• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నయన్‌ సెకండ్ ఇన్నింగ్స్.....

నయన్‌ సెకండ్ ఇన్నింగ్స్.. ఫ్యాన్స్‌ అసంతృప్తి

| ఇప్పటికి కూడా సౌత్‌ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్స్ జాబితాలో ఈ అమ్మడు ముందు వరుసలో ఉంటుంది.

By - Tupaki Desk
Update: 2024-05-07 09:30 GMT

లేడీ సూపర్ స్టార్‌ నయనతార ఇప్పటి వరకు ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించింది. అందులో స్టార్‌ హీరోలతో కలిసి నటించిన సినిమాలతో పాటు సోలో హీరోయిన్ గా నటించిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పటికి కూడా సౌత్‌ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్స్ జాబితాలో ఈ అమ్మడు ముందు వరుసలో ఉంటుంది.

ఈ మధ్య కాలంలో నయనతార తీరును చూసి చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏడాదికి మూడు నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నయనతార ఇప్పుడు మాత్రం ఆ స్థాయిలో సినిమాలు చేయడం లేదు. గతంతో పోల్చితే ఇప్పుడు ఈ అమ్మడి క్రేజ్ మరింతగా పెరిగింది.

ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు ఈ అమ్మడు పెద్దగా ప్రయత్నించడం లేదు. మెల్లగా హడావుడి లేకుండా సినిమాలు చేస్తూ వస్తోంది. ఈ ఏడాది కొత్తగా నయన్‌ కొత్త సినిమాలకు కమిట్‌ అవ్వడం లేదు. ఈ నేపథ్యంలో ఆమె ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

చిరంజీవి గాడ్‌ ఫాదర్‌ సినిమాలో నయన్‌ సోదరి పాత్రను పోషించింది. ఆ పాత్రకు ఉన్న ప్రాముఖ్య నేపథ్యంలో నయన్‌ ఓకే చెప్పిందిలే అనుకున్నారు. కానీ తాజాగా కేజీఎఫ్‌ స్టార్‌ యశ్‌ హీరోగా రూపొందుతున్న టాక్సిక్‌ సినిమాలో కూడా నయన్‌ సోదరి పాత్రకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చిందనే వార్తలు వస్తున్నాయి.

స్టార్‌ హీరోలకు జోడీగా నటించాల్సిన నయనతార ఇలా ఎందుకు సోదరి పాత్రల్లో నటిస్తుంది అంటూ చాలా మంది పెదవి విరుస్తున్నారు. లేడీ ఓరియంటెడ్‌ సినిమాల విషయంలో కూడా ఈ అమ్మడు గతంలో మాదిరిగా జోరు చూపడం లేదు.

పెళ్లి మరియు పిల్లల తర్వాత నయనతార గతంతో పోల్చితే స్పీడ్‌ తగ్గించింది. నాలుగు పదుల వయసుకు చేరువ అయినా కూడా ఇంకా కూడా అందం విషయంలో పాతికేళ్ల పడుచు ముద్దుగుమ్మలతో పోటీ అన్నట్లుగా ఈ అమ్మడు నిలుస్తుంది. అయినా కూడా హీరోయిన్‌ పాత్రలను కాదని సెకండ్‌ ఇన్నింగ్స్ మొదలు పెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోవడం కష్టమే.

Tags:    
  • Tollywood 
  • Bollywood 
  • Kollywood 
  • LadyOrientedMovie 
  • Nayanthara 
  • FilmIndustry 
  • Chiranjeevi 
  • GodFather 
  • Toxic 
  • Yash 

Similar News

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

Copyright @2026

Powered by Blink CMS