హాట్ లేడీ మరోసారి అలాంటి సీన్లోనా?
బాలీవుడ్ హాట్ లేడీ కం బోల్డ్ బ్యూటీగా భూమీ పడ్నేకర్ ఎలాంటి ఇమేజ్ దక్కించుకుందో చెప్పాల్సిన పనిలేదు.;
బాలీవుడ్ హాట్ లేడీ కం బోల్డ్ బ్యూటీగా భూమీ పడ్నేకర్ ఎలాంటి ఇమేజ్ దక్కించుకుందో చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ ఆరంభం నుండి వైవిధ్యమైన - సాహసోపేతమైన పాత్రలతో ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంది.
కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, కథా బలమున్న సినిమాల్లో నటించి అనతి కాలంలోనే బాలీవుడ్ లో తనదైన ముద్ర వేసింది. 2018 లో రిలీజ్ అయిన `లస్ట్ స్టోరీస్` తో భూమీ ఏ రేంజ్లో ఫేమస్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఆంథాలజీ చిత్రంలో భూమి పెడ్నేకర్ పని మనిషి పాత్రలో అదరగొడుతుంది.
మాటలతో తక్కువ చేతలతో ఎక్కువ అని నిరూపించిన రోల్ అది. ఇంటి యజమానితో సాగించే శృంగారమే సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఆ పాత్రలోని భావోద్వేగాలను ఎంతో ధైర్యంగా పండించింది. భూమీ పడ్నేకర్ పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అనంతరం 2023లో రిలీజ్ అయిన `థ్యాంక్యూ ఫర్ కమింగ్`లో అంతకు మించిన బోల్డ్ యాంగిల్ని హైలైట్ చేసింది. భూమి కెరీర్‌లో అత్యంత బోల్డ్ చిత్రంగా నిలిచింది.లైంగిక సంతృప్తి , వ్యక్తిగత కోరికల చుట్టూ తిరిగే కథ ఇది. ఇందులో భూమీ పడ్నేకర్ `కనికా కపూర్` అనే పాత్రలో ఎంతో సాహసోపేతంగా నటించింది.
అలాగే `డాలీ కిట్టీ ఔర్ వో చమక్తే సితారే` కూడా భూమి 'కిట్టీ' అనే పాత్రతో అంతే రక్తి కట్టించింది. సమాజం విధించిన కట్టుబాట్లను కాదని, కోరికలను తీర్చుకునే క్రమంలో ఒక మధ్యతరగతి అమ్మాయి చేసే ప్రయాణాన్ని ఇందులో బోల్డ్‌గా చూపించారు. ` బదాయి దో` చిత్రంలో భూమి స్వలింగ సంపర్కురాలిగా పాత్రతోనూ ఆకట్టుకుంది.అప్పట్లో ఈ పాత్రను చూసి బోల్డ్ నిర్ణయంగా భావించారంతా. సమాజంలో ఎల్‌జిబిటిక్యూ వర్గం ఎదుర్కొనే సమస్యలను, వారి వ్యక్తిగత జీవితాలను సినిమాలో చాలా లోతుగా ఆవిష్కరించారు.
అలాగే `ది రాయల్స్` వెబ్ సిరీస్ లో తనకంటే వయసులో చిన్నవాడైన ఇషాన్ ఖట్టర్‌తో భూమి రొమాంటిక్ సీన్స్‌లో నటించి వార్తల్లో నిలిచింది. ఈ సిరీస్‌లో వారిద్దరి మధ్య కెమిస్ట్రీ - ఇంటిమేట్ సీన్స్ అంతే బోల్డ్‌గా ఉంటాయి.
ఈ నేపథ్యంలో తాజా వెబ్ సిరీస్ `దల్దాల్` లో భూమీ పడ్నేకర్ ఎక్కడా తగ్గలేదనే ప్రచారం జరుగుతోంది. ఇదో సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ గా అమృత్ రాజ్ గుప్తా తెరెక్కిస్తున్నారు. ఇప్పటికే నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే అందులో ఎక్కడా భూమీ పడ్నేకర్ బోల్డ్ సీన్స్ రివీల్ చేయలేదు. ఇందులో భూమీ పడ్నేకర్ డీసీపీ రీటా ఫెరారీ పాత్రలో కనిపించనుంది. అయితే ఈ పాత్ర ప్లాష్ బ్యాక్ లో భాగంగా ఓ సన్నివేశంలో అమ్మడు బోల్డ్ ఇంటిమేట్ సీన్స్ లో కనిపించనుందని లీకులందుతున్నాయి. మరి ఇందులో నిజాలు మేకర్స్ నిర్ధారించాల్సి ఉంది.