దేవ‌ర.. క్రూర‌త్వంలో అత‌డి త‌ర్వాతే

ఇంత‌లోనే ఇక్క‌డ దేవ‌ర పెండింగ్ షూటింగ్ ని కొర‌టాల పూర్తి చేస్తున్నారు.

Update: 2024-05-07 05:53 GMT

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ యాక్ష‌న్ చిత్రాల‌తో పాన్ ఇండియా రేసులో దూసుకొస్తున్న సంగ‌తి తెలిసిందే. 'దేవర: పార్ట్ 1', 'వార్ 2' చిత్రాలు భారీ యాక్ష‌న్ కంటెంట్ తో మాస్ అభిమానుల‌ను రంజింప‌జేయ‌నున్నాయి. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ వార్ 2 చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నారు. ఇంత‌లోనే ఇక్క‌డ దేవ‌ర పెండింగ్ షూటింగ్ ని కొర‌టాల పూర్తి చేస్తున్నారు. ఎన్టీఆర్ అవ‌స‌రం లేని కొన్ని షాట్ల‌ను కొర‌టాల తెర‌కెక్కిస్తున్నారు.

తాజా స‌మాచారం మేర‌కు.. ఈ చిత్రంలో విల‌న్‌గా న‌టిస్తున్న బాలీవుడ్ స్టార్‌ హీరో సైఫ్ అలీఖాన్ పై చిత్రీక‌ర‌ణ పూర్త‌యింద‌ని తెలుస్తోంది. సైఫ్ ఖాన్ పై యాక్ష‌న్ సన్నివేశాలు తెర‌కెక్కించార‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లో ఎన్టీఆర్ తిరిగి ఇక్క‌డ‌ టీమ్‌తో చేర‌తార‌ని కూడా తెలుస్తోంది. ప్ర‌స్తుతానికి సైఫ్‌పై స‌న్నివేశాల‌ చిత్ర‌ణ కొన‌సాగుతోంది.

ఈ యాక్షన్-థ్రిల్లర్‌లో ప్రధాన విలన్‌గా నటిస్తున్న సైఫ్ అలీఖాన్ షూటింగ్ ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో జ‌రుగుతోంది. ఎన్టీఆర్ తాత్కాలికంగా అందుబాటులో లేనప్పుడు సైఫ్ పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించార‌ని కూడా తెలుస్తోంది. అక్టోబర్ 10 డెడ్‌లైన్‌ను చేరుకోవడానికి 'దేవర' టీమ్ అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. అయితే త‌దుప‌రి సైఫ్‌- ఎన్టీఆర్ మ‌ధ్య స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ ఉంటుందా లేదా? అన్న‌దానిపై స్ప‌ష్ఠ‌త రావాల్సి ఉంది. దేవర చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో సైఫ్ అలీ ఖాన్ దురదృష్టవశాత్తూ గాయ‌ప‌డి విరామం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. సైఫ్ మళ్లీ షూట్‌లోకి చేర‌డంతో టీమ్‌లో ఉత్సాహం నిండింది.

Read more!

వాస్తవానికి ఏప్రిల్ 5న విడుదల కావాల్సిన 'దేవర' భారీ VFX కారణంగా ఆలస్యమైంది. భారీ తారాగణం... గ్రిప్పింగ్ పెర్ఫార్మెన్స్ తో ఈ చిత్రం ర‌క్తి క‌ట్టిస్తుంద‌ని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ చిత్రంలో షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్ త‌దిత‌రులు ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు.

ఎన్టీఆర్ మ‌రోవైపు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి ముంబైలో 'వార్ 2' చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. ఈ స్పై థ్రిల్లర్ చిత్రంతో యంగ్ టైగర్ బాలీవుడ్‌లో అరంగేట్రం చేయనున్నాడు. ఇందులో ప్రధాన విలన్‌గా నటిస్తున్నాడు.

Tags:    

Similar News