లెజెండ‌రీ న‌టుడి ధాంప‌త్య జీవితంలో ఇన్ని కుతంత్రాలా?

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో దిలీప్ కుమార్- సైరా బానుల ప్రేమకథ అద్భుతమైన కావ్యంగా నిలిచిపోయింది. దశాబ్దాల పాటు సాగిన వారి బంధం ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది.

Update: 2026-06-21 14:30 GMT

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో దిలీప్ కుమార్- సైరా బానుల ప్రేమకథ అద్భుతమైన కావ్యంగా నిలిచిపోయింది. దశాబ్దాల పాటు సాగిన వారి బంధం ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. అయితే ఎంతటి ఆదర్శ దంపతుల జీవితంలోనైనా కొన్ని ఒడిదొడుకులు సహజం అనడానికి వారి వైవాహిక జీవితంలో చోటుచేసుకున్న ఓ సంఘటనే ఉదాహరణ. సైరా బానుతో వివాహం జరిగిన పదహారేళ్ల తర్వాత 1981లో దిలీప్ కుమార్ అస్మా అనే మహిళను రెండవ వివాహం చేసుకోవడం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ సంఘటన దీలీప్ -సైరా మధ్య తాత్కా లికంగా దూరాన్ని పెంచింది. రెండవ వివాహం గురించి సైరా బానుకు పత్రికల ద్వారా తెలియడం ఆమెను తీవ్ర మానసిక వేదనకు గురిచేసింది. అయితే అస్మాతో దిలీప్ కుమార్ వివాహ బంధం ఎంతో కాలం సాగలేదు. తాను తీసుకున్న నిర్ణయం ఎంత పెద్ద తప్పో దిలీప్ కుమార్ త్వరగానే గ్రహించారు. వెంటనే అస్మాకు విడాకులు ఇచ్చి తిరిగి మొదటి భార్య సైరా బాను వద్దకు చేరుకున్నారు. అనంత‌రం వారి బంధం మరింత బలపడటం విశేషం.

అయితే ఈ వివాదం కారణంగా అస్మా తీవ్రమైన మీడియా ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వచ్చింది. నిరంతరం వ్యక్తిగత జీవితంపై కథనాలు రావడం.. కెమెరా క‌ళ్లు వెంటాడటంతో ప్రశాంతత కోసం ఆస్మా భారతదేశాన్ని విడిచి కెనడాలోని వాంకోవర్‌కు వెళ్లిపోయారు. ఆ తర్వాతి కాలంలో ఓ ఇంట‌ర్వ్యూలో తన గురించి మీడియాలో వచ్చిన వార్తల్లో 95 శాతం అవాస్తవాలని.. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే అత్యంత వ్యక్తిగత సంభాషణలను కూడా మీడియా తమ ఊహా శక్తితో కల్పిత కథలుగా మలిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.

కొన్ని సంవ‌త్స‌రాలకు దిలీప్ కుమార్ తన ఆత్మకథ `ది సబ్‌స్టాన్స్ అండ్ ది షాడో`లో ఈ రెండవ వివాహం వెనుక ఉన్న అసలు విషయాలను విప్పారు. హైదరాబాద్‌ లో ఓ అభిమానిగా పరిచయమైన అస్మాతో ప్రమేయం ఎలా పెరిగిందో వివరించారు. తన చుట్టూ ఉన్న కొందరు స్వార్థపరులు కుట్ర పూరిత వాతావరణాన్ని సృష్టించి ఇరికిం చారని.. అస్మాను వివాహం చేసుకోవడం తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పిదమని ఆ పుస్తకంలో బహిరంగంగా అంగీకరించారు.

దిలీప్ కుమార్ జీవిత చరిత్రపై పనిచేసిన రచయిత్రి ఉదయతార నాయర్ ఈ మొత్తం ఉదంతం వెనుక దిలీప్ కుమార్ సోదరీమణుల హస్తం ఉందన్నారు. వారికి సైరా బాను అంటే ఇష్టం లేకపోవడంతో ఆమెపై ప్రతీకారం తీర్చుకోవడానికి రెండవ వివాహాన్ని వ్యూహంలా ఉపయోగించారని పేర్కొన్నారు. అంతే కాదు 1972 లో సైరా బాను గర్భవతిగా ఉన్నప్పుడు ఎనిమిదో నెలలో బిడ్డను కోల్పోవడం.. ఆ తర్వాత వారికి పిల్లలు కలగకపోవడం కూడా ఈ వివాదానికి.. సామాజిక ఊహాగానాలకు కొంత వరకు కారణంగా నిలిచింది.

ఇవ‌న్నీ తెలిసిన దిలీప్ కుమార్ తాను చేసిన తప్పుకు జీవితాంతం పశ్చాత్తాపపడ్డారు. తనపై ఎనలేని నమ్మకం పెట్టుకున్న సైరా బాను మనస్సును గాయపరిచినందుకు తనను తాను ఎప్పటికీ క్షమించుకోలేనని ఓ సంద‌ర్భంలో పేర్కొన్నారు. ఆ క్లిష్ట సమయంలో కూడా సైరా భ‌ర్త‌కు అండగా నిలబడటంతో లీగల్ ప్రాసెస్ ద్వారా తప్పును సరిదిద్దుకున్నారు. ఇకపై జీవితంలో రెండవ పెళ్లి ప్రస్తావన రాదంటూ సైరాకు లిఖితపూర్వక హామీ ఇచ్చి బంధాన్ని తిరిగి నిలబెట్టుకున్నారు.

Tags:    

Similar News