బ్రేక‌ప్ పార్టీ ఏ రేంజ్ లో జ‌రిగిందంటే?

ఎలాంటి ఎమోష‌న్ లేకుండా ఆ పార్టీ న‌డుస్తుంటుంది. తాజాగా అన‌న్యా పాండే-ఆదిత్య రాయ్ క‌పూర్ కూడా అలాంటి పార్టీకే తెర తీసిన సంగ‌తి ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

Update: 2024-05-07 10:05 GMT

ప్రేమ‌లో ప‌డితే పార్టీ..ఆ ప్రేమ వీగిపోతే పార్టీ అన్న‌ది బాలీవుడ్ లో ఓ క‌ల్చ‌ర్. టాలీవుడ్ మ‌రీ అంత స్పీడ్ కాదు కాబ‌ట్టి ఇలాంటి విష‌యాలు బ‌య‌ట‌కు పెద్ద‌గా పొక్క‌వు. బాలీవుడ్ లో నిత్యం చోటు చేసుకునే సంఘ‌ట‌న‌లు కాబ‌ట్టి వాటిని వారు అంతే లైట్ తీసుకుంటారు. ప్రేమ‌లో ప‌డితే పిలిచి స్నేహితుల‌కు పార్టీ ఇస్తారు. పెళ్లి చేసుకున్నా పార్టీ ఇస్తారు. అలా కాకుండా విడిపోతే అంత‌కు మించిన గ్రాండ్ పార్టీ ఇస్తుంటారు. అక్క‌డిది ఓ సంప్ర‌దాయంలా చాలా కాలంగా కొన‌సాగుతున్న‌దే.

ఎలాంటి ఎమోష‌న్ లేకుండా ఆ పార్టీ న‌డుస్తుంటుంది. తాజాగా అన‌న్యా పాండే-ఆదిత్య రాయ్ క‌పూర్ కూడా అలాంటి పార్టీకే తెర తీసిన సంగ‌తి ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఇటీవ‌లే ఇద్ద‌రు రెండేళ్ల ప్రేమ బంధానికి స్వ‌స్తి ప‌లుకుతూ వీడిపోయిన‌ట్లు నెట్టింట జోరుగా ప్ర‌చారం సాగిన సంగ‌తి తెలిసిందే. మొన్న‌టికి మొన్న అనన్య పాండే ఇంట్లో గ్రాండ్ పార్టీ జ‌రిగింది. ఆ పార్టీకి అన‌న్య పాండే స్నేహితుల‌తో పాటు..బాలీవుడ్ కి చెందిన ప్ర‌ముఖులు కూడా హాజ‌ర‌య్యారు. ప్రియుడు ఆదిత్య‌రాయ్ క‌పూర్ కూడా అంటెడ్ అయ్యాడు.

Read more!

దీంతో ఆ పార్టీ అనన్య కుటుంబ స‌భ్యులు ఆకేష‌న‌ల్ గా ఇచ్చార‌నుకున్నారంతా. కానీ అస‌లి సంగ‌తి అది కాదు. అది బ్రేక‌ప్ పార్టీ అని ఆల‌స్యంగా లీకైంది. మేము విడిపోయం...మామ‌ధ్య ఎలాంటి సంబంధం లేద‌ని అధికారికంగా చెబుతూ అన‌న్య ఏర్పాటు చేసిన పార్టీ అది. అయితే ఈ పార్టీలో ఆదిత్యా రాయ్ క‌పూర్ కంట్రిబ్యూష‌న్ ఎంతుందో తెలియాలి. ఇద్ద‌రు క‌లిసి ఇచ్చారా? లేక అన‌న్య వ్య‌క్తిగ‌తంగా ఏర్పాటు చేసుకున్న పార్టీనా? అన్న చిన్న కన్ప్యూజ‌న్ జ‌నాల్లో ఉంది.

పాండే బ్యూటీ దానిపై కూడా ఓ క్లారిటీ ఇచ్చేస్తే ఎలాంటి హంగామా ఉండ‌దు. అదీ సంగ‌తి. ఈ భామ తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా సుప‌రిచిత‌మే. `లైగ‌ర్` సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ప్లాప్ తో మ‌ళ్లీ ఇక్క‌డ క‌నిపిం చ‌లేదు. సొంత గూటికి చేరుకుని అక్కడే అవ‌కాశాలు అందుకుంటుంది. బాలీవుడ్ లో ప‌రిచ‌యాలు పెంచుకుంటూ ముందుకు సాగిపోతుంది.

Tags:    

Similar News