పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్న సింగ‌ర్ సునీత‌?

Update: 2018-07-19 05:33 GMT
త‌న మ‌ధుర‌గానంతో.. విన్నంత‌నే మ‌ళ్లీ మ‌ళ్లీ వినాల‌నిపించే వాయిస్ తో తెలుగు వారికి ద‌గ్గ‌ర‌య్యారు సింగ‌ర్ సునీత‌. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఆమె చ‌క్క‌గా పాడినా.. రావాల్సినంత గుర్తింపు రాలేద‌ని చెప్పాలి. డ‌బ్బింగ్ చెప్పేందుకు పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌ని సునీత‌.. డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచిపేరు తెచ్చుకుంది.

త‌న వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించిన అంశాల్ని అంద‌రి ప్ర‌ముఖుల మాదిరి గుట్టుగా ఉంచుకోకుండా.. ఉన్న‌ది ఉన్న‌ట్లుగా.. నిజాయితీగా చెప్పే ధైర్యం సునీత సొంతం. వ్య‌క్తిగ‌త జీవితంలో ఎదురైన ఎన్నో ఒడిదుడుకుల్ని ఒంట‌రిగా పోరాడిన ఆమె.. కొంత‌కాలం క్రితం భ‌ర్త‌తో విడిపోయిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా ఆమెకు సంబంధించిన ఒక వార్త సోష‌ల్ మీడియాలో హ‌డావుడి చేస్తోంది. త్వ‌ర‌లో ఆమె మ‌రో పెళ్లి చేసుకోనున్నార‌ని చెబుతున్నారు. సింగ‌ర్ గా.. డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ గా వంద‌ల సినిమాల‌కు ప‌ని చేసిన సునీత‌.. త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోవ‌టానికి సిద్ధ‌మైన‌ట్లుగా చెబుతున్నారు. చిన్న‌త‌నంలోనే ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన ఆమె.. కిర‌ణ్ అనే వ్య‌క్తిని పెళ్లాడారు. వారికి ఇద్ద‌రు పిల్ల‌లు. కొన్నేళ్లుగా సింగిల్ మ‌ద‌ర్ గా త‌న బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్న సునీత‌.. తాజాగా పెళ్లికి సిద్ధ‌మైన‌ట్లుగా చెబుతున్నారు. అయితే.. ఈ వాద‌న మొత్తం సోష‌ల్ మీడియానే త‌ప్పించి.. ఆమె స్వ‌యంగా ప్ర‌క‌టించింది లేదు.

నిజానికి సింగ‌ర్ సునీత మీద మొద‌టి నుంచి ఏదో ఒక విష‌యం మీద పెద్ద ఎత్తున ఊహాగానాలు తెర మీద‌కు వ‌చ్చాయి. ఆమె పెళ్లి గురించి గ‌తంలో ప్ర‌శ్నించ‌గా.. త‌న‌కు అలాంటి ఉద్దేశం లేన‌ట్లుగా వ్యాఖ్యానించారు. ఇందుకు భిన్నంగా ఇప్పుడు ఆమె పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్లుగా వ‌స్తున్న సోష‌ల్ మీడియా వార్త‌ల‌పై ఆమె ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Tags:    

Similar News