ENE 2: ఒకరు అవుట్.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన తరుణ్ భాస్కర్
తరుణ్ భాస్కర్ తన పోస్ట్‌లో చాలా ఎమోషనల్ పాయింట్స్ రాసుకొచ్చారు. సుశాంత్ వ్యక్తిగత కారణాల వల్ల ఈ జర్నీ నుండి తప్పుకున్నాడని, ఆ విషయం తెలిసినప్పుడు తాను తీవ్రంగా బాధపడ్డానని చెప్పారు.;
'ఈ నగరానికి ఏమైంది' సినిమా థియేటర్ లో మొదటిసారి రిలీజ్ లో కంటే రీ రిలీజ్ లోనే ఎక్కువ ఓపెనింగ్స్ అందుకుంది. దాన్ని బట్టి సినిమాకు ఏ స్థాయిలో క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ENE 2 కోసం ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అయితే గత కొద్దిరోజులుగా ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. ఈ గ్యాంగ్‌లోని నలుగురు మిత్రులలో ఒకరు పార్ట్ 2లో ఉండటం లేదని, ఎవరో ఒకరు తప్పుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా టాక్ వినిపించింది. దీంతో అసలు ఆ నలుగురు లేకుండా సీక్వెల్ ఏంటి అని నెటిజన్లు రకరకాలుగా చర్చించుకోవడం మొదలుపెట్టారు.
ఈ వార్తలపై ఎట్టకేలకు దర్శకుడు తరుణ్ భాస్కర్ స్పందించారు. సుశాంత్ (కార్తీక్) ఈ ప్రాజెక్ట్‌లో లేరనే రూమర్లపై ఆయన అఫీషియల్‌గా క్లారిటీ ఇచ్చారు. సినిమా షూటింగ్ మొదలవుతున్న సమయంలోనే తరుణ్ ఈ విషయాన్ని బయటపెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సుశాంత్ లేని లోటు కనిపిస్తున్నా, సినిమా మాత్రం ఆగదని, ఆ పాత్రను మరోలా డిజైన్ చేస్తున్నట్లు ఒక సుదీర్ఘమైన పోస్ట్ ద్వారా తన మనసులోని మాటను పంచుకున్నారు.
తరుణ్ భాస్కర్ తన పోస్ట్‌లో చాలా ఎమోషనల్ పాయింట్స్ రాసుకొచ్చారు. సుశాంత్ వ్యక్తిగత కారణాల వల్ల ఈ జర్నీ నుండి తప్పుకున్నాడని, ఆ విషయం తెలిసినప్పుడు తాను తీవ్రంగా బాధపడ్డానని చెప్పారు. అసలు సుశాంత్ లేడు అని తెలిశాక ఈ సినిమాను చేయాలా వద్దా అని కూడా ఆలోచించినట్లు ఆయన నిజాయితీగా ఒప్పుకున్నారు. కేవలం డబ్బు కోసం సినిమా తీయడం తనకిష్టం లేదని, ఫ్రెండ్‌షిప్ వైబ్ పర్ఫెక్ట్‌గా కుదిరితేనే ఈ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లాలని గట్టిగా ఫిక్స్ అయినట్లు క్లారిటీ ఇచ్చారు.
అయితే స్క్రిప్ట్‌ను మళ్ళీ విశ్లేషించుకున్నాక కార్తీక్ పాత్రను కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తరుణ్ తెలిపారు. సుశాంత్ ఈ ప్రయాణంలో లేకపోయినా, సినిమాలో కార్తీక్ క్యారెక్టర్ మాత్రం ఉంటుందని ఆయన క్లియర్ గా చెప్పారు. వర్క్ జరుగుతున్న కొద్దీ తనలో కాన్ఫిడెన్స్ పెరుగుతోందని, ఆడియన్స్ ఆశించే అదే రియలిస్టిక్ డ్రామా మళ్ళీ రిపీట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. "కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు, ద బాయ్స్ మళ్ళీ వస్తున్నారు" అంటూ తన టీమ్ మీద ఉన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ఇప్పుడు అసలు సిసలు సవాల్ ఎక్కడ ఉందంటే, కార్తీక్ క్యారెక్టర్ లో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అనేది ఫ్యాన్స్‌లో కదులుతున్న అతిపెద్ద ప్రశ్న. ఎందుకంటే కార్తీక్ క్యారెక్టర్ ను జనాలు అంతగా ఓన్ చేసుకున్నారు. ముఖ్యంగా మీమ్స్ లో అతని ఎంగేజ్మెంట్ రింగ్ ధర చెప్పినప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్‌లో వచ్చే ఒక నవ్వు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. అలాగే హీరో వివేక్ తో అతని మధ్య జరిగే కన్వర్సేషన్స్, ఆ అమాయకత్వం యూత్ కి చాలా పర్సనల్ గా కనెక్ట్ అయ్యాయి.
అలాంటి పవర్‌ఫుల్ క్యారెక్టర్ స్థానంలో మరొకరిని ఫిక్స్ చేయడం అంటే అది మేకర్స్ కి పెద్ద టాస్క్ అనే చెప్పాలి. సుశాంత్ పర్ఫార్మెన్స్ ను రీప్లేస్ చేయడం ఈజీ కాదు. కానీ తరుణ్ భాస్కర్ మేకింగ్‌లో ఒక మ్యాజిక్ ఉంటుంది, ఆయన నటీనటుల నుండి బెస్ట్ అవుట్‌పుట్ రాబట్టుకోవడంలో దిట్ట. మరి ఈ కొత్త కార్తీక్ తో తరుణ్ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడో వేచి చూడాలి.