకా అధికారికంగా క్లారిటీ రాకపోయినా, ఆషిక పేరు దాదాపు ఫిక్స్ అయినట్టేనని సమాచారం.
మొత్తానికి… ఒక ఫోటోషూట్ ఆషిక కెరీర్ ను కొత్త దిశగా తీసుకెళ్లినట్టుగా కనిపిస్తోంది. బికినీ ట్రీట్ తో మొదలైన ఆ లక్కీ జర్నీ ఆమెను టాలీవుడ్ లో
స్ట్రాంగ్ గా నిలబెడుతుందా? లేదంటే టెంపరరీ హైప్ కే పరిమితమవుతుందా? అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. మరి చూడాలి ఆషిక అప్ కమింగ్ మూవీస్ తో ఎలాంటి విజయాలు అందుకుంటుందో..