అక్కినేని కోడల దగ్గర బేరాలుండవమ్మా!
ఇండస్ట్రీకి దాదాపు హీరోయిన్లు అంతా లెక్కలేసుకునే వస్తుంటారు. ఫలానా హీరోతో నటించాలి. అక్కడే స్థిరపడాలి.;
ఇండస్ట్రీకి దాదాపు హీరోయిన్లు అంతా లెక్కలేసుకునే వస్తుంటారు. ఫలానా హీరోతో నటించాలి. అక్కడే స్థిరపడాలి. ఆ ఇండస్ట్రీ వాళ్లనే పెళ్లి చేసుకుని స్థిరపడాలి అంటూ కొందరు భామలు కొన్ని లెక్కలతో తెలివిగా ఎంటర్ అవుతుంటారు. ఈ విషయంలో ఎక్కువగా బాలీవుడ్ పరిశ్రమ హైలైట్ అవుతుంది. ఎందుకంటే సౌత్ నుంచి వెళ్లిన వారు సైతం చివరిగా బాలీవుడ్ లోనే స్థిరపడాలని భావిస్తుంటారు. సమంత అలాగే ప్లాన్ చేసుకుని ప్రయాణాన్ని ముందుకు సాగిస్తోంది. ఇంకా ఎంతో మంది హీరోయిన్లు తెలుగులో పాపులర్ అయినా చివరిగా ముంబైకి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.
ఇలా చాలా సందర్భాల్లో బాలీవుడ్ అంటూ ఎందకనో విపరీత మోజు చూపిస్తుంటారు. ఇలాంటి వారికి అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ మాత్రం పూర్తి వ్యతిరేకం. ఎందుకంటే ఇండస్ట్రీకి తాను ఎలాంటి లెక్కలు వేసుకోకుండానే వచ్చానన్నారు. ఇంటర్ పూర్తి చేసిన తర్వాత శోభిత ముంబై వెళ్లిపోయారు. అక్కడే సినీ ప్రయాణం మొదలు పెట్టారు. కేవలం తాను ఎంజాయ్ చేయాలనుకునే కథల్లోనే నటించారు. అంతే తప్ప ఒకే ఇండస్ట్రీలో జెండా పాతేయాలని ఏనాడు అనుకోలేదన్నారు. బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నప్పుడు దక్షిణాది అమ్మాయి అనేవారు.
తెలుగులో సినిమాలు చేస్తే బాంబే అమ్మాయి అంటారు. మరో పరిశ్రమకు వెళ్తే వాళ్లకు తోచింది ఇంకేదో అంటారు. గుర్తింపు అనేది పరిశ్రమను బట్టి మారిపోతుంది. ఓ ఏడాదికి ఇన్ని సినిమాలు..ఇన్ని సిరీస్లు చేయాలని ప్రత్యేకంగా అనుకోలే దన్నారు. బేరాలు-లెక్కలు వేసుకుంటే పని చేయడం కష్టమవుతుందన్నారు. ఎందుకంటే అవకాశాలు ఎలా వస్తాయో తెలియదు. వచ్చిన ఆ ఛాన్స్ నచ్చొ చ్చు..నచ్చకపోవచ్చు. వాటిలో నచ్చిన పాత్రల్ని ఎంచుకుంటూ ప్రయాణం ముందుకు సాగించడమే. అయితే కెరీర్ లో మాత్రం ఎక్కువగా గ్యాప్ రాకూడదన్నారు.
స్పై థ్రిల్లర్ `గూఢచారి` విజయంతో శోభిత ధూళిపాళ్ల టాలీవుడ్ లో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.అటుపై ముంబై దాడుల నేపత్యంలో తెరకెక్కిన మేజర్ లో శోభిత ఒక కీలక పాత్ర పోషించారు. ఈ రెండు సినిమాలు ఆమెకు మంచి గుర్తింపును తెచ్చి పెట్టాయి. ప్రస్తుతం `చీకటి` అనే క్రైమ్ థ్రిల్లర్ లో నటిస్తు న్నారు.ఇందులో శోభిత ట్రూ క్రైమ్ పాడ్‌కాస్టర్ పాత్రలో కనిపిస్తారు. హైదరాబాద్ నేపథ్యంలో ఒక సీరియల్ కిల్లర్ చుట్టూ తిరిగే కథ ఇది. ప్రస్తుతం శోభిత ఫ్యామిలీ లైఫ్ ను ఆస్వాదిస్తూనే సినిమాలు చేస్తున్నారు. నాగచైతన్య-శోభిత ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.