ఫ్యామిలీ జానర్ కేరాఫ్ ఇండస్ట్రీ హిట్!
సినిమాలకు రకరకాల జానర్లు ఉన్నాయి. కామెడీ, కుటుంబం, యాక్షన్, థ్రిల్లర్ అండ్ సస్పెన్స్, క్రైమ్,హారర్ కామెడీ, సైన్స్ ఫిక్షన్, సోషియో ఫాంటసీ ఇలా కొన్నిజానర్లు అంటూ ప్రత్యేకంగా ఉన్నాయి.;
సినిమాలకు రకరకాల జానర్లు ఉన్నాయి. కామెడీ, కుటుంబం, యాక్షన్, థ్రిల్లర్ అండ్ సస్పెన్స్, క్రైమ్,హారర్ కామెడీ, సైన్స్ ఫిక్షన్, సోషియో ఫాంటసీ ఇలా కొన్నిజానర్లు అంటూ ప్రత్యేకంగా ఉన్నాయి. అయితే వీటిలో అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే జానర్ ఏది అంటే కుటుంబ జానర్ అనే చెప్పాలి. ఈజానర్ కథలకు కుటుంబంలో ఎంత మంది ఉంటే ? అన్ని టికెట్లు తెగుతున్నాయి. ఒకే కుటుంబం నుంచి పదిమంది థియేటర్ కు వచ్చి చూసే సినిమాలివే అనడానికి చాలా ఉదాహారణలున్నాయి. ఒకప్పుడు శ్రీకాంత్, జగతపతి బాబు ఈజానర్లో ఎక్కువ సినిమాలు చేసారు.
హీరోలగా ఓ వెలుగు వెలిగారు. ఆ ఇద్దరి హీరోల సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులు ఆస్వాదించేవారు. అయితే కాలక్రమంలో ఆ జానర్ దర్శకులు లేకపోవడంతో? శ్రీకాంత్, జగపతి బాబు లాంటి వారు ఫాం కోల్పోయి క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రూపాంతరం చెందాల్సి వచ్చింది. అదే దర్శకులు ఫ్యామిలీ జానర్ ని వదలకుండా ఉంటే? ఇప్పటికీ వారిద్దరు హీరోలగా కొనసాగే వారే. మిగతా అన్ని జానర్ చిత్రాలను కుటుంబంలో సభ్యులంతా చూడటానికి ఇష్టపడటం లేదన్నది తాజాగా ఓ సర్వేలో తేలింది. కేవలం ఫ్యామిలీ సినిమాలు తప్పా మిగతా మరే జోనర్ అయినా? అంతగా ఆసక్తి చూపించడం లేదంటున్నారు.
ఇందుకు అనీల్ రావిపూడి సినిమాల సక్సెస్ ని కూడా ఉదహరించొచ్చు. అనీల్ రావిపూడి ఇప్పటివరకూ తొమ్మిది సినిమాలు చేసాడు. తొమ్మిది బ్లాక్బస్టర్ అయినవే. ప్రత్యేకించి `ఎఫ్ 2` నుంచి ఆయన తీసిన సినిమాలు చూస్తే? అన్ని సినిమాలు 100కోట్లకు పైగా వసూళ్లు సాధించినవే. `సరిలేరు నీకెవ్వరు` తల్లి తనయుడి సెంటిమెంట్ స్టోరీకి కామెడీని జొప్పించి కుటుంబ చిత్రంగా మిలిచాడు. ఈసినిమా బాక్సాఫీస్ వద్ద 260 కోట్ల వసూళ్లను సాధించింది. `ఎఫ్ 2` కి సీక్వెల్ గా చేసిన `ఎఫ్ 3` 130 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇదీ ఫ్యామిలీ స్టోరీనే.
అనంతరం బాలయ్య తో తెరకెక్కించిన `భగవంత్ కేసరి` ఫ్యామిలీ ఆడియన్స్ కు అంతే కనెక్ట్ అయింది. విజ్జి పాప కోసం బాలయ్య ఎవరికి ఏమి మాట ఇచ్చాడు? ఆ మాట కోసం భగవంత్ తన జీవితాన్ని ఎలా త్యాగం చేశాడు అనే కన్విన్సింగ్ గా చెప్పి 130 కోట్లకు పైగా రాబట్టాడు. అనంతరం `సంక్రాంతికి వస్తున్నాం` సినిమాతో ఏకంగా 300 కోట్ల వసూళ్లతో రికార్డే సృష్టించాడు. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. తాజాగా రిలీజ్ అయిన `మనశంకర వరప్రసాద్ గారు` అలాంటి చిత్రమే. ఈ సినిమా ఇప్పటికే 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈసినిమాలన్నీ కేవలం రీజనల్ మార్కెట్ లో సాధించిన ఫ్యామిలీ కథలే. అంటే రీజనల్ మార్కెట్ లో మిగతా జానర్ సినిమాలకంటే ఫ్యామిలీ జానర్ సినిమాలకు తెలుగు ఆడియన్స్ ఎంతగా పెద్దపీట వేస్తున్నారు? అన్నది అద్దం పడుతుంది. పాన్ ఇండియా విజయాలతో పొలిస్తే వసూళ్ల పరంగా అనీల్ ఫ్యామిలీ స్టోరీలు అన్ని వాటికి ధీటుగానే ఉన్నాయని చెప్పొచ్చు.