వారు చేసిన పనికి చాలా బాధ పడ్డాను : అదితి

సౌత్‌ తో పాటు బాలీవుడ్‌ లో పలు సినిమాల్లో హీరోయిన్‌ గా నటించిన అదితి రావు హైదరి తాజాగా సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో రూపొందిన హీరామండి వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటించింది.

Update: 2024-05-07 07:30 GMT

సౌత్‌ తో పాటు బాలీవుడ్‌ లో పలు సినిమాల్లో హీరోయిన్‌ గా నటించిన అదితి రావు హైదరి తాజాగా సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో రూపొందిన హీరామండి వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటించింది. ఆ వెబ్ సిరీస్‌ ప్రమోషన్ లో భాగంగా ఈ అమ్మడు ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

హీరోయిన్ గా కెరీర్‌ ఆరంభించక ముందు అదితి రావు హైదరి పలు సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించింది. చాలా సినిమాల్లో ఆమె ఉన్నది కూడా జనాలు గుర్తించలేని పరిస్థితి. బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ మూవీ రాక్ స్టార్‌ లో అదితి రావు హైదరి చిన్న పాత్రలో కనిపించింది. అయితే అందులో ఈమె ఉన్న విషయాన్ని కూడా చాలా మంది గుర్తించలేదు.

రాక్‌స్టార్‌ సినిమా గురించి తాజా ఇంటర్వ్యూలో ముద్దుగుమ్మ అదితి రావు మాట్లాడుతూ... మొదట ఆ సినిమా కోసం నన్ను ఒక కీలక పాత్ర కోసం అంటూ తీసుకున్నారు. షూటింగ్ లో చాలా రోజులు పాల్గొన్నాను. సినిమాలో నా పాత్రను కనీసం 20 నిమిషాలు చూపిస్తారని భావించాను. కానీ చివరకు నా పాత్ర చాలా కట్‌ చేశారు.

రణబీర్ కపూర్‌ నటించిన ఆ సినిమాలో నా పాత్ర చాలా తక్కువ నిడివి ఉంటుంది. గెస్ట్‌ రోల్‌ అనేట్లుగా కూడా నేను కనిపించను. నాకు చెప్పకుండా వారు చేసిన పనికి నేను చాలా బాధ పడ్డాను. ఆ సినిమాలో ముందుగా చెప్పినట్లుగా నా పాత్రను ప్రేక్షకుల ముందు పెట్టి ఉంటే కచ్చితంగా అప్పట్లోనే గుర్తింపు వచ్చి ఉండేది.

సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో వచ్చిన హీరామండి వెబ్ సిరీస్‌ లో అదితి రావు హైదరి పాత్ర కు మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం నెట్‌ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ వెబ్‌ సిరీస్ కు అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకుల నుంచి స్పందన వస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో ఈ వెబ్‌ సిరీస్‌ ట్రెండ్‌ అవ్వడం విశేషం.

Tags:    

Similar News