కామెడీ కాంట్రవర్సీపై ఎందుకంత అతి

Update: 2016-05-31 19:30 GMT
ఇద్దరు భారతరత్న అవార్డు అందుకున్న మహా వ్యక్తులపై ఏఐబీ ఫేమ్ కామెడీ యాక్టర్ తన్మయ్ భట్ చేసిన వీడియో.. ఇప్పుడు దేశంలో షాకింగ్ గా మారింది. సచిన్ టెండూల్కర్ - లతా మంగేష్కర్ లపై డబుల్ మీనింగ్స్ తో కుళ్లుకామెడీలా అంటూ నెటిజన్లు తెగ రెచ్చిపోతున్నారు. బాలీవుడ్ నుంచి కూడా ఇలాంటి రియాక్షన్సే వస్తున్నా.. సోనమ్ కపూర్ మాత్రం డిఫరెంట్ గా స్పందించింది.

'డియర్ తన్మయ్ భట్.. నీ ఫ్రెండ్ గా నువ్వు ఆ వీడియోను ఏ ఉద్దేశ్యంతో చేశావో అర్ధం చేసుకోగలను. ఎవరినీ నొప్పించడానికి కాదని.. ప్రజలను నవ్వించడానికే ఇలా చేశావని తెలుసు' అంటూ తన్మయ్ ను వెనకేసుకొచ్చింది సోనమ్ కపూర్. 'తన్మయ్ వేసిన స్నాప్ చాట్ జోక్స్ కంటే పెద్ద ఇష్యూలు లేవని అనుకుంటున్నారా?? ఇంత ఓవర్ రియాక్షన్ రావడం నాకు షాకింగ్ గా ఉంది' అంటూ నెటిజన్లు అతిగా స్పందించారనే అభిప్రాయాన్ని వెల్లడించింది ఈ అందాల భామ.

'లివింగ్ లెజెండ్స్ అయిన సచిన్ టెండూల్కర్, లతా మంగేష్కర్ లు.. జరుగుతున్న ఈ హంగామాను అసలు ఏ మాత్రం పట్టించుకోరని నాకు తెలుసు. వారి తరపున ఎవరినో ద్వేషించే పని మానుకోండి' ఓ క్లాస్ కూడా పీకేసింది సోనమ్ కపూర్. సోనమ్ నుంచి వచ్చిన ఈ విభిన్నమైన స్పందన చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది.
Tags:    

Similar News