పవన్ బలవంతంగా సినిమాల్లోకి వచ్చారా?

అందుకే తెలుగు సినీ ఇండస్ట్రీలో పవన్ కు ఉన్న అభిమానులు మరే హీరోకి లేరని చాలా మంది అంటుంటారు.

Update: 2024-05-07 07:04 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉందో అందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు పవన్. టాలీవుడ్‌ లోని మిగిలిన హీరోలతో పోలిస్తే ఈయన స్టైల్ వేరు. అందుకే తెలుగు సినీ ఇండస్ట్రీలో పవన్ కు ఉన్న అభిమానులు మరే హీరోకి లేరని చాలా మంది అంటుంటారు.

అయితే పదేళ్ల క్రితం.. 2014లో జనసేన పార్టీని స్థాపించారు పవన్ కళ్యాణ్. అటు రాజకీయాల్లో ఉంటూనే ఇటు సినిమాల్లో నటిస్తున్నారు. మధ్యలో చిన్న గ్యాప్ తీసుకున్నా.. వకీల్ సాబ్ మూవీతో దానిని కవర్ చేశారు. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అనేక ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వల్ల వాటిని తాత్కాలికంగా పక్కన పెట్టారు. మళ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆయా సినిమాలను కంప్లీట్ చేయనున్నారు.

ఇక 2024 ఎన్నికల్లో పిఠాపురం నుంచి బరిలోకి దిగిన పవన్.. ఈసారి ఎలా అయినా చట్టసభలో అడుగుపెట్టాలని పట్టుదలతో ఉన్నారు. అందుకు గాను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక విషయంపై జోరుగా చర్చ జరుగుతోంది. రాజకీయాల్లోకి పవన్ ఎంతో ఇష్టంగా ఎంట్రీ ఇచ్చారని, కానీ సినిమాల్లోకి మాత్రం పవన్ బలవంతంగా వచ్చారని అంతా మాట్లాడుకుంటున్నారు.

ఇప్పుడు ఈ చర్చకు కారణం చిరంజీవినే. ఏపీలో అసెంబ్లీ పోలింగ్ దగ్గరపడుతున్న వేళ.. మెగాస్టార్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. తన కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం పవన్ ది అని చిరు తెలిపారు. సినిమాల్లోకి బలవంతంగానే వచ్చినా.. రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంతో తన తమ్ముడు వచ్చారని చెప్పారు. దీంతో నెట్టింట చిరు వ్యాఖ్యలు.. వైరల్ కావడంతో అంతా పవన్ సినీ ఎంట్రీ కోసం చర్చించుకుంటున్నారు.

Read more!

నిజానికి.. చిరంజీవి ఈరోజు చెప్పిన విషయాన్ని ఇప్పటికే అనేక సార్లు పవన్ తెలిపారు. ఇంటర్ అయ్యాక కంప్యూటర్ డిప్లోమా చదివారు పవన్. ఆ తర్వాత ఏం చేయాలో తెలియక ఇంట్లో పుస్తకాలు చదువుకుంటూ ఒంటరిగా ఉండేవారు. అది గమనించిన సురేఖ (చిరు సతీమణి).. పవన్ ను ఎలాగైనా సినిమాల్లోకి తీసుకెళ్లమని మెగాస్టార్ కు చెప్పారట.

అదే సమయంలో పవన్ కు కూడా ఆమెనే బలవంతంగా ఒప్పించారని వివిధ సందర్భాల్లో పవన్ వెల్లడించారు. ఇప్పుడు చిరు కామెంట్స్ తో ఈ విషయం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. అయితే బలవంతంగా సినిమాల్లోకి వస్తే ఏంటి? ఇండస్ట్రీలో అద్భుతమైన ఫ్యాన్స్ బేస్, సూపర్ హిట్ సినిమాలు సాధించారా లేదా అనేది కావాలి. అలాగే ఇండస్ట్రీలో అత్యధిక ఫ్యాన్ ఫాలోవర్స్ ఉన్న అతికొద్ది మంది హీరోల్లో పవన్ ఒకరు.

ఒక విధంగా ఆయన మంచి తనం, సహాయం చేసే గుణం వంటి అంశాలు జనాలకు దగ్గర చేసినట్లు చెప్పవచ్చు. పవన్ పాలిటిక్స్ లోకి రాకముందే కోట్ల రూపాయలు దానం చేశారు. ఆ విషయాన్ని ఒక ప్రెస్ మీట్ లో కూడా చెప్పాడు. పవన్ కాస్త కమర్షియల్ గా ఆలోచించినా కూడా అతని ఆదాయం ఈపాటికే వేల కోట్లు దాటి ఉండేది. ఏడాదికి రెండు సినిమాలు చేసి, కొన్ని కమర్షియల్ యాడ్స్ చేసుకున్నా కూడా లెక్క 150 నుంచి 200 కోట్ల రేంజ్ లో ఉండేది. కానీ పవన్ ను సినిమా రంగం ఎంత కావాలని అనుకున్నా అతని ఫోకస్ మాత్రం పాలిటిక్స్ వైపు వెళ్లింది. ఏదేమైనా పవన్ అసెంబ్లీలోకి అడుగు పెడితే మాత్రం ఆ వైబ్ మాములుగా ఉండదని చెప్పవచ్చు.

Tags:    

Similar News