ఒకే స్కామ్ నేపథ్యం.. అందుకేనా ఓటీటీలో?
అభిషేక్ బచ్చన్ - ఇలియానా జంటగా నటించిన చిత్రం `ది బిగ్ బుల్`. షేర్ మార్కెట్ స్కామ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కించారు. ఏప్రిల్ 8న ఓటీటీలో స్ట్రీమింగుకి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రచారంలో వేగం పెంచింది.
ఇంతకుముందే రిలీజైన టీజర్ ట్రైలర్ ఆసక్తిని పెంచాయి. తాజాగా ది బిగ్ బుల్ నుండి మొదటి ట్రాక్ స్నీక్ పీక్ ను చిత్రకథానాయకుడు అభిషేక్ స్వయంగా సోషల్ మీడియాల్లో పంచుకున్నారు. ఇష్క్ నమాజా .. అభిషేక్- నికితా దత్తా జంటపై రొమాంటిక్ నంబర్. ఈ పాట విజువల్స్ ఆసక్తినైతే పెంచాయి. నేడు పూర్తి పాట రిలీజ్ కానుంది.
అయితే ది బిగ్ బుల్ సినిమాకి ఇంతకుముందే రిలీజైన `స్కామ్ 1992`కి కథ పరంగా సారూప్యతలు ఉన్నాయి. స్టాక్ బ్రోకర్ కం స్కామ్ స్టర్ హర్షద్ మెహతా కుంభకోణం నేపథ్యంలోనే ఈ రెండు చిత్రాలు తెరకెక్కాయి. అయితే ఆ సినిమా పెద్ద తెరపై రిలీజ్ కాగా.. ది బిగ్ బుల్ ని ఓటీటీని దృష్టిలో ఉంచుకుని తెరకెక్కించారు. ఇందులో అదనంగా పాటలు ఉన్నాయి... కమర్షియల్ హంగులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చిత్రబృందం ధీమాను వ్యక్తం చేస్తోంది. థియేటర్లలో చూసినా ఓటీటీల్లో ఆదరిస్తున్నారు కాబట్టి ది బిగ్ బుల్ ఈ వేదికపైనా మెప్పిస్తుందనే భావిస్తున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
Full View
Full View Full View