అల్లు సినిమాస్ స్క్రీన్ లో సమస్యలా? అసలు నిజమేంటి?

హైదరాబాద్‌ లోని ప్రీమియం థియేటర్స్ లో ఒకటైన అల్లు సినిమాస్ కు సంబంధించిన భారీ స్క్రీన్‌ పై ఇటీవల సోషల్ మీడియాలో పలు రూమర్లు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.;

Update: 2026-03-18 09:25 GMT

హైదరాబాద్‌ లోని ప్రీమియం థియేటర్స్ లో ఒకటైన అల్లు సినిమాస్ కు సంబంధించిన భారీ స్క్రీన్‌ పై ఇటీవల సోషల్ మీడియాలో పలు రూమర్లు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా దేశంలోనే అతిపెద్ద స్క్రీన్‌ గా క్రేజ్ సంపాదించుకున్న ఆ థియేటర్‌ లో టెక్నికల్ సమస్యలు తలెత్తాయని, స్క్రీన్ సరిగా పని చేయడం లేదని వార్తలు వినిపించాయి. దీంతో మూవీ లవర్స్ లో కొంత ఆందోళన నెలకొంది.

ఆ రూమర్లకు కారణంగా నిలిచింది బుక్‌ మైషోలో కొన్ని గంటల పాటు ఆ స్క్రీన్ కనిపించకపోవడమే. సాధారణంగా కొత్తగా ప్రారంభమైన థియేటర్లలో టెక్నికల్ ఎలిమెంట్స్ పై ఎక్కువగా ప్రేక్షకులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాంటి సందర్భంలో టికెట్ బుకింగ్ ప్లాట్‌ ఫామ్‌ లో స్క్రీన్ కనిపించకపోవడం అనేక అనుమానాలకు దారి తీసింది. సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారింది.

కొందరు నెటిజన్లు అయితే థియేటర్ ప్రారంభానికి ముందు సరైన టెస్టింగ్ చేయలేదేమోనని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో రకరకాల వార్తలు రాగా.. ఇప్పుడు అల్లు సినిమాస్ నిర్వాహకులు రెస్పాండ్ అయ్యారు. ఆ వార్తలన్నింటినీ ఖండించి.. స్పష్టత ఇచ్చారు.. స్క్రీన్‌ లో ఎలాంటి లోపాలు లేవని, పూర్తిగా సక్రమంగా పనిచేస్తోందని క్లారిటీ ఇచ్చారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల తాత్కాలికంగా బుక్‌ మైషోలో స్క్రీన్ కనిపించలేదని తెలిపారు.

బుక్‌ మైషోలో షోలు కనిపించకపోవడం సాంకేతిక కారణాల వల్లే జరిగిందని తెలిపారు. అది థియేటర్‌ కు సంబంధించిన సమస్య కాదని, ఆన్‌ లైన్ బుకింగ్ వ్యవస్థలో జరిగిన చిన్నపాటి గ్లిచ్ మాత్రమేనని వివరణ ఇచ్చారు. ప్రస్తుతం మళ్ళీ స్క్రీన్ అందుబాటులోకి వచ్చిందని, షోలు కూడా సజావుగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. ప్రేక్షకులకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందించడమే తమ లక్ష్యమని చెప్పారు.

అందుకోసం అన్ని టెక్నికల్ వాల్యూస్ ను పాటిస్తున్నామని అల్లు సినిమాస్ యాజమాన్యం పేర్కొంది. ముఖ్యంగా డాల్బీ సౌండ్, హై-క్వాలిటీ విజువల్స్‌ తో తమ థియేటర్ ప్రత్యేకతను సొంతం చేసుకుందని వివరించింది. ఇలాంటి ప్రీమియం ఫీచర్లతో కూడిన థియేటర్‌ లో సమస్యలు ఉన్నాయన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. అదే సమయంలో సోషల్ మీడియాలో వస్తున్న రూమర్లను నమ్మకూడదని కోరింది.

అధికారిక సమాచారం ఆధారంగా మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలని ప్రేక్షకులను కోరింది. చిన్న సాంకేతిక అంతరాయాలను పెద్ద సమస్యలుగా చూపించడం సరైనది కాదని సూచించింది. మొత్తానికి అల్లు సినిమాస్ లోని భారీ స్క్రీన్‌ పై వచ్చిన సమస్యల వార్తలు నిజం కాదని తేలిపోయింది. ప్రస్తుతం థియేటర్‌ లో అన్ని షోలు యథావిధిగా కొనసాగుతున్నాయి. దీంతో అభిమానులు, సినిమా ప్రేమికులు ఎలాంటి డౌట్ లేకుండా వెళ్లి తమ ఫేవరెట్ సినిమాలు ఆస్వాదించవచ్చు!

Tags:    

Similar News