తాతతో తమన్నా.. ఆ సీక్రెట్ చెప్పేసింది

Update: 2016-11-01 05:01 GMT
మిల్కీ బ్యూటీ తమన్నా దీపావళి సందర్భంగా ఓ చిన్న బ్రేక్ తీసుకుని సొంతూరు వెళ్లిపోయింది. ఇంతకీ తమన్నా బ్రేక్ ఇచ్చినది ఎవరికంటే.. శింబు హీరోగా రూపొందుతున్న అంబనవాన్-అసరాధవాన్-అడంగాధవన్ సినిమా షూటింగ్ కి. నవంబర్ 9న మళ్లీ ఈ మూవీ కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుండగా.. ఆ రోజు కల్లా తిరిగి చెన్నైలో వాలిపోనుంది మిల్కీ.

ఏఏఏ అంటూ ఈ చిత్రాన్ని వ్యవహరిస్తుండగా.. ఈ మూవీలో శింబు 3 రకాల గెటప్స్ లో కనిపించనున్నాడు. రీసెంట్ గా శింబుతో కలిసి తమన్నా ఉన్న ఓ పోస్టర్ ను కూడా రివీల్ చేశారు. అందులో ఏజ్డ్ కేరక్టర్ తో తమ్మూ క్లోజ్ గా కనిపించడం.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే.. ఈ పోస్టర్ పైనా.. తన పాత్రపైనా చిన్నపాటి క్లారిటీ ఇచ్చిన తమన్నా.. అందులో కాస్త సస్పెన్స్ ని కూడా మెయింటెయిన్ చేసింది.

'ఏఏఏలో నేను ఆర్టిస్ట్ గా కనిపిస్తాను. సాధారణంగా మన సినిమాల్లో హీరోయిన్ రోల్ కి ఇంపార్టెన్స్ ఉండదు కానీ.. ఈ మూవీలో మాత్రం నా రోల్ చాలా ఇంపార్టెంట్. ఆ పోస్టర్ లో అశ్విన్ తాతగా శింబు కనిపిస్తాడు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల మాదిరిగా ఏఏఏ ఉండదు. అసలు ఈ చిత్రాన్ని నేను అంగీకరించడానికి రీజన్ ఇదే' అని చెబుతోంది మిల్కీ బ్యూటీ తమన్నా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News