పవన్ పాలిటిక్స్.. యుద్ధాన్ని ఎదుర్కోబోతున్నారు: నాని

ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి కూడా పవన్ మంచి నాయకుడు అవుతాడు అనే నమ్మకం ఉంది అని చెబుతూ వస్తున్నారు.

Update: 2024-05-07 06:58 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని చాలామంది అభిమానులు కోరుకుంటున్నారు. అయితే గత ఎన్నికల్లో కంటే కూడా ఈసారి ఆయనకు ఎక్కువ స్థాయిలో సినిమా ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ అందుతోంది. మొదటినుంచి కూడా మెగా ఫ్యామిలీలోనే అందరికీ కూడా పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి కూడా పవన్ మంచి నాయకుడు అవుతాడు అనే నమ్మకం ఉంది అని చెబుతూ వస్తున్నారు.


ఇక తేజ్ సాయి ధరంతేజ్ వరుణ్ తేజ్ లాంటి హీరోలు సపోర్టింగ్ ఇవ్వడమే కాకుండా ప్రచారాలు కూడా చేయడానికి సిద్ధమవుతూ ఉండటం విశేషం. ఇండస్ట్రీలో ఉన్న చిన్న తరహా ఆర్టిస్టులు కూడా పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా ప్రచారాలు మొదలుపెట్టారు. అయితే కొంతమంది యువ హీరోలు కూడా పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నారు.

ఇక ఆ లిస్టులో ఇప్పుడు నేచురల్ స్టార్ నాని కూడా చేరడం విశేషం. సాధారణంగా నాని పాలిటిక్స్ గురించి పెద్దగా స్పందించడు. కానీ పవన్ కళ్యాణ్ కోసం ఆయన ప్రత్యేకంగా సోషల్ మీడియాలో స్పందించిన విధానం హాట్ టాపిక్ గా మారింది. ప్రియమైన పవన్ కళ్యాణ్ గారూ, మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోబోతున్నారు. మీ సినిమా కుటుంబ సభ్యుడిగా మీరు కోరుకున్నదంతా సాధిస్తారని మరియు మీ వాగ్దానాలన్నింటినీ నిలబెట్టుకోవాలని ఆశిస్తున్నాను.

Read more!

నేను మీరు విజయం సాధించాలని ఒక సోదర భావంతో కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ సార్.. అని నాని తనదైన శైలిలో మద్దతు ప్రకటించాడు. ఇక నాని ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇక గతంలో పవన్ కళ్యాణ్ నాని సినిమాకు కూడా తన సపోర్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని చేసిన 'అంటే.. సుందరానికి' సినిమా ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ ప్రత్యేక అతిధిగా వచ్చారు.

ఇక పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈసారి ఎలాగైనా గెలుపు సొంతం చేసుకుని పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి అని చాలామంది ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రముఖులు కూడా కోరుకుంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ తన ప్రత్యర్థిపై ఏ స్థాయి లో విజయం సాధిస్తారో చూడాలి.

Tags:    

Similar News