జక్కన్న మాస్టర్ ప్లాన్.. ఆ హీరోలకు ముందస్తు హెచ్చరిక?

పైగా ఇందులో మహేష్ బాబు రాముడిగా, రుద్ర పాత్రతో పాటు మరో మూడు పాత్రలో కనిపించనున్నారు అని తెలిపిన విషయం తెలిసిందే.;

Update: 2026-01-22 02:30 GMT

దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ అందుకున్నారు. అలాంటి ఈయన నుంచి వస్తున్న చిత్రం వారణాసి. ఆఫ్రికన్ అడవులలో యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్నారు. మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అందులో భాగంగానే అభిమానులను సర్ప్రైజ్ చేయడానికి గత ఏడాది రాజమౌళి గ్లోబ్ ట్రోటర్ అంటూ రామోజీ ఫిలిం సిటీ వేదికగా ఒక పెద్ద ఈవెంట్ ను నిర్వహించారు. ఇందులో టైటిల్ రివీల్ తో పాటు హీరో క్యారెక్టర్రైజేషన్ గురించి కూడా రివీల్ చేసి అభిమానులను సర్ప్రైజ్ చేశారు.

పైగా ఇందులో మహేష్ బాబు రాముడిగా, రుద్ర పాత్రతో పాటు మరో మూడు పాత్రలో కనిపించనున్నారు అని తెలిపిన విషయం తెలిసిందే.దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక అందులో భాగంగానే 2027 సమ్మర్ సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ముందుగా ప్రకటించింది. ఈ విషయం అభిమానులను సంతోషపరిచినా.. నెటిజన్లు మాత్రం రిలీజ్ డేట్ పై పలు రకాల కామెంట్లు చేశారు. ఎందుకంటే రాజమౌళి సినిమాలు అంటే చెప్పిన డేట్ కి ఏ రోజు రావు అవి, ఆలస్యం అవుతాయే తప్ప ముందుగా వచ్చిన దాఖలాలు లేవు. అందుకే ఈ డేట్స్ పై అనుమానాలు వ్యక్తం చేయగా స్వయంగా మరోసారి చిత్ర బృందం స్పందించి 2027 సమ్మర్ స్పెషల్ గా సినిమా రాబోతోంది నేడు ప్రకటించారు

ఇక ఈ ప్రకటన చూసిన అభిమానులు, నెటిజన్స్ జక్కన్న మాస్టర్ ప్లాన్ వేశాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు తన సినిమా విడుదల తేదీనీ ప్రకటించి ముందుగా ఆ హీరోలకు హెచ్చరిక చేస్తున్నాడు అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. విషయంలోకి వెళ్తే రాజమౌళి సినిమా వచ్చింది అంటే మినిమం వందల కోట్లు రాబడుతుందనే అంచనాలు అభిమానులలో ఎప్పటినుంచో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్థాయి కాదు పాన్ వరల్డ్ రేంజ్ లో సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఇక ఈ సినిమా దెబ్బకి అన్ని రికార్డులు క్లోజ్ అయిపోతాయి అని ఇండస్ట్రీ వర్గాల్లో కూడా అంచనాకి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా విడుదల సమయంలో మరో సినిమా విడుదలయితే అందులో కంటెంట్ బాగున్నప్పటికీ డిజాస్టర్ మూటకట్టుకోవాల్సి వస్తుందని.. అందుకే ఇప్పుడు ముందుస్తు హెచ్చరికగా.. ఏడాదికి ముందే తన సినిమా విడుదల సమయాన్ని ప్రకటించారు అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

ఇదిలా ఉండగా వచ్చే ఏడాది అదే సమ్మర్ టార్గెట్ గా కే జి ఎఫ్, సలార్ చిత్రాలతో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో చేస్తున్న డ్రాగన్ సినిమా విడుదల కాబోతోంది. అంతేకాదు సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో చేస్తున్న సినిమా స్పిరిట్ . అయితే ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 5వ తేదీన విడుదల కాబోతున్నట్లు సందీప్ రెడ్డి ముందుగానే డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఇక మిగిలింది అట్లీ అల్లు అర్జున్తో చేస్తున్న సినిమా.. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్ గా విడుదల కాబోతోంది. మరి ఇంతమంది బడా డైరెక్టర్లు 2027 సమ్మర్ ను టార్గెట్ గా చేసుకొని విడుదలకు సిద్ధమవుతున్నారు. మరి ఏ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.


Tags:    

Similar News