మ‌హేష్ బిజినెస్ స్కెచ్ అదుర్స్‌!

మ‌ల్టీప్లెక్స్ చైన్‌ని విస్త‌రిస్తున్న సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బిజినెస్ స్కెచ్ అదుర్స్ అంటున్నారు ఫ్యాన్స్‌.;

Update: 2026-01-21 19:30 GMT

మ‌ల్టీప్లెక్స్ చైన్‌ని విస్త‌రిస్తున్న సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బిజినెస్ స్కెచ్ అదుర్స్ అంటున్నారు ఫ్యాన్స్‌. ఓ ప‌క్క సినిమాలు చేస్తూనే మ‌రో ప‌క్క మ‌ల్టీప్టెక్స్ బిజినెస్‌ని మ‌హేష్ ప‌రుగులు పెట్టిస్తున్నారు. ఏషియ‌న్ ఫిలింస్ అధినేత సునీల్ నారంగ్‌తో క‌లిసి ఏఎంబీ బ్రాండ్‌ని క్రియేట్ చేసిన ఆయ‌న దీనిని దేశ వ్యాప్తంగా విస్త‌రించే ప్లాన్‌ని అమ‌లు చేసే ప‌నిలో ఉన్నాడు. స్టార్ హీరోలు అల్లు అర్జున్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌వితేజ ఒక్కో మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్ల‌తో స‌రిపెట్టుకుంటే మ‌హేస్ మాత్రం భారీ చైన్ సిస్ట‌మ్‌ని క్రియేట్ చేయ‌బోతున్నాడు.

తొలి ప్ర‌య‌త్నంగా హైద‌రాబాద్‌లోని గ‌చ్చిబౌలి ఏరియాలో ఏఎంబీ సినిమాలు పేరుతో తొలి మ‌ల్టీప్లెక్స్‌ని ప్రారంభించారు. ప్ర‌స్తుతం అది ఐటీ కారిడార్‌కు అత్యంత స‌మీపంలో ఉండ‌టం, ల‌గ్జ‌రీ జ‌నావాసాల మ‌ధ్య ఉండ‌టంతో దీనికి ప్రేక్ష‌కుల తాకిడి విపరీతంగా ఉంటోంది. ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో పాటు ఇక్క‌డ ప‌లు బ్రాండ్‌ల‌కు సంబంధించిన రెస్టారెంట్స్‌, క్లాతింగ్ షోరూమ్స్ వంటి వివిధ మినీ షోరూమ్స్ ఉండ‌టంతో వీకెండ్స్‌లో ప్రేక్ష‌కులు అధిక సంఖ్య‌లో ఇక్క‌డికి విచ్చేస్తున్నారు.

దీంతో సిటీలో మ‌రిన్ని మ‌ల్టీప్లెక్స్‌ల‌కు శ్రీకారం చుట్టాల‌ని ప్లాన్ చేసిన మ‌హేష్ ఇప్ప‌టికే హ‌కీంపేట్‌, ,ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌ల‌లో రెండు థియేట‌ర్ల‌ని మొద‌లు పెట్టాడు. ప్ర‌స్తుతం క‌న్‌స్ట్ర‌క్ష‌న్ ద‌శ‌లో ఉన్న ఈ మ‌ల్టీప్లెక్స్ థీయేట‌ర్స్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్నాయి. సిటీలో మ‌రిన్ని మ‌ల్టీప్లెక్స్‌ల‌ని సునీల్ నారంగ్‌తో క‌లిసి ప్లాన్ చేస్తున్న మ‌హేష్ బెంగ‌ళూరులోనూ క‌పాలి థియేట‌ర్ ప్రాంగ‌ణంలో ఏఎంబీ సినిమాస్‌ క‌పాలి థియేట‌ర్ ని జ‌న‌వ‌రి 16న లాంఛ‌నంగా ప్రారంభించిన విషం తెలిసిందే.

ఇదే త‌ర‌మాలో చెన్నైలోనూ భారీ స్థాయిలో మ‌ల్టీప్లెక్స్‌ల‌కు శ్రీ‌కారం చుట్ట‌బోతున్నార‌ట‌. దానితో పాటు గోవాకు కూడా త‌న మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్ల చైన్‌ని విస్త‌రించే ప‌నిలో ఉన్న‌ట్టుగా టాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. 3డీ స్క్రిన్స్‌, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్ట‌మ్‌తో పాటు ఐమ్యాక్స్ టెక్నాల‌జీ థియేట‌ర్ల‌ని కూడా అందుబాటులోకి తీసుకురానున్నార‌ట‌. ఇదిలా ఉంటే మ‌హేష్ ప్రస్తుతం జ‌క్క‌న్న అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ `వార‌ణాసి`లో న‌టిస్తున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.

మ‌రో ఏడు నెల‌లు పూర్త‌యితే షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది. మిగిలిందిక వీఎఫ్ ఎక్స్ వ‌ర్క్.. దానికి ఎక్కువ టైమ్ ప‌డుతుంది కాబ‌ట్టి ఈ భారీ పాన్ వ‌ర‌ల్డ్ మూవీని 2027లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్న‌ట్టుగా టీమ్ ప్ర‌క‌టించింది. అయితే సినిమా రిలీజ్ వాయిదా ప‌డే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో టీమ్ క్లారిటీ ఇచ్చింది. 2027లో ప‌క్కాగా వ‌స్తామ‌ని ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. అయితే మార్చిలో వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని కొంత మంది అంటుంటే ఏప్రిల్ ఫ‌స్ట్ వీక్‌లో వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని మ‌రికొంత మంది అంటున్నారు.

Tags:    

Similar News