• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మొత్తానికి శ‌ర్వానంద్...

మొత్తానికి శ‌ర్వానంద్ కూడా ఛాలెంజ్ విసిరాడు!

| ఈ మ‌ధ్య‌ కాలంలో సినిమా విజ‌యంలో హీరోలెంత కాన్పిడెంట్ గా ఉంటున్నారో చెప్పాల్సిన ప‌నిలేదు. రిలీజ్ కు ముందు స‌వాల్ విసిరేది కొంద‌రైతే? రిలీజ్ త‌ర్వాత చొక్కా కాల‌రెగ‌రేసే హీరోలు మ‌రికొంత మంది.

By - Srikanth Kontham
Update: 2026-01-22 04:09 GMT

ఈ మ‌ధ్య‌ కాలంలో సినిమా విజ‌యంలో హీరోలెంత కాన్పిడెంట్ గా ఉంటున్నారో చెప్పాల్సిన ప‌నిలేదు. రిలీజ్ కు ముందు స‌వాల్ విసిరేది కొంద‌రైతే? రిలీజ్ త‌ర్వాత చొక్కా కాల‌రెగ‌రేసే హీరోలు మ‌రికొంత మంది. సూప‌ర్ స్టార్ మ‌హేష్ సైతం `మ‌హ‌ర్షి` స‌క్సెస్ అయిన సంద‌ర్భంగా కాల‌రెగ‌రేసి మ‌రీ కొట్టామ‌ని చెప్పారు. ప్ర‌తీ అభిమాని కాల‌రెగ‌రేసి చెప్పిండి అంటూ ఉత్సాహాన్ని నింపారు. ఆ త‌ర్వాత యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా `దేవ‌ర` విష‌యంలో అంతే కాన్పిడెంట్ గా మాట్లాడారు. అతి అన‌కోక‌పోతే? ప్ర‌తీ అభిమాని కాల‌రెగ‌రేసి చెప్పుకునేలా `దేవ‌ర` ఫ‌లితం ఉంటుంద‌న్నారు.

అలాగే హీరో నాని నిర్మించిన `కోర్టు` రిలీజ్ స‌మ‌యంలో? `కోర్టు` స‌క్స‌స్ అవ్వ‌క‌పోతే గ‌నుక తాను న‌టించిన `హిట్ ది థ‌ర్డ్ కేస్` చిత్రాన్నిచూడొద్దంటూ ప‌బ్లిక్ గానే స‌వాల్ విసిరి స‌క్సెస్ అయ్యాడు. అంత‌కు ముందు యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వరం కూడా `క‌` స‌క్సెస్ అవ్వ‌క‌పోతే గ‌నుక సినిమాలు వ‌దిలేసి ఊరెళ్లిపోతాన‌ని ఛాలెంజ్ విసిరి స‌క్సెస్ అయిన‌వాడే. ఇటీవ‌లే యంగ్ హీరో శ‌ర్వానంద్ కూడా `నారీ నారీ న‌డుమ మురారీ`తో మంచి విజ‌యాన్ని అందుకున్నాడు. సంక్రాంతి సంద‌ర్బంగా రిలీజ్ అయిన సినిమాకు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.

ఈ సినిమా రిలీజ్ కు ముందు శ‌ర్వానంద్ ఎలాంటి ఛాలెంజ్ లు చేయ‌లేదు గానీ త‌దుప‌రి సినిమా విష‌యంలో మాత్రం స‌వాల్ చేసాడు. శ‌ర్వానంద్ హీరోగా అభిలాష‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో `బైక‌ర్` అ నే చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. యూవీ క్రియేష‌న్స్ నిర్మిస్తోన్న చిత్రంపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ప్ర‌స్తుతం సెట్స్ లో ఉన్న సినిమాపై శ‌ర్వానంద్ ధీమా వ్య‌క్తం చేసాడు. ` బైక‌ర్` భార‌త‌దేశ‌మే గ‌ర్వ‌ప‌డేలా ఉంటుంద‌న్నారు. ఇది తెలుగు సినిమా అని కాల‌రేగ‌రేసి చెప్పేంత గొప్ప‌గా ఉంటుంద‌న్నాడు.

ఇంత వ‌ర‌కూ శ‌ర్వానంద్ తాను న‌టించిన ఏ సినిమాకు గురించి ఇలా మాట్లాడింది లేదు. సినిమా గురించి నాలుగు ముక్క‌లు పాజిటివ్ గా మాట్లాడ‌టం త‌ప్ప ఈరేంజ్ లో ఏ సినిమాకు ఎలివేష‌న్ ఇవ్వ‌లేదు. మొన్న రిలీజ్ అయిన `నారీ నారీ న‌డుమ మురారీ` గురించి కూడా పెద్ద‌గా మాట్లాడ‌లేదు. అలాంటిది `బైక‌ర్` గురించి ఇంత గొప్ప‌గా మాట్లాడుతున్నాడంటే శ‌ర్వానంద్ ఎంత కాన్పిడెంట్ గా ఉన్నాడో అద్దం ప‌డుతుంది. ఇక్క‌డ కావాల్సింది న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేయ‌డమే కాదు. ఆ న‌మ్మ‌కం నిల‌బ‌డేలా హిట్ కొట్టి చూపించాలి. విజ‌యం అనేది మాట‌లు కోట‌లు దాటినంత సుల‌భం కాదు. విజ‌యం అనే మాట చాలా విమ‌ర్శ‌ల‌కు, ట్రోలింగ్ ల‌కు ద‌రా తీస్తుంది? అన్న‌ది గుర్తించాలి.

Tags:    
  • tollywood 
  • teluguheroes 
  • movieconfidence 
  • boxofficebuzz 
  • sharwanand 
  • bikerfilm 

Similar News

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS